• క్వీన్ రీమేక్ లో నటిస్తోంది అమలా పాల్. మలయాళం క్వీన్ రీమేక్ గురించి అమలా చాలా సంతోషంగా వుంది. రేవతి దర్శకత్వంలో నటించటం చాలా నచ్చిందట. అమ్మ నాన్న నేను అందరం ఆమె వీరాభిమానులం. అంటోంది అమలా పాల్. ఈ సబ్జెక్టు ను ప్రతి చోటా చెప్పాలి. దీని ప్రభావం విడుదలైన ప్రతి చోటా ఉంటుంది. ఎందరో మహిళలు రిలేట్ అవుతారు. మహిళల వికాసం తమని తాము అందంగా మలుచుకోవడం తెలుసుకుంటారు. క్వీన్ కథను కేరళ పద్దతి లో చెపితే బావుంటుందనుకుంటున్నాను అన్నారామె. సూసీ గణేష్ ' తురుట్టు పాయిలె ' ధనుష్ వి ఐ పి -2 ,వడచెన్నయ్ , సిన్ద్రిల్లా క్వీన్ చిత్రాల్లో చాలా బిజీగా వుంది అమలా పాల్. వడ చెన్నయ్ లో నార్త్ చెన్నయ్ అమ్మయిగా నటిస్తోంది అమలా పాల్. శారీరికంగా చాలా మారాలి. ఇది పీరియడ్ ఫిల్మ్. అంతా సహజంగా ఉంటుంది. ఇదో మంచి సబ్జెక్టు. అలాగే చెన్నయ్ లో వేగన్ రెస్టారెంట్ ప్రారంభిస్తాను . రెస్టారెంట్ తో పాటు యోగా మెడిటేషన్ కూడా నేర్పిస్తాను. మరింత క్రమశిక్షణ గా ఆరోగ్యంగా నా జీవన శైలి మార్చుకుంటున్నాను అంటోంది అమలా పాల్ .

    రెస్టారెంట్ బిజినెస్ లోకి అమలా పాల్

    క్వీన్ రీమేక్ లో నటిస్తోంది అమలా పాల్. మలయాళం క్వీన్ రీమేక్ గురించి అమలా చాలా సంతోషంగా వుంది. రేవతి దర్శకత్వంలో నటించటం చాలా నచ్చిందట. అమ్మ…

  • స్నానాల గదులు వంటింటి సింకులు తలుపులు గట్టిగ మూసేసి కాబోర్డ్స్ వాసనా గా ఉంటాయి. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు పండ్లు పాలు , పెరుగు నిల్వ చేసే ఫ్రిజ్ కూడా . ఇలాంటప్పుడు ఇంట్లో వాడేసిన నిమ్మ చెక్కలు లేదా నిమ్మకాయ చిన్న చిన్న ముక్కలు తరిగి గాని ఫ్రిజ్ ట్రే లో పడేసి ఇందులో ఒక చుక్క వెనిగర్ ని కలిపి డీప్ ఫ్రిజ్ లో పెట్టేస్తే అవి తెల్లారేసరికి గట్టిగా అయిపోతాయి. ఈ ఐస్ క్యూబ్స్ ని ట్రే నుండి తీసేసి జిప్ లాక్ బ్యాగ్ లో వేసి భద్రపరచాలి. ఈ నిమ్మముక్కల ఐస్ క్యూబ్స్ ఎంతో ఉపయోగపడతాయి . దుర్వాసన వచ్చే స్నానాల గదులు సింకుల్లో ఈ ముక్కలు పడేస్తూ నెమ్మదిగా కరిగిపోతాయి. వాసనా లేకుండా చేస్తాయి. పైగా నిమ్మ పరిమళం తో ఉంటాయి. ఇలా లాక్ చేసిన కప్ బోర్డ్స్ లో గంధపు ఉండలు కలరా ఉండలు ఎండిన పువ్వులు తప్పకుండా ఉంచాలి. ఇప్పుడు బజార్లో ఎన్నోరకాల పువ్వులు నింపిన ప్యాకెట్లు వస్తున్నాయి. వీటిని హాల్లో టేబుల్ పైన పెట్టినా మంచి వాసన వస్తాయి. ఇది మల్లెల కాలం . గుప్పెడు మల్లెల్లు సన్న జాజులు చాలు ఇల్లంతా సువాసన వచ్ఛేయటానికి.

    ఇల్లంతా సువాసనలు

    స్నానాల గదులు వంటింటి సింకులు తలుపులు గట్టిగ మూసేసి కాబోర్డ్స్ వాసనా గా ఉంటాయి. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు పండ్లు పాలు , పెరుగు నిల్వ…

  • నీహారికా , ఇప్పుడే ఒక చిల్డ్రన్ సైకాలజిస్ట్ ప్రసంగం విన్నారు . ఎంత బావుందంటే పిల్లలకు ప్రేమ భాష ఒక్కటే తెలుసట. ప్రేమించటాన్ని ప్రేమించబడటాన్ని వాళ్ళు ఎంతో ఇష్టపడతారు. తల్లి తండ్రుల నుండి అదే ఎక్స్ పెక్ట్ చేస్తారట. పిల్లల్ని పిలిచే ముందు స్వరంలో మార్దవం నిలుపుకోవాలట . మాటలు వినాలన్న ఆచరించాలన్నా ఈ మార్దవం స్వరంలో పలికే ప్రేమ పిల్లల్ని కట్టి పడేస్తాయట. ఆత్మీయ స్వరంతో చెపితే దేన్నైనా చేస్తారట పిల్లలు. వాళ్ళ పై అధికారం చెలాయించకూడదు . ముఖ్యంగా నలుగురి ముందు వాళ్లపై అసలు అరవకూడదు. పిల్లలకు అన్నీ నేర్పాలి . వాళ్ళ గది సర్దుకోవటం దగ్గర నుంచి మనం అనుకుంటున్నా మంచి లక్షణాలతో సహా అన్నీ లేకుంటే అసలివి పెద్దవాళ్ళు ఊహిస్తున్నారని పిల్లలకెలా తెలుసు అంటారు ఎక్స్ పెర్ట్స్. నిజమే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు నిద్ర చేష్టలు మనకి ఇవ్వాల్సిన గౌరవం పెద్దలను ప్రేమించవలిసిన విదంభం ఏదైనా సరే మనం నేర్పితేనే కదా . ఇలా ఉండటం గుడ్ బిహేవియర్ అని మనం వాళ్లకు మొదటి గోరు ముద్ద తినిపించినంత ప్రేమగా నేర్పాలిట. నిజంగా పేరెంట్స్ అంత పేషెన్సీ తో వున్నా అనిపిస్తోంది. బావుంది కదూ.. !

    పిల్లలకు తెలిసిన భాష ప్రేమే

    నీహారికా , ఇప్పుడే ఒక చిల్డ్రన్ సైకాలజిస్ట్ ప్రసంగం విన్నారు . ఎంత బావుందంటే పిల్లలకు ప్రేమ భాష  ఒక్కటే తెలుసట. ప్రేమించటాన్ని ప్రేమించబడటాన్ని వాళ్ళు ఎంతో…

  • దేశ రాజధాని నగరం ఢిల్లీ కి తోలి మహిళా న్యూస్ డ్రైవర్ గా ఎంపికైంది నల్లగొండ జిల్లాకు చెందిన సరిత. నల్గొండ లో ఆటోలో ఓ మినీ బస్ డ్రైవర్ గా పనిచేసిన సరితా డిటిసి లో మహిళా బస్ డ్రైవర్ గా కావాలనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. సరితా సెలక్టయ్ 25 రోజుల శిక్షణ తర్వాత తోలి మహిళా డ్రైవర్ గా సరోజినీ నగర్ డిపోలో ఆమెను నియమించారు. TSRTC లో ఆమె శుక్రవారం విధుల్లో చేరాక ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ పి . మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే షి క్యాబ్స్ 40 వరకు మంజూరు చేశామని సరితా ఒకవేళ క్యాబ్ డ్రైవర్ గా పనిచేయాలనుకుంటే ఆమెకో కారు ఇస్తామని చెప్పారు. స్త్రీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

    టీఎస్ఆర్టీసీ మొట్టమొదటి మహిళా డ్రైవర్ సరితా

    దేశ రాజధాని నగరం ఢిల్లీ కి తోలి మహిళా న్యూస్ డ్రైవర్ గా ఎంపికైంది నల్లగొండ జిల్లాకు చెందిన సరిత. నల్గొండ లో ఆటోలో ఓ మినీ…

  • వయసుకి తగ్గ దుస్తుల్లోనే ఎవరైనా అందంగా వుంటారు అంటుంటారు కానీ ఈ వయసుకి తగ్గ అన్న విషయం పక్కనపెట్టి ఎలాంటి దుస్తులైన హుందాగా వుండే విధంగా ఉంటే చక్కగా వుంటారు. చీరలు సల్వార్లు ప్యాంట్లు షర్టులు ఏవైనా కానీండి అభిరుచిని పట్టి ఎంచుకోవాలి. అవి ఎలాంటి వైనా బాడీ షేప్ ని గాక వ్యక్తిగత స్టయిల్ ను ప్రతిబింబించాలి . వాడే హ్యాండ్ బ్యాగ్స్ వంటి యాక్సిసరీస్ కూడా సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. వార్డ్ రోబ్ కు ఏ దుస్తుల్ని జత చేస్తున్నా విభిన్నతకు ప్రాధాన్యం ఇస్తూ సులువుగా మిక్స్ అండ్ మ్యాచ్ గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పైగా వేసుకునే దుస్తులు ముందు సీజన్ కు మ్యాచ్ అవ్వాలి. మారే ఋతువుల్లో కొన్ని దుస్తులు కొన్ని వాతావరణాలు సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు మారిన ఎండ వేళ లో నల్లని డ్రెస్ అందంగా వుంది కదా అని వేసుకుంటే వేడికి మూడ్ ఆఫ్ అయిపోతుంది .

    ఏదైనా హుందాగా ఉండాలి

    వయసుకి తగ్గ దుస్తుల్లోనే ఎవరైనా అందంగా వుంటారు అంటుంటారు కానీ ఈ వయసుకి తగ్గ అన్న విషయం పక్కనపెట్టి ఎలాంటి దుస్తులైన హుందాగా వుండే విధంగా ఉంటే…

  • విజయవాడకు చెందిన లక్ష్మి శ్రావ్య కాగోలాను తన ఫోటోగ్రఫి నైపుణ్యంతో అంతర్జాతీయ వేదిక పై మెరిసింది. సోవీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ సంస్థ ఏటా నిరవహించే పోటీల్లో విద్యార్థి విభాగంలో విజేతగా లక్ష్మి శ్రావ్య నిలబడింది. భారత దేశంలో ఇప్పటివరకు విద్యార్థి విభాగంలో ఎంపికైన ఏకైక వ్యక్తి శ్రావ్య కావటం విశేషం. ప్రస్తుతం న్యూయార్క్ లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ లో మాస్టర్ ఇన్ ది డిజిటల్ ఫోటో గ్రఫీ చేస్తున్న శ్రావ్య ఉత్తర అమెరికా ఖండం నుండి ఎంపికైంది. విజయవాడ కు చెందిన సురేష్ కొగొలను శ్యామల దంపతుల కుమార్తె శ్రావ్య నగరంలోని కే .ఎల్ . యూ లో 2012 లో ఇంజినీరింగ్ పూర్తిచేసి రెండేళ్ల క్రిందట గిజిటల్ ఫొటోగ్రఫీ కోసం న్యూయార్క్ వెళ్ళింది .

    విజయవాడ యువతికి ప్రపంచ ఫోటోగ్రఫి అవార్డు

    విజయవాడకు చెందిన లక్ష్మి శ్రావ్య కాగోలాను తన ఫోటోగ్రఫి నైపుణ్యంతో అంతర్జాతీయ వేదిక పై మెరిసింది. సోవీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ సంస్థ ఏటా…

  • టీ తాగితే హుషార్.. ఈ మధ్య ఇంకో ప్రయోజనం గుర్తించారు పరిశోధకులు. రోజు మూడు సార్లు బ్లాక్ టీ తాగేవారికి రక్తపోటు గుర్తించనంతగా తగ్గుతుందని వారు పేర్కొన్నారు. రక్తనాళాల లోపలి కణాల పనితీరును టీ లోని పాలీ ఫెనాల్స్ మెరుగు పరుస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పదార్ధాలు రక్త నాళాల లోపలి కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఉదరం చుట్టూ కొవ్వును శారీరిక బరువును తగ్గించటంలో సహకరిస్తాయని తద్వారా రక్తపోటు ప్రభావితం అవుతుందని పరిశోధకులు వివరించారు . అన్ని టీ పొడులు క్వామేలియా సెన్సటివ్ పొదల ఆకుల నుంచి తయారయ్యేవే. గ్రీన్ టీ ని ఫర్మెంట్ చేయరు. కనీస మాత్రంగా ప్రాసెస్ చేస్తారు. ఈ ఆకుల్ని సింపుల్ గా స్టీమ్ చేస్తారు. బ్లాక్ టీ ని పెర్మెంట్ చేసి ఆక్సిడైజ్ చేస్తారు. ఊలాంగ్ టీ ని పాక్షికంగా ఆక్సిడైజ్ చేస్తారు. అంటే ఇది గ్రీన్ బ్లాక్ టీ లకు మధ్యస్థంగా ఉంటుంది. వైట్ టీ ని కొద్దిగా ఓపెన్ అయిన మొగ్గలు లేత ఆకులతో తయారుచేస్తారు. వీటిని స్టీమ్ చేసి డ్రై చేస్తారు. ఇది టీ ఆకుల నడుమగల తేడా ..

    బిపి ని తగ్గించే టీ

    టీ తాగితే హుషార్.. ఈ మధ్య ఇంకో ప్రయోజనం గుర్తించారు పరిశోధకులు. రోజు మూడు సార్లు బ్లాక్ టీ తాగేవారికి రక్తపోటు గుర్తించనంతగా తగ్గుతుందని వారు పేర్కొన్నారు.…

  • కొందరికి తీపి అంటే ఎంతో ఇష్టం ,మరి కొందరికి కారం ఇలా పలు రకాల రుచుల సమ్మేళనం తో పలానాది తినాలి అనే కోరిక నాలుకను లాగేస్తుంటాయి . ఇలా తినాలన్న కోరిక మన బుర్రలో వుందా ? లేదా మనకేం కావాలో శరీరానికే తెలుస్తుందా ? ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం చాలా సింపుల్ . ఇది చాలా అవసరం కూడా. మనం శరీరానికి నిజంగా అవసరం అయ్యే పదార్ధాలు తినాలన్నా కోరిక ఏవీ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆరోగ్య వంతమైన పదార్ధాలే. తినాలన్న కోరిక కూడా చాలా అరుదే. తినాలనే కోరికలు సంతోషపూరితమైన ఎమోషనల్ అనుసంధానాలు అంటారు నిపుణులు . అయితే కూల్ డ్రింక్స్ క్యాండీలు కంటికి ఇంపుగా కనిపించే ఏదైనా సరే తినాలనే కోరికను బయోలాజికల్ మూలం ఉంటుంది. ఉప్పు ఫ్యాట్ మెదడులోని ఆహ్లాదకర కేంద్రాలను చురుగ్గా చేస్తాయి. అంటే తినాలన్న కోరిక ఎక్కువ భగం మెదడుదే తప్ప శరీరం తప్పు ఏవీ లేదు. ఈ విషయం తేలింది కనుక ఆలోచనను ఎలా కంట్రోల్ లో పెట్టుకోవటమో ఆలోచించుకోవాలి.

    తినాలన్న కొరిక మెదదుదా ? శరీరానిదా ?

    కొందరికి తీపి అంటే ఎంతో ఇష్టం ,మరి కొందరికి కారం ఇలా పలు రకాల రుచుల సమ్మేళనం తో పలానాది తినాలి అనే కోరిక నాలుకను లాగేస్తుంటాయి…

  • ఇంట్లో ఎక్కడ చూసినా రాలే వెంట్రుకలు కనబడి మనకు కష్టం కలిగిస్తే ముందు ఈ గృహా చికిత్సలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ వంటి గోరు వెచ్చని సహజ నూనెతో మాడు మసాజ్ చేసుకుని హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. మందార ఉసిరి మల్లె పువ్వులు కొబారినూనెలో వేసి కాచి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అప్లయ్ చేయటం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. రాత్రంతా మెంతులు నానబెట్టి రుబ్బు కొబ్బరి పాలతో కలిపి శిరోజాలకు అప్లయ్ చేయాలి. పెరుగులో ఎగ్ వైట్ కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. గోరువెచ్చని నూనెలో నిమ్మరసం వెనిగర్ కలిపి చివరి వాష్ గా వాడాలి. హెయిర్ వాష్ కు ముందు కొబ్బరి నూనె అప్లయ్ చేయాలి. హెయిర్ కేర్ స్టైలింగ్ ఉత్పత్తుల్ని హేతుబద్దంగా వాడాలి. హెయిర్ డ్రై లు రంగులు శిరోజాల స్క్రబ్బర్స్ కు హాని కలిగిస్తాయి. బ్లో డ్రయింగ్ రీ బాండింగ్ వంటి హీటింగ్ పద్ధతుల క్యూటికల్స్ ఓపెన్ అవటానికి జుట్టు చిట్లి పోవటానికి ప్రధాన కారణం అవుతాయి.

    ఈ గృహ చికిత్సల వల్ల మేలే

    ఇంట్లో ఎక్కడ చూసినా రాలే వెంట్రుకలు కనబడి మనకు కష్టం కలిగిస్తే ముందు ఈ గృహా చికిత్సలు  జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ వంటి గోరు…

  • ప్రయాణాల్లో జాగ్రత్త అనుకుంటూ నగలు తీసుకుపోయేందుకు సాధారణంగా ఇష్టపడరు . కానీ ఆ ప్రయాణాలు ఏ పెళ్లిళ్లకు అకేషన్స్ కు అయితే కొన్న నగలైనా కావాలి. భద్రత విషయంలో మొదటి శ్రద్ధ ఉండాలి . అలాగే ప్రయాణాల్లో నగలు దెబ్బతినకుండా రెండో జాగర్త ఉండాలి . అనేక అరలు గల ట్రావెల్ పౌచ్ లు వాడాలి. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేముందర ఆభరణాలు సాఫ్ట్ టిస్యూ పేపర్ లో చుట్టాలి . విమాన ప్రయాణాలు చేసే వారైతే ఆబరంలు క్వచ్చిన్ లగేజ్ తోనే ఉంచుకోవాలి . ఇక వేరే ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు సముద్ర తీరం వైపుగా వెళ్లాల్సి వస్తే ఇసుక రఫ్ టెక్చార్ వల్ల విలువైన రాళ్లకు హాని జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మెటల్ పై గీతలు పడుతుంటాయి. కాబట్టి బీచ్ లో ఆభరణాలు ధరించవద్దు. స్విమ్మింగ్ పూల్స్ లో నీళ్లు ఆభరణాలకు తగలనీయద్దు . వీటిలో ముత్యాలు వజ్రాలు బంగారు నగలు రకరకాల నగలను ఒకే అరలోకాకుండా విడివిడిగా భద్రపరిస్తే బావుంటుంది.

    ప్రయాణాల్లో నగలు భద్రం

    ప్రయాణాల్లో జాగ్రత్త అనుకుంటూ నగలు తీసుకుపోయేందుకు సాధారణంగా ఇష్టపడరు . కానీ ఆ ప్రయాణాలు ఏ పెళ్లిళ్లకు అకేషన్స్ కు అయితే కొన్న నగలైనా కావాలి. భద్రత…