• హీల్స్ వేసుకోవడం పైన క్రేజ్ ఎంతకీ వదులుకోరు అమ్మాయిలు. ఎత్తును కవర్ చేసుకోవడానికి పనికి వస్తాయి హీల్స్. అందుకే నొప్పులోస్తాయని తెలిసినా వీటికి ప్రాధాన్యత ఇస్తూనే వుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్ కు చెందిన ఒక స్టార్ట్ అప్ కంపనీ రెండు రకాల స్మార్ట్ హీల్స్ ను తాయారు చేసింది. ఒక రకం హీల్స్ ను కావాల్సిన సైజుకు అర్జుస్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ సాయింతో స్మార్ట్ ఫోన్ కు హీల్స్ కనెక్ట్ అవ్వుతాయి. యాప్ సాయంతో 1.7 అంగుళాల నుంచి 3.1 అంగుళాల వరకు ఎత్తు మార్చవచ్చు.రెండో వారానికి హిటెడ్ ఇన్సోల్ వుంటుంది. ఈ రెండు రకాల హీల్స్ ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ గా ఉపయోగ పడతాయి. ధరకాస్త ఎక్కువే వుంటుంది. దగ్గరగా 20 వేల వరకు వుండవచ్చు.

    స్మార్ట్ హీల్స్

    హీల్స్ వేసుకోవడం పైన క్రేజ్ ఎంతకీ వదులుకోరు అమ్మాయిలు. ఎత్తును కవర్ చేసుకోవడానికి పనికి వస్తాయి హీల్స్. అందుకే నొప్పులోస్తాయని తెలిసినా వీటికి ప్రాధాన్యత ఇస్తూనే వుంటారు.…

  • చేపలలో పోషకాలెన్నో ఉంటాయని ఆరోగ్యానికి మంచిదని మెదడు పని తీరుకు మంచిదని అంటారు. కానీ అన్ని చేపలలోను ఒకే పోషకాలు వుండవు. చేపల్లో మైక్రో నుట్రీయంట్లు, ఓమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. మంచి నీటి చేపలలో అవి వుండవు. ఆక్వా ఫిష్స్ కన్నా సీ ఫుడ్స్ ఎంతో మంచివి. చేపలు ఎక్కువగా తినడం వల్ల గ్రీన్ ల్యాండ్ వాసుల్లో చూద్దాం అన్నా ఆర్దరైటిస్ వుండదు. అలాగే గోదావరి జిల్లాలో దొరికే నెత్తళ్ళు పేరు తో పిలిచే చేపలలో, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-బి, బి-12 వంటి అన్ని ఎక్కువే. ఆహారంలో భాగంగా చేపలు తింటే కాన్సర్లు, హృదయ రోగాలు రావు. ఒమేగా ఆమ్లాలు ఎక్కువగా వుండే వీటిని వారానికి రెండు దార్లు అయినా తినమని సూచిస్తున్నారు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్. ప్రోటీన్ల తో పాటు జింక్ సమృద్ధిగా దొరికే ఈ చేపలలో చిన్నారుల కోసం బంగ్లాదేశ్ లో 13 లక్షల చెరువులు తవ్వించారట. గుండెకు చేవ నిచ్చే చేపల్ని భోజనంలో భాగంగా తిసుకోమంటున్నారు డాక్టర్లు.

    పోషకాలకు నిల్వలు ఈ చేపలు

    చేపలలో పోషకాలెన్నో ఉంటాయని ఆరోగ్యానికి మంచిదని మెదడు పని తీరుకు మంచిదని అంటారు. కానీ అన్ని చేపలలోను ఒకే పోషకాలు వుండవు. చేపల్లో మైక్రో నుట్రీయంట్లు, ఓమెగా…

  • నిహారిక, సమస్య అర్ధం అయింది. ఈ పరీక్షల్లో అంత రిజల్ట్స్ చూపెడితేనే రేపు బెటర్ ఫ్యూచర్ వుంటుంది లాంటి మాటలతో పిల్లలను ఎమోషనల్ గా ఒత్తిడి పెడుతున్న మాట నిజమే. ఇంటా బయటా పోటీ ప్రపంచంలో నెగ్గుకు వచ్చేందుకు పిల్లలు ఎన్నో సవాళ్ళు, భయాలు ఎదుర్కొంటున్నారు. తెలిసో తలియకో పిల్లల బావోద్వేగాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఈ సమస్య పూర్తి చేయక పొతే నీకు సినిమా లేదునే చెప్పిన డ్రెస్ వేసుకోక పొతే నీకింక ద్రేస్సులే కొనను, ఇలా ఎమోషనల్ గా మాట్లాడితే పాపం పిల్లలు వింటారు కానీ ఈ ప్రభావం వాళ్ళు పెద్ద అయ్యాక ఇబ్బందులు తెస్తాయంటున్నారుపరిశోధకులు. చీటికి మాటికి బెదిరించడం, పదే పదే సతాయించడం తో పిలల్లో ఒక విధమైన మొండితనం వస్తుంది. ఎవ్వరిని ఖాతరు చెయ్యకపోవడం అలవర్చుకోవాలి. చిన్నతనం లో పెద్దవాల్ల బెదిరింపులకు జడిసి,ప్రతి ఇష్టం లేని పని చచ్చినట్లు చేసిన పిల్లలు మనస్సులో వ్యతిరేకతనే పెంచుకుంటారు. ఇందులో మొదటిగా నష్టపోయేది తల్లి దండ్రులే. పిల్లల్ని మనం ఎలా ప్రోత్సహిస్తమో వాళ్ళు అలాగే స్పందిస్తారు. మన ప్రోత్సాహం వాళ్ళకు మార్గదర్శకత్వం అవుతుంది. మన సతాయింపు ధోరణి వాళ్ళల్లో లోపించే లా చేస్తుంది. పిల్లలకు ప్రేమే ఇవ్వాలి. వాళ్ళని పెంచే క్రమం లో మనం ఇచ్చే విలువైన వస్తువులు కూడా మనం ఇచ్చే ప్రేమా నమ్మకం పిల్లలకు సంతోషం ఇస్తాయి. వాళ్ళకి దగ్గర అవ్వాలి. దారి చూపాలి.

    బెదిరించడం సతాయించడం మానండి

    నిహారిక, సమస్య అర్ధం అయింది. ఈ పరీక్షల్లో అంత రిజల్ట్స్ చూపెడితేనే రేపు బెటర్ ఫ్యూచర్ వుంటుంది లాంటి మాటలతో పిల్లలను ఎమోషనల్ గా ఒత్తిడి పెడుతున్న…

  • కరెంటు అక్కరలేని ఫ్రిజ్ ఎప్పుడైనా చూసారా? సహజమైన రీఫ్రిజిరేటర్ రంపపు పొట్టు, ఇసుక కలిపిన మట్టితో పాటు చేయడం వల్ల సహజంగా చల్లగా వుంటుంది. కుండలో పోసినట్లు ఈ ఫ్రిజ్ లోనూ నీళ్ళు పోస్తే కూరగాయలు, పండ్లు వారం రోజుల పాటు తాజాగా వుంటాయి. ఈ మట్టి ఫ్రిజ్ లే కాదు మట్టి కూల్ వాటర్ బొట్టెల్లు, క్లే డిన్నర్ సెట్లు, కడాయిలు, కర్రీ కప్స్, పెనం వంటి ఖరీదైన వంటింటి సామగ్రిని మట్టి తో తయారు చేసి పేద వాళ్ళకు ఇవ్వాలనుకున్నాడు గుజరాత్ కు చెందిన మన్ సుచ్ భాయ్. కానీ ప్రస్తుత వాతావరణం లో ఎక్కడ చుసినా సేంద్రియ మంత్రమే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పట్టుకు పోయి పోషకాలన్నీ పోయేలా రసాయిన పూరితమైన పాత్రల్లో వండితే లాభమేంటి. ఈ ప్రశ్నలోచ్చాయి కనుకనే మిట్టి కూల్ పాత్రలన్నీ పర్యావరణ ప్రక్రియల్ని ఆకట్టుకుంటున్నాయి. ఒక సారి నెట్ లో చూడండి పాత్రలెంత చెక్కగా వున్నాయో, మనకు తెలుసు పూర్వ కాలం లో మట్టి కుండల్లో పిడకల పొయ్యి పైన పాలు మరిగేలా కాచి తోదేస్తే ఆ పెరుగు కమ్మగా రాయి లాగా తోడుకునేది ఇప్పుడాఅనుభవం కావాలంటే ఓ కర్ట్ పాట్ కొనుకొచ్చి చూడండి. పెరుడు బాగుంటుంది.

    ఫ్రిజ్ నుంచి వాటర్ బాటిల్ దాకా అన్ని మట్టివే

    కరెంటు అక్కరలేని ఫ్రిజ్ ఎప్పుడైనా చూసారా? సహజమైన రీఫ్రిజిరేటర్ రంపపు పొట్టు, ఇసుక కలిపిన మట్టితో పాటు చేయడం వల్ల సహజంగా చల్లగా వుంటుంది. కుండలో పోసినట్లు…

  • ఎంత శారీరక శ్రమ చేస్తే అంత లాభం అంటున్నారు పరిశోధకులు. ఇక్కడ పని అంటే ఆఫీసులో పని అనుకుంటే, అవసరమైన ఆఫీసు పని కంటే కూడా ఇంకా ఓవర్ టైం ఇంకో రెండు గంటలు పని చేసినా పర్లేదు. అస్సలు బోలెడన్ని అనారోగ్యాలు రావంతున్నారు. పరిశోధకులు కొందరు ఉద్యోగుల పైన పరిశోధన నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులగా విడ తీసి మధ్యలో కొంత సేపు విరామం, పనిలో కొంత సేపు అంతరాయం ఇస్తూ ఎక్కువ గంటలు పనిచేయించారు. మరో గ్రూపుకు పని గంటలు అవ్వగానే వదిలేసారు. కొన్ని నెలల తర్వాత వీరి ఆరోగ్య పరిస్తితి పరిశీలిస్తే కొద్ది పాటి విరామం తో ఎక్కువ పని గంటలు పని చేసే వాళ్ళు 5.5 కిలోల బరువు తగ్గారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణ స్థాయి లో వుంది. రెండో గ్రూపులో ఇవేమీ లేవు. డయాబెటిస్ కు దరి తీసే అధిక బరువు, రక్తంలో గ్లుకోజ్ స్థాయి గతంలో వునట్ట్లే వున్నాయి. రిపోర్ట్ ప్రకారం ఎక్కువ పని చేస్తేనే టైమ్ టు డయాబెటిస్ ముప్పు తప్పించుకోవచ్చు అని రుజువైంది.

    ఎక్కువ పని చేస్తేనే ఆరోగ్యం

    ఎంత శారీరక శ్రమ చేస్తే అంత లాభం అంటున్నారు పరిశోధకులు. ఇక్కడ పని అంటే ఆఫీసులో పని అనుకుంటే, అవసరమైన ఆఫీసు పని కంటే కూడా ఇంకా…

  • వ్యయామాలు చేయండి మానసిక ప్రశాంతత వుంటుంది అని గురువులు చేఅప్తారు కదా. ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే విపరితమైన ఒత్తిడి, కోపం వంటి అత్యధిక స్థాయి బావోద్వేగాలున్న స్తితిలో కధనమైన వ్యయామాలు అస్సలు చేయకుడదట అప్సెట్ అయ్యి వున్నప్పుడు, తట్టుకోలేని ఆగ్రహం వుపేస్తుంటే వ్యయామం మొదలు పెడితే హార్ట్ ఎటాక్ ప్రాబ్లం వస్తుందిట. ఎమోషనల్ స్ట్రెస్, ఆగ్రహం రక్త పోటును పెంచుతాయి. రక్త నాణాల్లో ఫ్లో మారడం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. అప్పటికే ప్లెక్ తో ఆర్టరీ క్లాగ్ అయ్యి వుంటే రక్త సరఫరా బ్లాక్ అయ్యి వ్యయామం చేస్తుంటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలుంటాయని నిపుణుల హెచ్చరిక. ముఖ్యంగా ఇలాంటి రిస్క్ సాయంత్రం ఆరు నుంచి అర్ధరాత్రి వరకు వుంటుంది. రక్త పోతూ స్థూలకాయం సమస్యలు ఇంకా పెంచుతాయి. కాబట్టి ఎలాంటి ఒత్తిడి కోపం లేనప్పుడే ప్రశాంతమైన మనస్సుతోనే వ్యయామాలు చేయాలి.

    ఒత్తిడి కోపం తో వ్యయామాలు వద్దు

    వ్యయామాలు చేయండి మానసిక ప్రశాంతత వుంటుంది అని గురువులు చేఅప్తారు కదా. ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే విపరితమైన ఒత్తిడి, కోపం వంటి అత్యధిక స్థాయి బావోద్వేగాలున్న స్తితిలో…

  • మీ టూత్ పేస్టు లో ఉప్పు వుందా? అని ఒక హీరోయిన్ దుకుంటూ వచ్చి అడిగితె సమాధానం చెప్పే వాడు తెల్ల మొహం వేసినట్లు, ఎన్ని టూత్ పస్ట్లు వాడినా నోరు దుర్వాసన వస్తూనే వుండవచ్చు. నోటి మూలల్లో దాకున్నబాక్టీరియా వల్లనో, ఆహారపు అలవాట్లు, హాబీలు కారణం ఏదైనా కావొచ్చు ముందుగా జాగ్రత్తలు తీసుకుని ఇక మనవల్ల కాకపోతే ఇక డాక్టర్ దగ్గరకు పరిగెత్తాలి. ఉదయం, రాత్రి రెండు పూటలా బ్రష్ చేసుకోవడం, టంగ్ క్లీనర్ తప్పని సరిగా వాడటం, ఆహారం తీసుకున్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవడం. ఇవన్నీ సాధారణంగా చేసేవే కనుక ఇంకా కొన్ని ఆలోచించుకోవాలి. చాల సేపు మాట్లాడకుండా వుంటే నోరు డ్రై గా అయిపోతుంది. దుర్వాసన వస్తుంది. అప్పుడప్పుడు నీళ్ళు తాగుతూ వుండాలి. చిగుళ్ళు బలహీన పడ్డా ఈ ప్రొబ్లెంస్ తప్పవు. ఇక దంతాల పటుత్వం తోనే ఆ సమస్య పోతుంది. పోషకాహరం తిసుకోవాలి డైట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండాలి. కనీసం ఆరు నెలలకొ సారి దంత వైధ్యుల్ని చూడాలి.

    నిజంగా ఇది సమస్యే

    మీ టూత్ పేస్టు లో ఉప్పు వుందా? అని ఒక హీరోయిన్ దుకుంటూ వచ్చి అడిగితె సమాధానం చెప్పే వాడు తెల్ల మొహం వేసినట్లు, ఎన్ని టూత్…

  • పెరుగు తినండి బి.పి తగ్గుతుంది అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు. పెరుగులో కాల్షియం విటమిన్-బి12, పొటాషియం వంటి పశాకలు పుష్కలంగా వుంటాయి. అంటే కాదు ఇందులోని ప్రో బయోటిక్ బాక్టీరియా జీర్ణ శక్తిని పెంచడం తో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధ్య వయస్సు లో పెరుగు తినడం వల్ల బి.పీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయని చెపుతున్నారు. బి.పీ తగ్గించే కూరగాయలు నట్స్ కంటే పెరుగుతోనే అనేక పోశాకలున్నాయట. అలంటి ఇది మంచి ఫేస్ ప్యాక్ కూడా మృదుత్వం వెంటనే తెలుస్తుంది. అలాగే పెరుగు కప్పు తిన్నా చాలు అందులో వుండే లాక్టిక్ ఆసిడ్ ముఖాన్ని మృదువుగా, కాంతి వంతంగా చేస్తుంది. ఎటువంటి కాలరీలు, కొవ్వు, చెక్కర లేదు కనుక వివిధ రూపాల్లో ఎలాగైనా తినొచ్చు పెరుగు వినియోగం వల్ల ఇతర ఆహార పదార్ధాల నుంచి పోషకాలను మినరల్స్ ను గ్రహించే శక్తి పెరుగుతుంది.

    పెరుగు తినడం చాల ఉపయోగం

    పెరుగు తినండి బి.పి తగ్గుతుంది అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు. పెరుగులో కాల్షియం విటమిన్-బి12, పొటాషియం వంటి పశాకలు పుష్కలంగా వుంటాయి. అంటే కాదు ఇందులోని…

  • ఎన్ని నగలున్నా అరవంకి అందమే వేరు. ఉత్తరాదిన అవి పట్టిలు మాదిరిగా కనిపిస్తే ఇటు దక్షిణాదిన కాస్త వంపు తిరుగి అర్ధ చంద్రాకారంలోకి మారి అరవంకి పేరు సార్ధకం చేసుకోంది. లంగా పరికిణీ లో నిండుగా కైపించే అమ్మాయిల చేతికి కెంపులు, పచ్చలు, వజ్రాలు, అన్కట్ వజ్రాలు, రత్నాలు పొదిగిన కుందన్, ఖాదీ మీనాకారి, పోల్కి టెంపుల్, యాంటిక్ పని తనం తో బాబుబంద్ డిజైన్లు ఎంతో బాగుంటాయి. నెమలి పూరి విప్పినట్లుబుజాలకు చుట్టేస్తున్నారు. వీటినే యుర్ధ ఆభరణాలుగా పూర్వం మోగల్లు పెట్టుకునే వాళ్ళు. అది కాస్త స్త్రీల నాగగా మారిపోయింది. పాత తరం వాంకి కాస్త కొత్త తరం బాజుబంద్ డిజైన్ గా మరి పోయింది.

    పేరు మార్చుకున్న అరవంకి

    ఎన్ని నగలున్నా అరవంకి అందమే వేరు. ఉత్తరాదిన అవి పట్టిలు మాదిరిగా కనిపిస్తే ఇటు దక్షిణాదిన కాస్త వంపు తిరుగి అర్ధ చంద్రాకారంలోకి మారి అరవంకి పేరు…

  • ఏం తిన్నా ఎక్కువ తిన్నాం అని కంగారు పడిపోతుంటారు అమ్మాయిల. కొంచం నియంత్రణ తో వుంటే ఎలాంటి ఆందోళన వుండదు. తినేదేదో హడావిడి లేకుండా తినాలి. అసలు ఎం తింటున్నాం అన్నది గమనించుకోవాలి. టి.వి చూస్తూ ఏదైనా చదువుకుంటూ రిలాక్స్డ్ గా తినడం సమస్య లేకుండా ఎక్కువ తింటాం. ఖచ్చితంగా డైట్ చేసే పదార్ధాలు ఏవి రుచిగా వుండవు. అందుకని రుచిగా వున్న మంచి ఆహారం తిన్నా తప్పు లేదు ఎంత పరిణామం లో తింటున్నామన్నది చూసుకోవాలి. పిచు, నీరు, ప్రోటీన్లు వున్న పదార్ధాలు బాగా తినాలి. కాలరీలకు దూరంగా ఉండలి. ఖచ్చితమైన డైట్ గురించి అయితే ఒక బుక్ మైన్టైన్ చెయ్యాలి. తప్పని సరిగా పది, పన్నెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి. బాగా నిద్రపొతే శరిరం రిలాక్స్డ్ గా వుంటుంది. మెదడు పైన ఒత్తిడి తగ్గిపోతుంది. ౩౦,40 నిమిషాల వ్యాయామం చేసి తీరాలి. దీనికి ఏ కారణం చేతను వాయిదా వద్దు.

    నియంత్రణ వుండటం కరెక్టే

    ఏం తిన్నా ఎక్కువ తిన్నాం అని కంగారు పడిపోతుంటారు అమ్మాయిల. కొంచం నియంత్రణ తో వుంటే ఎలాంటి ఆందోళన వుండదు. తినేదేదో హడావిడి లేకుండా తినాలి. అసలు…