• ఈ సింక్ పిల్లలక్కూడా

    ఎన్నో మంచి కార్పోరేట్ భవనాలు, స్టార్ హోటళ్ళు ఎన్నో వచ్చాయి మన దేశంలో. కానీ పిల్లలతో ఎక్కడికైనా వెళితే పిల్లల కోసం వుండే ప్రత్యేకమైన సౌకర్యాలు ఏవీ…

  • నెయిల్ ఆర్ట్. అమ్మాయిల ఫ్యాషన్ లు ఎప్పుడు ముందు వరుసలో పిథం వేసుకున్న బ్యూటీ ఫుల్ ట్రెండ్. ఏళ్ళు గడుస్తున్నా దీనికున్న డిమాండ్ పెరగటమే కానీ తగ్గిందే లేదు. ఇప్పుడు గోళ్ళకు ఒక రంగు వేయగానే రెండు, మూడు షేడ్ లు వచ్చేలాగ కలర్ షిప్టింగ్ మల్టీ క్రోమ్. నెయిల్ పాలిష్ లు వస్తున్నాయి. ఈ రంగు వేసుకుంటే ఒకే గోరు పైన రెండు రకాల గోళ్ళరంగు కళాత్మకంగా వేసినట్లే అనిపిస్తుంది. అంతేనా లైట్ పడితే చాలు ఇది చక్కగా మెరవడంతో పాటు రంగుల్లో తేడా మరింత బాగా చూపిస్తుంది. ఇలా వేసుకుంటే నెయిల్ ఆర్ట్ తో సంబంధం లేకుండా గోళ్ళ ముస్తాబు ముగించ వచ్చు. బర్లీ, పాలిష్ మీ సిల్లీ పేర్ల తో కనబడే ఈ గోళ్ళ రంగులు ఓ సారి ఆర్డరిస్తే ఇంటికొస్తాయి.

    రంగు ఒక్కటే కనిపించేవి రెండు

    నెయిల్ ఆర్ట్. అమ్మాయిల ఫ్యాషన్ లు ఎప్పుడు ముందు వరుసలో పిథం వేసుకున్న బ్యూటీ ఫుల్ ట్రెండ్. ఏళ్ళు గడుస్తున్నా దీనికున్న డిమాండ్ పెరగటమే కానీ తగ్గిందే…

  • నీహారికా, ఇవ్వలొక కథ చెపుతాను. సమాజంలో పది మందితో కలిసి జీవించడం వల్ల కలిగే లాభం గురించిన కథ. ఒక ఇంజనీరు ఫ్యాక్టరీలో పనిచేస్తూ సమయం చూసుకోలేదు. ఏదో యంత్రం బాగుచేసే పనిలోవుండి. దాన్ని పూర్తిచేసి చూస్తే ఎవళ్ళూ లేరు. బయట తాళాలు వేయడం, లైట్లు తీయడం తెలుస్తూనే ఉన్నాయి. ఇక ఈ రాత్రికి ఈ వేడిలో మంచినీళ్ళు, భోజనం లేకుండా గడవాలి కాబోలు అనుకొంటూ వుంటే, కొన్ని గంటల తర్వాత ఎవరో తాళం తీసి లోపలకు వచ్చిన సవ్వడి వినిపించింది. తాళం తీశారెవరో టార్చి లైట్ ఇంజనీరు పైన పడింది. వచ్చింది సెక్యూరిటీ గార్డ్స్. నేనిక్కడ చిక్కుకుపోయానని ఎలా గ్రహించారు అన్నాడు ఇంజనీరు. సార్ ఇంతమంది ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తూనే ఉన్నా నాకెవ్వరూ డ్యూటికి వస్తూ గుడ్ మార్నింగ్, వెళుతూ గుడ్ నైట్ చెప్పేది మీరొక్కరే. ఈ రోజు గుడ్ మార్నింగ్ చెప్పారు, గుడ్ నైట్ కోసం ఎదురు చూశాను. మీరు వాపస్ వెళ్లలేదని నాకు ఖచ్చితంగా అనిపించింది. అందుకని వెతుక్కుంటూ వచ్చానన్నాడతను. ఇది కథే కానీ వాస్తవం. అందరితో సఖ్యతగా, ప్రేమగా, గౌరవoగా వ్యవహరించాలని ఎప్పుడూ ఏదైనా ఇస్తూ వుంటే తిరిగి ఏదో రూపంగా మనకు వస్తూ ఉంటుందని చెప్పే మంచి కథ. తప్పకుండా గుర్తుంచుకో.

    ఇవ్వండి! ఆ ఇచ్చింది తిరిగివస్తుంది

    నీహారికా, ఇవ్వలొక కథ చెపుతాను. సమాజంలో పది మందితో కలిసి జీవించడం వల్ల కలిగే లాభం గురించిన కథ. ఒక ఇంజనీరు ఫ్యాక్టరీలో పనిచేస్తూ సమయం చూసుకోలేదు.…

  • నిమ్మకాయలు వాడుతూనే వున్నాం. ఎప్పుడూ కోశాక ఒక్క అరముక్క మిగిలిపోతూ వుంటుంది. దాన్ని అలా వదిలేయకుండా బూట్లలో పడేయండి. దుర్వాసన రాకుండా వుంటుంది. బీట్ రూట్, స్ట్రాబెర్రీలు, నేరేడు వంటివి చేతులకి మరకలు అంటే లా చేస్తాయి. ఈ మరకలు పోయేందుకు నిమ్మచాక్క రుద్దాలి. ఒక బంగాళ దుంప పేస్టులా చేసి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం సహజంగా బ్లీచ్ అవుతుంది. టేబుల్ స్పూన్ పసుపు, కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ పాదాలకు రాసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు పగుళ్ళు తగ్గుతాయి. ఆర చెక్క నిమ్మరసం పెరుగు మొఖానికి రాసి 20 నిమిషాలు ఆగి కడిగేస్తే మొటిమలు రాకుండా ఉంటాయి. ఎక్స్ ట్రావర్జిన్ ఆయిల్. ఈ తరహా ఆలివ్ ఆయిల్ లో వున్న మోనో అసాచ్యురేటెడ్ కొవ్వులో హానికరమైన కొలెస్ట్రోల్ తగ్గిస్తాయి. రైస్ బ్రాడ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ కూడా మంచివే.

    వాళ్ళ ఆరోగ్యానికి మూలం ఇదే

    నిమ్మకాయలు వాడుతూనే వున్నాం. ఎప్పుడూ కోశాక ఒక్క అరముక్క మిగిలిపోతూ వుంటుంది. దాన్ని అలా వదిలేయకుండా బూట్లలో పడేయండి. దుర్వాసన రాకుండా వుంటుంది. బీట్ రూట్, స్ట్రాబెర్రీలు,…

  • సంతోషం సంపద ఇచ్చే మొక్కలు

    ఇంట్లోకి సంతోషం సంపదను తెచ్చే మొక్కలట పైగా ఇంట్లోనే పెరిగే మొక్కలిని. తులసి మొక్క ఇంటి ముందు వుంటే క్రిమి కీటకాలు రావు. తులసి ఆకులు యాంటీ…

  • ఎంతో మంది ఉపవాస్యాలు వింటూ వుంటాం. కొన్ని కొంత మంది చెప్పే పద్దతిలో, దాన్ని ఆచరించే పద్దతితో ఆకర్షణ వుంటుంది. అలా చక్కగా చెప్పే వాళ్ళతో ప్రియాంకా చోప్రా కూడా ఒకరు. ఆమె ఏం చెప్పుతున్నారంటే, నాకు ప్రేమ పైన నమ్మకం లేదు. జీవితం గెలవాలంటే ఒక ప్రణాళిక వుండాలి. జీవితాన్ని అలా ప్రణాళికా బద్దంగానే తీర్చిదిద్దుకొన్నా. నాకు నచ్చిన దారిలో వెళ్లేందుకు మా అమ్మానాన్నలు ఎంతో ప్రోత్సహించారు. తర్వాత మనం ఎవరి కోసమో మారాల్సిన అవసరం లేదు. మనం మాన్ లాగే వుండాలి. అందరినీ సంతోష పరచడం సాధ్యం కాదు. అప్పుడు అవతలి వాళ్ళు నిర్ణయించుకుంటారు మనల్ని ఇష్టపడాలా వద్దా అని. నేను సృజనాత్మక విషయాల నుంచే స్ఫూర్తి పొందుతాను. వాళ్ళు మన జీవితానికి రంగులు అద్దుతారు. భావోద్వేగాలతో నింపుతారు. నా ఫిలాసఫీ ఒక్కటే మీరు మీరుగా వుండండి. ధైర్యంగా ప్రేమగా నిజాయితీగా ఉండి ఉండాలి. ఒక్క నిజాయితీకోసం నిలబడితే చాలు ధైర్యం దానంతట అదే వస్తుంది. అంటోంది ప్రియాంకా చోప్రా. ఈ సెలబ్రెటీ చెప్పే జీవన సూత్రాలు ఇవ్వాల్టి అమ్మాయిలకు తప్పనిసరిగా ఉపయోగ పడతాయి.

    జీవితం పర్ ఫెక్ట్ ప్రణాళికతొనే సక్సెస్

    ఎంతో మంది ఉపవాస్యాలు వింటూ వుంటాం. కొన్ని కొంత మంది చెప్పే పద్దతిలో, దాన్ని ఆచరించే పద్దతితో ఆకర్షణ వుంటుంది. అలా చక్కగా చెప్పే వాళ్ళతో ప్రియాంకా…

  • ఇవాల్టి తరం అమ్మాయిలకు పెద్దగా ఆర్ధిక ప్రణాళికలు వేసుకోవడం రానట్లేనని, ఉద్యోగినులు ఇప్పటికీ పి.పి.ఎఫ్, ఫిక్సడ్ డిపాజిట్ల బంగారం వంటి సంప్రదాయ పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తారని ఒక సర్వే చెపుతుంది. ఎక్కువ రాబడి ఇచ్చే మ్యుచువల్ ఫండ్స్, ఇతర మదుపు పధకాలు ఎన్నో వున్నాయి. పొడుపు, మదుపు రెండు ఉద్యోగ ప్రారంభంలో మొదట పెట్టాలి. పాతికేళ్ళ వయస్సులో నెలనెలా మూడు వేళ రూపాయిలు కడితే పదవీ విరమణ వయస్సు వచ్చేసరికి మూడు కోట్ల రూపాయిల పెన్షన్ ఇచ్చే పడకాలున్నాయి. నలబై ఏళ్ళ మహిళ ఈ ప్లాన్ కోసం ప్రయత్నం చేయాలంటే కనీసం నెలకు 40 వేలు దాచి పెట్టాలి. అందుకే సరైన సమయంలోపు ప్రారంభించాలి. ప్రతి ఉద్యోగానికి కనీసం ఆరు నెలల జీతం ఎంత వుంటుందో అంత డబ్బు సేవ చేసి పెట్టుకుని తర్వాతే పొడుపు గురించిఆలోచించాలి. ఏదయినా ప్రమాదం జరిగినా ఉద్యోగం పోయినా, కొత్త జాబ్ వెతుక్కునేదాకా ఆ డబ్బు కాపాడుతుంది.

    సేవింగ్స్ మొదలు పెట్టారా లేదా?

    ఇవాల్టి తరం అమ్మాయిలకు పెద్దగా ఆర్ధిక ప్రణాళికలు వేసుకోవడం రానట్లేనని, ఉద్యోగినులు ఇప్పటికీ పి.పి.ఎఫ్, ఫిక్సడ్ డిపాజిట్ల బంగారం వంటి సంప్రదాయ పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తారని ఒక…

  • ఇప్పుడు రోడ్లన్నీ మామిడి పండ్ల రసాలతో, నిండిపోయి ఉంటాయి ఎన్నో రకాలు. ఏది కావాలి. అల్ఫోంసో అని పిలిచే మామిడి రుచులు అద్భుతం. ఇది మహారాష్ట్రాలోని రత్నగిరి ప్రాంతానిది. ఆమ్రపాలి అనే ఎరుపు రంగు పండు ఉత్తర్ ప్రదేశ్ ది. బంగిన పల్లి ఆంధ్రప్రదేశ్ సైజు, తీపిలో దీన్ని దాటే పాండే లేదు. చిన్న సైజులో వుండే చేసా ముల్సన్ ప్రాంతానిది. వాసన రుచి కలిగిన రసం పండు ఇది. టెంకె చిన్నదిగా వుండే దుస్సేహ్రీ మంచి రంగు, వాసనతో పీచు తక్కువగా వుంటుంది. పంచదార వంటి తియ్యదనంతో పలుచని పై చర్మం వున్న హిమసాగర్ బెంగాలీ మామిడి. నీలం అనే హైదరాబాద్ మామిడి. మల్లోవా అనే తమిళనాడు పండు పసుపు రంగు పీచుతో కండ బావుంటుంది. తోతాపూరి అనేది చిలక ముక్కు మామిడి ఇది ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో దొరుకుతుంది. దీన్నే చిత్తూరు మామిడిలో ప్రతేకం. ఈ రసం పండు రుచి అద్భుతం. ఇంకా కొత్త కొత్త వెరైటీస్ సృష్టిస్తూనే ఉన్నారు.

    ఎన్ని రకాలా? దేని రుచి దానిదే

    ఇప్పుడు రోడ్లన్నీ మామిడి పండ్ల రసాలతో, నిండిపోయి ఉంటాయి ఎన్నో రకాలు. ఏది కావాలి. అల్ఫోంసో అని పిలిచే మామిడి రుచులు అద్భుతం. ఇది మహారాష్ట్రాలోని రత్నగిరి…

  • ఇది సెల్ఫీల యుగం. ఏ ప్రదేశమైనా, షాపింగ్ సినిమా హాల్, పళ్ళ మార్కెట్ , రోడ్డు పక్కని ఛాట్ తింటున్నా సరే సెల్ఫి లేకుండా పని జరగదు. మనం ఎప్పుడూ ఎక్కడ ఏం చేస్తున్నామో, ఎంతగా సంతోష పడిపోతున్నామో అవతలి వాళ్ళకు తెలియాలి. అందుకే సెల్ఫి, ఇప్పుడీ ఫోటో తీసేటప్పుడు తగిన వెలుతురు ఉండేలా చూడాలి. అప్పుడే ఆ జ్ఞాపకంతో పాటు ముఖం కుడా చెక్కగా వుంటుంది. శరీర చాయ కూడా బాగుంటుంది. వెలుతురుకు దూరంగా వుండే సెల్ఫీ అస్పస్టంగా వుంటుంది. ఇలాంటి ఫోటోలకు అలంకారణ అక్కర లేదు. వీలైనంత సహజంగా వుండాలి. ముఖంలో రకరకాల భావాలు చుపెట్టాలంటే మాత్రం సెల్ఫీ అసహజంగా వుంటుంది. ముఖాన్ని కాస్త పక్కకు పెట్టాలి. సన్నగా కనబడాలంటే ఫోన్ దూరంగా వుంచి తీసుకోవాలి. లేదా ఇంటి దగ్గరే ఒక ఫోటో సెషన్ ప్లాన్ చేయాలి. అప్పుడే ఏ యాంగిల్ మోహ బావుంటుందో తెలిసిపోతుంది. ఒక్కరి కంటే ఎక్కువ మంది వుంటే కాస్త పొడుగ్గా వున్న వాళ్ళకి ఫోన్ ఇస్తే బాగా వస్తుంది. ఇక ఎత్తయిన ప్రదేశాలు, జలపాతాలు, సముద్రాలూ, నడి రోడ్లో సెల్ఫీ కోసం ఉపయోగించకుండా ఉంటేనే మంచిది.

    ఏ యాంగిల్ లో బావుంటారు?

    ఇది సెల్ఫీల యుగం. ఏ ప్రదేశమైనా, షాపింగ్ సినిమా హాల్, పళ్ళ మార్కెట్ , రోడ్డు పక్కని ఛాట్ తింటున్నా సరే సెల్ఫి లేకుండా పని జరగదు.…

  • బిల్ క్లింటన్ ఆరోగ్యం కోసం డాక్టర్ ఎసెల్ స్టీన్ సూచించిన ఆహారం తిసుకుంటారట. ఈ డాక్టర్ గారు ఏం తినమంతున్నాడో ఏం వద్దంటున్నాడో చూడండి. ఇదిగో ఇవి మాంసం, చేపలు, గుడ్లు, ఆలివ్ నూనె, వారి పస్తా ఇవి కాక ఇంకా ఏమన్నా తినొచ్చా అంటే తినొచ్చు అన్నవి- ఆకు కూరలు, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్ వంటి అన్ని రకాల ధాన్యాలు, పొట్టు తీయని ధాన్యాలు, అందులోనుంచి తయారైన బ్రెడ్ తీసుకోవచ్చు. పండ్లు అన్నిరకాల పండ్లు తీసుకోవచ్చు. ఒకవేళ పండ్ల రసం తాగాలి అనిపిస్తే తాజా పండ్ల రసం మాత్రమే తీసుకోవాలి అందులో చెక్కర కలపకూడదు. ఇక ద్రవ పదార్ధాలలో ఓట్ మీల్స్, లో ఫ్యాట్ సోయా మిల్క్ తీసుకోవచ్చు. కాఫీ,టీ పరిమితంగా తీసుకోవాలి. ఇలా ఆహారమే ఔషదం తీసుకోగలిగితే గుండె జబ్బులు రావంతున్నారు. డాక్టర్ ఎసెల్ స్టిన్. ఆయన రాసిన ప్రివెంట్ అండ్ రివర్స్ హార్టడిసీజ్ నెట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    ఇది నూనె లేని బెస్ట్ ఫుడ్

    బిల్ క్లింటన్ ఆరోగ్యం కోసం డాక్టర్ ఎసెల్ స్టీన్ సూచించిన ఆహారం తిసుకుంటారట. ఈ డాక్టర్ గారు ఏం తినమంతున్నాడో ఏం వద్దంటున్నాడో చూడండి. ఇదిగో ఇవి…