• స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్ పోర్టల్ లో భాగస్వామ్యులుగా వుంది. నిర్మాణంలో వున్న ఇళ్ళను గ్రూప్ గా కొంటె తక్కువ ధరలకు ఇస్తాననే ఒక సంస్థ ఇది. అలాగే శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర్రా, అక్షయ్ కుమార్లు కలిసి సెలబ్రెటీ షాపింగ్ షాపింగ్ ఛానల్ లో బెస్ట్ డీల్ టీ.వి ప్రారంభించారు. అలాగే పిల్లలకి సంబందించిన ఉత్పత్తులని అమ్మె బేబీఓయ్ డాట్ కామ్ లో కరిష్మాకపూర్ భాగస్వామిగా వున్నారు. ఫస్ట్ క్రై డాట్ కామ్ లోనూ ఈమె వాటా వుంది. వ్యాపారం ప్రారంబించాలనుకుంటే వాళ్ళకి ఈ సెలబ్రెటీలు ఇప్పటికే ఓ అడుగు ముందే వునారని చెప్పేందుకు ఈ కబురు మంచి ఆలోచన వుంటే ఇలాంటి స్టార్టప్ ని అతి వేగంగా మొదలు పెట్టోచ్చు. ఇలాంటి వ్యాపారాలకు ఆలోచనే పెట్టుబడి.

    ఇప్పటికే హీరోయిన్స్ మొదలెట్టేసారు

    స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్…

  • ఎండలు అప్పుడే ప్రతాపం చూపెడుతున్నాయి. మారిన వాతావరణంలో ముందుగా మన జీవన శైలి మార్చుకోకపొతే చాలా కష్టం. వాతావరణం వేడిగా వుంటే నీరు చమట రూపంలో బయటకు పోతుంది. అదే డిహైడ్రేషన్ కు కారణం అందుకే బార్లీ, సబ్జా నీళ్ళు తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, చెక్కర కలపని పండ్ల రసాలు, మజ్జిగా తాగాలి. వీలైనంత వరకు మసాలాలు, బయటి ఆహారం వద్దు. ఉదయము, సాయంత్రము అరగంట పాటు నాననిచ్చి తీరాలి. యోగా కూడా మంచిదే. అప్పుడే జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. అధిక బరువు అదుపులో వుంటుంది. ఇంట్లో వున్న బయటకి వెళ్ళినా తెలుపు తో పాటు రంగు దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. చేనేత రకాలైన నులు, భారీ లెనిన్ వస్త్రాలే చాలా మంచివి. చెప్పులు కూడా పాదాలకు గాలి తగిలే విధంగా వుండాలి. సూర్య కాంతి నేరుగా కళ్ళకు తగలకుండా కళ్ళద్దాలు వేసుకోవాలి.

    బార్లీ, సబ్జా నీళ్ళు మరువకండి

    ఎండలు అప్పుడే ప్రతాపం చూపెడుతున్నాయి. మారిన వాతావరణంలో ముందుగా మన జీవన శైలి మార్చుకోకపొతే చాలా కష్టం. వాతావరణం  వేడిగా వుంటే నీరు చమట రూపంలో బయటకు…

  • నీహారికా, కరుణా, జాలి, దయా, పుట్టుకతో వచ్చే గుణాలే? అవి అందరికి ఉండవా? అన్నావు కానీ పిల్లలకు వీటిని అలవాటు చేస్తే అలవరచుకునే అంశాలే అని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. చిన్న తనంలో తమకు అవసరం లేని దుస్తులను, బొమ్మలను ఇతరులకు ఇవ్వడం, తమ చేతుల్లో వున్న ఎంత ఇష్టమైన చాక్లెట్ అయినా తోటి పిల్లల తో పంచుకునే విధంగా ప్రోత్సహించడం తల్లిదండ్రుల కర్తవ్యం. అసలు కరుణ జాలి గుణాలు యంటి డిప్రసెంట్ లాంటి వని మానసిక శస్త్ర వేత్తలు విశ్వసిస్తారు. కరుణతో చేసే పనుల వల్ల సెరటోనిన్ అనే రాసాయినం ఉత్పత్తి అవ్వుతుంది. ఈ కెమికల్ నుంచి మంచి జ్ఞాపక శక్తి, నిద్ర, మూడ్, ఆరోగ్యం అన్ని పిల్లలకు లభిస్తాయి. కరుణ అనేది అలవాటైతే అనుకూల ప్రభావం పెద్ద అయినా చూపెడుతుంది. పెరిగే పిల్లల్లో ఆ స్వభావం వారిలో ఆరోగ్య పురితమైన ఆత్మస్థయిర్యం, తోటి వారి పట్ల స్నేహ పూరితమైన ధోరణి పెరుగుతాయి. పిల్లలకు తోటి వారి తో, జంతువులతో స్నేహంగా ప్రేమగా వ్యావహరింహడం పెద్ద వాళ్ళు నేర్పాలి. అస్సలు పెద్దలకు ఈ మూడు గుణాలు వుంటే వాళ్ళు ఇతరులతో అన్నీ పంచుకునే స్నేహపూరితమైన దృక్పదం కలవారైతే అవన్నీ చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఏ స్వభాన్ని అయినా వాళ్ళకు అలవాటుగా నేర్పొచ్చు.

    ఈ సుగుణాలు నేర్చుకుంటే వచ్చేవే!

    నీహారికా, కరుణా, జాలి, దయా, పుట్టుకతో వచ్చే గుణాలే? అవి అందరికి ఉండవా? అన్నావు కానీ పిల్లలకు వీటిని అలవాటు చేస్తే అలవరచుకునే అంశాలే అని ఎక్స్…

  • అల్లం టీ ఎంతో బాగుంటుంది. తలుచుకుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. ప్రతి వంటకానికి తనదైన ప్రత్యేక రుచిని అందించే ఆహార పదార్దమే గాక, ఒక అద్భుతమైన ఔషదం కూడా. ఎన్నో రుగ్మతులు నయం చేసేందుకు వైద్యులు అల్లాన్ని వాడుతున్నారు. అల్లం వేళ్ళలో బాగా పెద్ద స్థాయి లో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి కాన్సర్ కరకమైన ప్రీరాడికల్స్ తో పోరాడతాయి. కొన్ని రకాల పోషకాల ఉత్పత్తి జరగకుండా గట్టిగా ఆపుతాయి. స్త్రీలు గర్భం ధరించిన సమయంలో వంతులు వికారం రెండింటి తోనూ బాధపడుతుంటారు. కడుపులో వాయుప్రకోపాన్ని ఆపడంలో అల్లం ఉపయోగ పడుతుంది. కనుక వేవిళ్ళు దీని వల్ల ఆగుతాయి. ప్రతి రోజు తాజా అల్లం రసం నాలుగైదు చుక్కలు తాగితే మంచిది. జీర్ణ రసాలని ఊరేట్టు చేస్తుంది. నెల సారి కడుపు నొప్పి తగ్గిస్తుంది. మైగ్రేన్, తలనొప్పికి మంచి ఉపసమనం. కీళ్ళ నొప్పుల నుండి ఉపసమనం . ఈ ఘాటైన మసాలా దినుసు ఎన్నో వ్యర్ధాలను తగ్గించే మంచి మందు. అల్లం రసం, తేనె, నిమ్మరసం మంచి కాంబినేషన్.

    ఈ మసాలా దినుసు మహిమ అద్భుతం

    అల్లం టీ ఎంతో బాగుంటుంది. తలుచుకుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. ప్రతి వంటకానికి తనదైన ప్రత్యేక రుచిని అందించే ఆహార పదార్దమే గాక, ఒక అద్భుతమైన ఔషదం కూడా.…

  • మహిళలు ప్రతి నిత్యం చేసే పనులకు ఒక అంతు దరీ వుండదు. కుటుంబం ఉద్యోగం తో పాటు నిరంతం నిమగ్నమై వుండే మహిళలు సొంత ఆరోగ్యం విషయమై శ్రద్ధ తీసుకోరు. ఇటీవల ఒక్క పరిశోదన ఉద్యోగం చేసే మహిళల్లో చాలా మంది నీళ్ళు ఎక్కువ తాగరని, అస్థామానం ఆఫీసులో అందరి ముందు బాత్ రూమ్ వెళ్ళడం సమస్యని, లేదా సరైన బాత్ రూమ్ సౌకర్యం లేకపోవడం వల్ల మంచి నీళ్ళు తాగేందుకు ఇచ్చింది రిపోర్టు చెప్పుతుంది. మహిళల్లో ఈ నిబంధన సదలించుకోండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంటున్నారు. అలాగే ఉదయం తినాల్సిన పలహారం సమయం లేక ఎగ్గొట్టి, లంచ్ లో డిన్నర్ లో బాగా తినేసినా నష్టమే. శారీరక జీవక్రియ మందగించేది ఇక్కడే. ప్రోటీన్స్ తీసుకోక పోవడం వల్ల అధిక బరువు పెరుగుతారు. ప్రోటీన్స్ కు ఆధారమైన శాఖాహారం మాంసాహార పదార్ధాలు తినకపొతే వారి స్థానం లో కార్బోహైడ్రేడ్స్ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. రోజంతా ఆకలి తో వుంటే సమయానికి తినక ఎదో ఒక్కటి నోట్లో వీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అందుకే డైట్ లో కాల్షియం తప్పని సరిగా ఉంచుకోండి అంటున్నాయి పరిశోధనలు.

    ఇవన్నీ మహిళల పొరపాట్లే

    మహిళలు ప్రతి నిత్యం చేసే పనులకు ఒక అంతు దరీ వుండదు. కుటుంబం ఉద్యోగం తో పాటు నిరంతం నిమగ్నమై వుండే మహిళలు సొంత ఆరోగ్యం విషయమై…

  • ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్ చేయక పొతే చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. బొప్పాయిలో వుండే ఎంజైమ్స్ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. రెండు చెంచాల గుజ్జు లో కొద్దిగా ఆలివ్ నూనె, చెక్కర కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోని కడిగేస్తే ముఖం పై పేరుకున్న మురికి పోతాయి చెక్కని మెరుపు వస్తుంది. కొబ్బరి నూనెలో కొంచ చెక్కర , అర చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి, మెడకి మర్దనా చేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. పావు కప్పు ఓట్స్ పొడిలో పెరుగు, పసుపు, గులాబీ నీళ్ళు కలిపి ఈ మిశ్రమంతో మొహం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. రెండు చెంచాల కాఫీ పొడి లో బాదాం నూనె, కొబ్బరి నూనె కలిపి పూతలా వెయ్యాలి. తడి చేతుల్లో మర్దనా చేస్తే చల్లని నీళ్ళతో మొహం కడిగేసుకోవాలి. కాఫీ పొడి నిర్జీవంగా మారిన చర్మానికి జీవం ఇస్తే బాదాం నూనె తెమ అందిస్తుంది. బియ్యం పిండి, తేనె కలిపిన మిశ్రమంతో మాస్క్ వేసుకుని కడిగేసాక, మాయిశ్చురైజర్ రాస్తే చర్మం చాలా మృదువుగా కనిపిస్తుంది.

    ఇవన్నీ మంచి ఫేస్ ప్యాక్ లు

    ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్…

  • డెస్క్ ఉద్యోగాల్లో కుర్చుని పని చేసే సమయంలో సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయాలని చెప్పుతూనే వుంటారు. బుజాలు, వెన్ను, మెడ సరైన పోజిషన్ లో వుంచుకున్నంత మాత్రాన సరిపోదు. కాళ్ళు, పాదాలు కుడా పోశ్చర్ లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఫ్లోర్ పైన పాదాలు ఫ్లాట్ గా వుంచాలి. చాలా మంది కుర్చీ ముందరకు వంచినట్లు పెడతారు. అది సరికాదు. ఫిట్ రెస్ట్ వుంటే పాదాలు కరెక్ట్ గా దాని పైన వాలతాయి. అదీ సరిగా సౌకర్యమైన లెవెల్ లో వుండాలి. ఒక కాలానికి ఇంకో మోకాలి పైనవేస్తారు. దీని వల్ల రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఎక్కువ సేపు ఒకే పోజిషన్ లో కూర్చో కూడదు. వేలైనప్పుడల్లా పోశ్చర్ మార్చాలి. తరచూ లేచి బ్రేక్స్ తీసుకోవాలి. దీని వల్ల శారీరక పని సామధ్యం పెరుగుతుంది. బ్రేక్ తీసుకుంటున్నప్పుడు చిన్న పాటి వాకింగ్, శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. అప్పుడే కండరాళ్ళు రిలాక్స్ అవ్వుతాయి కూర్చొని నిలబడి, పడుకునే పోజిషన్స్ సరిగ్గా ఉంటేనే పోశ్చర్ చెక్కగా కనపడుతుంది.

    పాదాల పోశ్చర్ కూడా చాలా ముఖ్యం

    డెస్క్ ఉద్యోగాల్లో కుర్చుని పని చేసే సమయంలో సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయాలని చెప్పుతూనే వుంటారు. బుజాలు, వెన్ను, మెడ సరైన పోజిషన్ లో వుంచుకున్నంత…

  • ఎప్పుడూ పెద్దవాల్లకు ఫ్యాషన్ గురించే చర్చ వస్తుంది. కానీ చిన్న పిల్లల ఫ్యాషన్ మార్కెట్ అంత ఎత్తున వుంది. పెద్ద వాళ్ళ కోసం రూపొందించే స్కర్టులు, లేహంగా, అనార్కలి దుస్తులు అన్నీ పిల్లల కోసం డిజైన్ చేస్తున్నారు. గౌను తరహా లో, మంచి ఎంబ్రాయిడరీ, బ్రోకేడ్ మెరుపులతో తయ్యారయ్యె డ్రెస్ విలువ దాదాపు అమ్మాయిల డ్రెస్ ల ఖరీదు లోనే వుంది. లేహంగా, దుపట్టాలు కూడా అంతే. మెడ చుట్టూ నగలు అవసరం లేని లేస్ మెరుపుల ఎంబ్రాయిడరీ, సిల్క్, పట్టు, వస్త్ర శ్రేణుల తో లేహంగా, దుపట్టా మాచింగ్ ఇస్తున్నారు. పూర్తి ఎంబ్రాయిడరీతో ఫ్యాన్సీ సిల్క్ అనార్కలి డ్రెస్ అయితే పిల్లలకు కేవలం గౌన్లు, పట్టు లంగాల రోజులు ఇప్పుడో పోయాయి. ఇప్పుడు అన్ని రకాల ఫ్యాషన్స్ పిల్లల కోసం కూడా అందుబాటులో వున్నాయి.

    పాపాయిల కోసం ఫ్యాన్సీ డ్రెస్సులు

    ఎప్పుడూ పెద్దవాల్లకు ఫ్యాషన్ గురించే చర్చ వస్తుంది. కానీ చిన్న పిల్లల ఫ్యాషన్ మార్కెట్ అంత ఎత్తున వుంది. పెద్ద వాళ్ళ కోసం రూపొందించే స్కర్టులు, లేహంగా,…

  • కండరాల్ల నొప్పులతో చాలా మంది స్త్రీలు బాధపడుతూ వుంటారు. బుజం, మోకాళ్ళ కింద వుండే కండరాళ్ళు, తోడ భాగంలో వుండే కండరాళ్ళు నొప్పులకు అవి బలహీనంగా వునతమే కారణం అంటున్నారు డాక్టర్లు. బలం కోసం మాంసాహారమే అక్కర్లేదంటారు. కండరాల్ల పెరుగుదలకు, నిర్వహణకు కావాల్సింది ప్రధానంగా ప్రోటీన్లే. అవి మాంసాహారం వల్లనో శాఖాహారం వల్లనో కావొచ్చు. సోయాబీన్స్, బటానీలు, పప్పు ధాన్యాలు వంటి వాటి నుంచిలభించే ప్రోటీన్లకు మాంసాహారం నుంచి లభించే ప్రోటీన్లు ఏమి వుండదు. ఏ ప్రోటీన్లు అయినా మేలే చేస్తాయి. కాకపొతే ఏ ఆహారం నుంచి అయినా సరే ప్రోటీన్లు అంటే ఆహారం తీసుకుంటే చాలు కండరాళ్ళ నొప్పులే సరిగ్గా నడవనీయకపొతే, శరీరం బరువు పెరగడానికి కారణం అవుతుంది. అలాగే కండరాళ్ళు బలహీనంగా వుంటే ఇక శరీరం ఫిట్ నెస్ గా వుండటం అసాధ్యమే.

    శరీరానికి ఏ రకంగా అందినా మంచిదే

    కండరాల్ల నొప్పులతో చాలా మంది స్త్రీలు బాధపడుతూ వుంటారు. బుజం, మోకాళ్ళ కింద వుండే కండరాళ్ళు, తోడ భాగంలో వుండే కండరాళ్ళు నొప్పులకు అవి బలహీనంగా వునతమే…

  • కొబ్బరి నీళ్ళు తాగి బొంద ఇచ్చేసి, అడ్డంగా కొట్టేసి లేత కొబ్బరి ఇస్తారు దుకాణ దారులు. ఆ లేలేత కొబ్బరి ఎంతో ఆరోగ్యం. కప్పు లేత కొబ్బరి లో ఏడు గ్రాముల డైటరీ పిచు వుంటుంది. అలాగే 283 క్యాలరీలు, పిండి పదార్ధాలు, చెక్కర, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీన్ని గర్భినిలు హ్యాప్పీ గా సందేహం లేకుండా తినొచ్చు. నీళ్ళు లాగే ఈ కొబ్బరి డి-హైడ్రేషన్ దూరం చేస్తుంది. పాలు కారే కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్లు కరిగే కొవ్వు ఉంటాయి. ఇవి త్వరగా శరీరంలో కలిసి మంచి పోషకాలు విడుదల చేస్తాయి. అవసరమైన శక్తిని అందజేస్తాయి. పోటాషియం, సోడియం కుడా లేత కొబ్బరి తో లభిస్తాయి. ఇవి శరీరానికి అందటం వల్ల రక్త పోతూ అదుపులో వుంటుంది. రక్తంలో పోటాషియం శాతం కూడా సమంగా వుంటుంది. ఇందులో విటమిన్-బి, ఫోలెట్లు తక్కువ. నీరసంగా వుంటే ఈ లేలేత కొబ్బరి తింటే వెంటనే ఉత్సాహం వస్తుంది. ప్రతి రోజు తిన్నా సమస్య వుండదు. సరిపడా పిచు కుడా లభిస్తుంది.

    లేత కొబ్బరితో పుష్కలంగా ఖనిజాలు

    కొబ్బరి నీళ్ళు తాగి బొంద ఇచ్చేసి, అడ్డంగా కొట్టేసి లేత కొబ్బరి ఇస్తారు దుకాణ దారులు. ఆ లేలేత కొబ్బరి ఎంతో ఆరోగ్యం. కప్పు లేత కొబ్బరి…