• ఆరోగ్యం కోసం బాగా ఖరీదైన ఆహారమే తినాలిని రులెం లేదు. చాలా తక్కువ ఖర్చు తో ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు వున్న బ్రహ్మాండమైన పదార్ధలెన్నో వున్నాయి. నల్ల సెనగలు బ్లాక్ బెంగాల్ గ్రామ్ వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు అదుపులో వుంటాయి. బరువుకూడా తగ్గే అవకాసాలున్నాయి. పసుపు లోని కుర్ క్యుమిన్ లో యంటి ఇంఫ్లమేటరి గుణాలు బాగా వున్నాయి. ఇవి క్యాన్సుర్, ఇన్ఫెక్షన్, ఆస్తమ, గుండె జబ్బులు, కడుపు మంట మొదలైన అనారోగ్యాల పై శక్తి వంతంగా పని చేస్తుంది. వెల్లుల్లి లో విటమిన్-c,బి6 ల తో పాటు మెగ్నీషియం, సెలీనియం వంటివి వున్నాయి. ఇవి రక్త పోతూ ని పెరగనియవు కలెస్త్రోల్ ని తగ్గిస్తాయి. మెంతులు డయాబెటిస్ ను తగ్గించడం లో శక్తి వంతంగా పని చేస్తాయి. ఉసిరి లో వుండే సి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

    ఇవన్నీ పోషకాలకు నిలయాలు

    ఆరోగ్యం కోసం బాగా ఖరీదైన ఆహారమే తినాలిని రులెం లేదు. చాలా తక్కువ ఖర్చు తో ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు వున్న బ్రహ్మాండమైన పదార్ధలెన్నో వున్నాయి.…

  • ముత్యాల హారాల నగనే తెల్లని గుండ్రని మంచి ముత్యాలు అనుకుంటాము కానీ అక్కడక్కడా నొక్కుకుపోయిన ముత్యాలను పూల గుత్తిగా గుచ్చుతు వాటిని యాంటిక్ టెంపుల్ డిజైన్ లాగా తాయారు చేస్తున్నారు. టెంపుల్ జ్యువలరీ డిజైన్స్ విత్ పెరల్స్ చుస్తే అస్సలు ముత్యాల తో ఇన్ని రకాల నగలున్నాయా అనిపిస్తుంది. రత్నాలు కెంపులు కలిపేసి పెద్ద పెద్ద పెండెంట్లతో గుత్తులకొద్ది ముత్యాల తో హారాలు నెక్లెస్లు వున్నాయి. పచ్చలు కెంపులు, ముత్యాల రత్నాలు నొక్కుకునట్లు చిన్న సైజులో గుత్తుల్లా వుంది దానికి టెంపుల్ డిజైన్ పెండెంట్లు తగిలిస్తే ఇంకో కొత్త పరంపర మొదలైనట్ట్ల్ వుంది. పెళ్లి వేడుకల కోసం ఇలాంటిహారాలు ఒక్కసారి చూడండి. గుత్తు పూసల ముత్యాల హారాలు భలే వున్నాయి.

    టెంపుల్ డిజైన్ల ముత్యాల హారం

    ముత్యాల హారాల నగనే తెల్లని గుండ్రని మంచి ముత్యాలు అనుకుంటాము కానీ అక్కడక్కడా నొక్కుకుపోయిన ముత్యాలను పూల గుత్తిగా గుచ్చుతు వాటిని యాంటిక్ టెంపుల్ డిజైన్ లాగా…

  • నీహారికా, ఈ మధ్య వచ్చిన కొన్ని సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో పెత్తనం విషయంలో పురుషులదే పై చేయిగా ఉందని వచ్చింది. సరే పెత్తనం వాళ్ళనే ఉంచుకోమనండి అందామంటే ఈ పెత్తనం అర్ధం వింటే గుండె జారిపోవాలి. ఆస్పత్రికి వెళ్ళాలన్నా 88 శాతం మంది మహిళలు ఇంట్లో పెద్దలకు చెప్పే వెళ్ళాలంటారు. ఏది వండాలో పురుషులే నిర్ణయిస్తారని 62శాతం మంది స్త్రీలు చెప్పారట. దేశం మొత్తం మీద 65శాతం మహిళలు చదువుకొంటే అందులో 5 శాతం మంది మహిళలకు మాత్రమే భర్తను ఎంచుకొనే స్వేచ్చ ఉందట. మేరీలాండ్ విశ్వవిద్యాలయం, జాతీయ అనువర్తిత ఆధిక పరిశోధన మండలి సంయుక్తంగా జరిపిన జాతీయ మానవ వనరుల సర్వేలో 34 వేల మందిని ప్రశ్నించి ఈ సర్వే చేశారట. 15 నుంచి 80 ఏళ్ళ మధ్య ఉన్న మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. పక్కన వున్న కిరాణా కొట్టుకు వెళ్ళాలన్నా పర్మిషన్ ఉండాల్సిందే అని 80శాతం మంది మహిళలు చెబితే ఇంకా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలా అర్ధం ఏమిటా అనిపిస్తుంది. కానీ ఒక్కటే ఊరట. ఇంత వివక్ష ఎదుర్కొంటున్నా ముందుకే కదులుతున్నారు నేటి మహిళలు. తనకంటూ గుర్తింపు కోసం అహర్నిశలు కృషి చేస్తూనే వున్నారు. ఎన్నో రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. కానీ వెలుగు వెంట చీకటిలా వాళ్ళని కష్టపెడుతుందీ అసమానత్వం. సంపాదిస్తున్నా నిరాధారంగా ఉన్న మహిళా మహిళగానే వుంటుంది. మరి ఏ వెలుగులు ఈ చీకటిని చీలుస్తాయో భవిష్యత్ చెప్పాలి.

    ఈ రిపోర్టును ఏమని పిలుద్దాం

    నీహారికా, ఈ మధ్య వచ్చిన కొన్ని సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో పెత్తనం విషయంలో పురుషులదే పై చేయిగా ఉందని వచ్చింది. సరే పెత్తనం వాళ్ళనే ఉంచుకోమనండి…

  • కొన్ని పరిశోధనా ఫలితాలు వింటుంటే ఇవి ఎంత అవసరo అనిపిస్తుంది. మనుష్యుల్ని గురించి అర్ధం చేసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. తల్లిగా మారాక స్త్రీల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. ఇదే కాదు వారి మెదడు లోనే మార్పు వస్తుంది అంటున్నారు. పరిశోధకులు. 50 మంది తల్లి కాబోతున్న మహిళల పైన ఈ పరిశోధన చేశారు. ప్రసవానికి ముందు వారి మెదడు స్కాన్ చేశారు. గర్భం దాల్చిన తర్వాత వచ్చిన స్పష్టమైన మార్పును పరిశోధకులు గుర్తించారు. ఇతరుల అభిప్రాయాలను, అవసరాలను గమనించే మెదడు భాగంలో వచ్చిన మార్పు అమ్మలో అప్రమత్తతను పెంచేలా వుందిట. పసిపిల్లలు నోరు తెరిచి ఏదీ అడగకపోయినా వారి ఆకలిని, నిద్రను, అనారోగ్యాన్ని తెలుసుకొనే శక్తి ఈ మార్పు ద్వారా తల్లికి లభించిందని పరిశోధకులు చెప్పారు. రెండు మూడేళ్ళ తర్వాత ఆ మెదడు సాధారణ స్థాయిలో అంత అలెర్ట్ గా లేకుండా ప్రశాంతతతో ఉందిట. నిజమే ఏ శక్తితో బిడ్డ అవసరాన్ని చటుక్కున తెలుసుకొంటోంది తల్లి. ఈ పరిశోధన చాలా గొప్పగా ఉంది.

    మాతృత్వం మార్చేస్తుందిట

    కొన్ని పరిశోధనా ఫలితాలు వింటుంటే ఇవి ఎంత అవసరo అనిపిస్తుంది. మనుష్యుల్ని గురించి అర్ధం చేసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. తల్లిగా మారాక స్త్రీల ఆలోచనా…

  • ఇప్పుడు వంటిల్లు కూడా కళాత్మకంగా వుండేలా మాడ్యులర్ కిచెన్స్ వచ్చేశాయి. పాత ఇల్లు కొత్తగా డిజైన్ చేయించుకోవాలంటే దీన్ని ఎంచుకోవచ్చు. ఆర్ధికమైన అంశాల్ని దృష్టిలో ఉంచుకొని అవసరాలకు సూటయ్యే విధంగా డిజైన్ చేయించుకోవాలి. మాడ్యులర్ కిచెన్ లో షెల్ఫులు, సోరుగులు ముందే ఎన్ని కావాలో రాసుకోవాలి. అన్ని అప్లియిన్స్ కు విడిగా బడ్జెట్ చూసుకోవాలి. ఎంచుకొనే కంపెనీల గ్యారంటీ టర్మ్స్, నిర్వహణ పద్ధతులు చూసుకోవాలి. ఏడాది గ్యారంటీ అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. సోరుగులు తెరిచే పద్ధతి సౌకర్యంగా సులభంగా ఉండాలి. కలర్ కాంబినేషన్స్, టైలింగ్, ఫ్లోరింగ్ వంటివి చూసుకోవాలి, కొన్ని కంపెనీలు ఎకో ఫ్రెండ్లీ షెల్లింగ్ యూనిట్లు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఫిట్టింగ్ లో ఎనర్జీ అంశాలు పరిశీలించాలి. ఇంటర్నేషనల్ కంపెనీలో ఆర్డర్ ఇచ్చాక 90 రోజులు డెలివరీ ఇచ్చే టైం తీసుకొంటాయి. రెండేళ్ళ క్రితం ఇవి రెడీమేడ్ గా దొరకటం ఒక వింత. ఇప్పుడన్నీ అలవాటయ్యాయి కాబట్టి ఇవి మాన్ సొంతంగా మనకు కావలిసినవన్నీ విడిగా ఆర్డరిచ్చి కూడా అమర్చుకోవచ్చు. కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన సెట్టే ఇస్తారు గనుక అవి మనకు పనికి వస్తాయో రావో, అన్నీ ఉపయోగించుకోగాలమో లేమో చూసుకోవాలి.

    మనమూ డిజైన్ చేయించుకోవచ్చు

    ఇప్పుడు వంటిల్లు కూడా కళాత్మకంగా వుండేలా మాడ్యులర్ కిచెన్స్ వచ్చేశాయి. పాత ఇల్లు కొత్తగా డిజైన్ చేయించుకోవాలంటే దీన్ని ఎంచుకోవచ్చు. ఆర్ధికమైన అంశాల్ని దృష్టిలో ఉంచుకొని అవసరాలకు…

  • ఆరోగ్యంగా, తీరైన శరీర సౌష్టవంతో వుండాలంటే జిమ్ కు వెళ్లితీరాలా లేక తినే ఆహారం సాధ్యమైనంత తక్కువ తీసుకొంటే సరిపోతుందా అనే డైలమా చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు ఇంట్లో అస్తమానం బొంగరంలా తిరుగుతాం కదా ఇంకా జిమ్ ఎందుకు? అంటారు. సరే అటునుంచి రావాలంటే కొద్దిపాటి వాకింగ్ తో పాటు కొద్దిపాటి ఆహార ఎంపికలు ఫలితాలు శీఘ్రం గా చూపించి ఉత్సాహం తెస్తాయి. తక్షణ శక్తి కోసం సింపుల్ కార్బోహైడ్రేట్స్ చాలు పది నిముషాలు వాకింగ్ చాలు. మంచి మూడ్ కోసం మెదడుకు మంచి పోషకాలు కావాలి. 20 నిముషాలు వ్యాయామం మెదడును ఉత్సాహంతో నింపుతుంది. వీక్ మజిల్ ఉన్నవారు కండరాలు పటిష్ట పరిచే ఆహారపదార్ధాలు తీసుకోవాలి. సలాడ్ల పైన ఆలివ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ఆరోగ్యవంతమైన ఫ్యాట్ కండరాల వేస్టేజీని అరికడతాయి. కార్బోహైడ్రేట్స్ నాడీ వ్యవస్థను ఉద్దీప్తం చేసి మానసిక శక్తిని పెంచుతాయి. లంచ్ లో బీన్స్ వంటివి మూడ్ ను, మెమొరీని పెంచుతాయి. కేవలం గృహిణులు ఎన్నో గంటలు నాలుగ్గోడల మధ్యనే పని చేస్తుంటారు కనుక వారికి మనసు, శరీరం చైతన్యంగా ఉంది, తీసుకున్న ఆహారం సరిపోయి చేసే కాస్త వ్యాయామం సరిపోతుందని ఎక్స్పర్ట్స్ చెపుతున్న విషయాలు. ఎటుతిప్పినా సవ్యంగా కాస్తయినా శరీరం కదిలించాలి.

    జిమ్ అవసరమా? సలాడ్ బౌల్ చాలా?

    ఆరోగ్యంగా, తీరైన శరీర సౌష్టవంతో వుండాలంటే జిమ్ కు వెళ్లితీరాలా లేక తినే ఆహారం సాధ్యమైనంత తక్కువ తీసుకొంటే సరిపోతుందా అనే డైలమా చాలా మందికి ఉంటుంది.…

  • సినిమాల్లో బోలెడన్ని జోకులు పేలాయి, అప్పుడు నవ్వొస్తుంది గానీ, నిజంగా చెవులు వినబడకపోవడం పెద్ద సమస్యే. సరిగా వినపదకపోవడానికి సవాలక్ష కారణాలు ఉండచ్చు గానీ పెయిన్ కిల్లర్స్ మాత్రం ఇందుకు కారణం కావచ్చంటారు డాక్టర్లు. తరచుగా బ్రూఫిన్ లేదా పారాసెటమాల్ మాత్రలు వాడుతుంటే వినికిడి శక్తి తగ్గుతుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు. ముఖ్యంగా వారంలో రెండుసార్లు పెయిన్ కిల్లర్లు వాడే మహిళల్లో హియరింగ్ లాస్ 24శాతం ఉన్నట్లు గుర్తించారు. ఆస్ప్రిన్ కూడా ఇందుకు కారణమవుతుంది. లోపల చెవిలోని ‘కొచిలియా’ అని ఒక నత్త లాగా ఉండే చిన్న వినికిడి మెకానిజానికి రక్త సరఫరా తగ్గించడం ద్వారా పెయిన్ రిలీవార్లు డ్యామేజీ చేస్తాయని చెపుతున్నారు. పారాసెటమాల్ వంటివి కూడా ఈ అపకారం చేస్తాయంటున్నారు. అంచేత శరీరంలో ఎక్కడైనా నొప్పి అనిపించగానే గబుక్కున మాత్రలు మింగేసే ముందు కొంచెం ఆలోచించి సహజ మార్గాలతో ఉపశమనం పొందే ప్రయత్నం చేయాలి. మరీ భరించలేకపోయినట్లయితే తప్ప పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్ళనే వెళ్లొద్దు.

    పెయిన్ కిల్లర్ తో హియరింగ్ లాస్

    సినిమాల్లో బోలెడన్ని జోకులు పేలాయి, అప్పుడు నవ్వొస్తుంది గానీ, నిజంగా చెవులు వినబడకపోవడం పెద్ద సమస్యే. సరిగా వినపదకపోవడానికి సవాలక్ష కారణాలు ఉండచ్చు గానీ పెయిన్ కిల్లర్స్…

  • వేసవి తాపం మొదలైతే చల్లబరిచే కిరాలు, వాటర్మెలాన్ లు, కర్భుజాలు గుట్టలుగా వస్తుంటాయి. కిరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ, ఎలాంటి రుచి పచి లేకుండా కాస్తంత దోస వాసన రుచితో వుండే కీరా అంటే చాలా మంది ఇష్టపడరు. ఇందులో వుండే 95 శాతం నీరు వేసవి తాపాన్ని తగ్గించడమె కాకుండా సూర్య రశ్మి కారణంగా వచ్చే చర్మ సమస్యల్ని నివారిస్తుంది. హార్మోన్ సమస్యల వున్న వాళ్ళకి ఇది ఎంతో మంచిది. తప్పని సరిగా ఒక కిరా కొనడం వల్లన వీటిల్లోని స్టెరోయిడ్స్ కారణంగా, కొలెస్త్రోల్ శాతం బాగా తగ్గుతుంది అని తేలింది. కీరాలోని ఎరప్సిన్ అనే ఎంజైమ్స్, ప్రొటిన్ల జీర్ణ క్రియ సమస్యలు తగ్గిస్తుంది. ఇందులోని నిరు,పిచు కారణంగా పేగు లోని టాక్సిన్లు పోతాయి. నోటి దుర్వాసనునకు కూడా కిరా మంచి మందు. కిరాలో వుండే బి-విటమిన్లు ఆర్డినల్ గ్రంధుల పనితీరు తోడ్పడి ఒత్తిడిని తగ్గిస్తాయి. కిరా తినడం అలవాటు చేసుకోవాలి.

    ఎన్నో సమస్యలకి సమాధానం కిరా

    వేసవి తాపం మొదలైతే చల్లబరిచే కిరాలు, వాటర్మెలాన్ లు, కర్భుజాలు గుట్టలుగా వస్తుంటాయి. కిరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ, ఎలాంటి రుచి పచి లేకుండా…

  • మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ మొటిమలు రాకుండా కాపాడుతాయి అంటున్నారు. బాగా పండిన బొప్పాయిలో చెక్కెర, పెరుగు కలిపి ముఖానికి రాసి మర్దనా చేస్తే మొటిమలు తగ్గుతాయి. నారింజ తొక్కల పొడి లో పలు కలిపి ముద్దలా చేసి ముఖానికి రాసి ఆరె దాకా వుంచి కడిగేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొహం కొత్త మెరుపు తో వుంటుంది. రెండు చెంచాల తేనె, ససిన్ని పాలు, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి దీన్నీ ఫేస్ మాస్క్ లా వేసి ఆరాక కడిగేయాలి. ఈ మాస్క్ రోజు మర్చి రోజు వేసుకుంటే మొటిమలు తగ్గడమే కాదు మచ్చలు పోతాయి. అరటి పండు పై తొక్కలలో ల్యుటిన్ అనే ఎంజైమ్ వుంటుంది. ఇది కొత్త కణాల అభివృద్ధి కి సహాయపడుతుంది. ముఖం పైన వలయాకారంలో అరటి తొక్కతో రుద్దితే ఫలితం వుంటుంది. చర్మం కూడా తాజాగా వుంటుంది.

    ఇంటి చిట్కాల తో ఈ సమస్యలు మాయం

    మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ…

  • చాలా నెలలు గా వర్క్ ఔట్స్ చేస్తున్నా సరైన దేహ స్తితి రావడం లేదని చాలా మంది మహిళల కంప్లైంట్. ఇది సరైన మాటే. మహిళల్లో లోయర్ మజిల్ డెసినిషన్ వుంటుంది. ఇదో డిస్ అడ్వాన్ టేజ్. పురుషుల కంటే ఎక్కువ ఫ్యాట్ వుంటుంది కనుక అంత త్వరగా రిజల్ట్స్ కనిపించవు. పైగా మహిళలకు తెస్తోస్టిరాన్ చాలా తక్కువ స్థాయి లో వుంటాయి. ఈ హార్మోన్ పురుషులలో ఈకువ స్థాయి లో వుండి వాళ్ళు చాలా తేలికగా సిక్స్ పాక్స్ వరకు వెళ్ళిపోగలుగుతారు. స్త్రీలు ఆరోగ్యవంతమైన మజిల్ మాస్ మెయిన్టైన్ చేయాలి. హర్మోనల్ వ్యవస్థ సరిగా పని చేయడానికి ఆరోగ్యవంతమైన ఫ్యాట్ చాలా అవసరం. సరైన మజిల్ మాస్ వుందో లేదో జిమ్లో పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్గా వర్క్ఔత్స్ చేస్తే సరైన ప్రొటిన్లు తీసుకోవాలి. ఎటువంటి హర్మోనల్ సుప్ప్లిమెంట్లు వద్దు. వారంలో 6 రోజులు 45 నుంచి 60 నిమిషాల వరకు కర్డియో చేయాలి. వ్యయామాలు సరైన రీతి లో వుండాలంటే పర్యవేక్షకుల శిక్షణ చాలా అవసరం.

    అంత తొందరగా రిజల్ట్స్ కనపడదు

    చాలా నెలలు గా వర్క్ ఔట్స్ చేస్తున్నా సరైన దేహ స్తితి రావడం లేదని చాలా మంది మహిళల కంప్లైంట్. ఇది సరైన మాటే. మహిళల్లో లోయర్…