• సరదా వుండాలే కానీ బోలెడన్ని వస్తువులున్నాయి మార్కెట్ లో. ఒక గోళ్ళ విషయం తీసుకోండి. స్ప్రే ఆన్ నెయిల్ పాలిష్ తీసుకుంటే దాన్ని పది పదిహేను సెంటీమీటర్ల దూరం నుంచి చేతి పైన స్ప్రే చేస్తే గోరంతా పరుచుకుంటుంది. మిగతా చేతిపై పడ్డ పాలిష్ ను నీళ్లతో కడిగేస్తే పోతుంది. గోళ్ళ పైన రంగు పోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉండాల్సిందే. నెయిల్ పెయింట్ క్లీనప్ పెన్ తీసుకుంటే గోళ్ళ రంగు వేసుకునేటప్పుడు చర్మానికి అతుకున్న రంగుని ఈ పెన్ లో వున్న నెయిల్ పాలిష్ రిమూవర్ లు గొఱుకు తగలకుండా తుడిచేయచ్చు. ఇప్పుడు కలర్ చేంజ్ నెయిల్ పాలిష్ తీసుకోండి. ఈ గోళ్ళ రంగు వేసుకుని నీటిలో వుంటే ఒక రంగులో వుంటుంది. ఎండ గానీ వేడి కానీ తగిలితే వేరే రంగంలోకి మారిపోతుంది. అంటే దానంతట అదే రంగు మారిపోతుంది. అంటే నెయిల్ పాలిష్ స్ట్రిప్స్ తీసుకుంటే అవి వివిధ డిజైన్లతో ఎన్నెన్నో రంగుల్లో వుంటాయి. మనకి నచ్చిన రంగు సైజు తీసుకుని గోరుకు అంటించుకోవటమే ఎలాగంటే స్ట్రిప్ పైన ప్లాస్టిక్ కవర్ వుంటుంది. అది లాగేసి గోరుకు అంటించుకుంటే డిజైన్ లాగా రంగు గోరుకు అంటుకుంటుంది. డిజైన్ లాగా రంగు గోరుకు అంటుకుంటుంది. వీలికేమైనా అంటితే క్లీనప్ పెన్ తో తుడిచేస్తే సరి. ఈ వస్తువులన్నీ నెట్ లో సెర్చ్ చేసి ఆన్ లైన్ లో కొనుకోవచ్చు.

    గోళ్ళ అందానికి నగిషీలు

    సరదా వుండాలే కానీ బోలెడన్ని వస్తువులున్నాయి  మార్కెట్ లో. ఒక గోళ్ళ విషయం తీసుకోండి. స్ప్రే ఆన్ నెయిల్ పాలిష్ తీసుకుంటే దాన్ని పది పదిహేను సెంటీమీటర్ల…

  • కోపం అన్నీ అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో ఏర్పడ్డ గాయాలు తొందరగా మానక పోవటానికి కోసం ఒక ముఖ్య కారణం అని ఇటీవల పరిశోధనలు చెపుతున్నాయి. కోపం ఎక్కువైతే కార్టిసోల్ హార్మోన్ విడుదల అవుతాయి. ఇవి పుండ్లు ,గాయాలు మానకుండా చేస్తాయట. మామూలు స్థాయి కంటే ఎక్కువ కోపం వున్నవాళ్లకే ఈ ప్రాబ్లమ్. కాలిన గాయాలతో బాధపడుతున్న 300 మందికి పైన పరిశోధనలు నిర్వహించి ఈ విషయం గుర్తించారు. వారిలో అకారణంగా ఉద్రేక పడేవారిలో గాయాలు మానేందుకు ఇరవై రోజులు సమయం పడితే శాంతంగా వుండేవాళ్ళలో నాలుగైదు రోజుల్లోనే గాయాలు మానటం ప్రారంభించాయట. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటే ఒక గాయాలే కాదు ఇంకేమన్నా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండచ్చు అంటునాన్రు పరిశోధకులు. ఈ కోపం వల్లనే నాడీ వ్యవస్థ పై శ్రీఘ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. ఈసారి కోపం వచ్చినప్పుడు గమనించండి. తీవ్రమైన కోపం వస్తే వళ్ళు వణికి పోతుంది. పల్స్ రేట్ అధికంగా వుంటుంది. కోపం కొంచెం అదుపులో ఉంచుకోవటం ఉత్తమం అంటున్నారు పరిశోధకులు.

    శాంతములేక సౌఖ్యము లేదు

    కోపం అన్నీ  అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో ఏర్పడ్డ గాయాలు తొందరగా మానక పోవటానికి కోసం ఒక ముఖ్య కారణం అని…

  • సెంట్రల్ అడాప్షేన్ రిసోర్స్ అథారిటీ లెక్కల ప్రకారం పిల్లల దత్తత కోసం దత్తత కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులు చుస్తే వాటిలో మూడువంతులు అమ్మాయి కావాలనే అడిగినవే. గత మూడేళ్ళుగా ఈ గణాంకాలను చూసినా 60 శాతం మంది ఆడపిల్లలనే అభిర్దిస్తున్నారట. అనాధశ్రమాల నుంచి పిలల్లను దత్తత తీసుకోవాలనుకునే వారికోసం దేశవ్యాప్తంగా 400 దత్తత కేంద్రాలున్నాయి. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా సంతానం లేనివాళ్లు ఆడపిల్లల్నే కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు తమిళనాడులో కుడా ఆడపిల్లల పైనే ఆసక్తి. మగపిలల్ల కన్నా ఆడపిల్లలనే తల్లితండ్రుల వల్ల ఎక్కువ ప్రేమానురాగాలను ప్రదర్శిస్తారని తేలటమే ఇందుకు కారణం అంటున్నారు అధికారులు. కాకపోతే దత్తతకు సంబంధించిన నియమనిబంధనలు కఠిన తరంగ వుంటాయి. కనుక ఎక్కువ మంది ఈ కేంద్రాల పట్ల ఆసక్తి చూపరు. కానీ గణాంకాలు చూసి మాత్రం ఆడపిల్లల విషయంలో సింగిల్ పేరేంట్స్ పిల్లలు లేని దంపతులు ఆసక్తి చూపించటం పట్ల సామజిక విశ్లేషకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    మాకు అమ్మాయే కావాలి

    సెంట్రల్ అడాప్షేన్ రిసోర్స్ అథారిటీ లెక్కల ప్రకారం పిల్లల దత్తత కోసం దత్తత కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులు చుస్తే వాటిలో మూడువంతులు అమ్మాయి కావాలనే అడిగినవే. గత…

  • ఎన్.బి.ఏ చరిత్రలో తోలి చైర్ పర్సన్ అరుంధాతీ భట్టాచార్య. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల్లో 25వ స్థానంలో ఉన్నారు. 22 సంవత్సరాల వయసు లో ప్రోబిషనరీ అధికారిగా వుద్యోగంలో చేరిఅంచలంచెలుగా చీఫ్ ఫైనాన్షియల్ అధికారిణి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగారు. కొందరి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా వుంటుంది.అరుంధాతీ భట్టాచార్య అలంటివారే. ఆర్ధిక ప్రణాళికలు అందించడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్న అరుంధాతి స్టేట్ బ్యాంక్ ను డిజిటల్ బ్యాంక్ గా మార్చడంలో ఎంతో కృషి చేసారు. కస్టమర్ బ్యాంక్ కు రాకుండానే కేవలం మొబైల్, ఇంటర్నెట్ ద్వారా అన్ని సేవలను పొందే లాగా టెక్నాలజీ నియి౦ లో క్యాష్ లెస్ బ్రాంచ్లను ఏర్పాటు చేసారమె మొబైల్ బ్యాంకింగ్ జనరల్ ఇన్సూరెన్స్లలో మెరుగైన ఫలితాలు రాబట్టి ఎస్.బి.ఐ ని లాభాల భాట పట్టించారు. కాస్తంత సమయం దొరికినా పుస్తకాలు, సంగీతంతో గడిపే అరుంధాతీ భట్టాచార్య " ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సమన్మయం చేసుకోవడం లోనే మహిళ విజయం దాగుందని అంటారు.

    అత్యున్నత స్థాయిలో అరుంధాతీ భట్టాచార్య

    ఎన్.బి.ఏ చరిత్రలో తోలి చైర్ పర్సన్ అరుంధాతీ భట్టాచార్య. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల్లో 25వ స్థానంలో ఉన్నారు. 22 సంవత్సరాల వయసు లో ప్రోబిషనరీ అధికారిగా వుద్యోగంలో…

  • ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో, నిలబడితేనో ఫోటో అయిపోతుందా. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్లే అవసరం, సినిమా యాక్టర్ల్ ఫోటో షూట్ చుస్తే ఫోటోగ్రాఫి ఎంత క్రియేటివ్ గా ఉండాలో అర్ధం అవుతుంది. చైనా కు చెందిన మక్రిరుయి(Ma Qurai) అనే మహిళా ఫోటోగ్రాఫర్ పది లక్షల యెన్ లో ఖర్చు చేసి వాటర్ ఫొటో స్టూడియో ఏర్పాటు చేసింది. ఈ ఫోటోగ్రాఫీలో శిక్షణ తీసుకుని ప్రతి సంవత్సరం పోటీల్లో కూడా పాల్గొంటుంది క్విరుయి. అందంగా వెరైటీగా ఫోటోలు దిగాలని కస్టమర్లు వస్తే స్విమ్మింగ్ దుస్తులు ధరించి ప్రత్యేక పరికరాలు, కెమేరాల తో వాళ్ళని నీళ్ళల్లో స్టూడియోకు తీసుకుపోతుంది. నీటి లోపల ఆమె అద్భుతమైన ఫోటోలు తీయగలరు. ఆమె ప్రతిభను మెచ్చుకొంటు నెటిజన్లు మోస్ట్ బ్యూటిఫుల్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ గా ప్రేశంసలు కురిపిస్తున్నారు.ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో, నిలబడితేనో ఫోటో అయిపోతుందా. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్లే అవసరం, సినిమా యాక్టర్ల్ ఫోటో షూట్ చుస్తే ఫోటోగ్రాఫి ఎంత క్రియేటివ్ గా ఉండాలో అర్ధం అవుతుంది. చైనా కు చెందిన మక్రిరుయి(Ma Qurai) అనే మహిళా ఫోటోగ్రాఫర్ పది లక్షల యెన్ లో ఖర్చు చేసి వాటర్ ఫొటో స్టూడియో ఏర్పాటు చేసింది. ఈ ఫోటోగ్రాఫీలో శిక్షణ తీసుకుని ప్రతి సంవత్సరం పోటీల్లో కూడా పాల్గొంటుంది క్విరుయి. అందంగా వెరైటీగా ఫోటోలు దిగాలని కస్టమర్లు వస్తే స్విమ్మింగ్ దుస్తులు ధరించి ప్రత్యేక పరికరాలు, కెమేరాల తో వాళ్ళని నీళ్ళల్లో స్టూడియోకు తీసుకుపోతుంది. నీటి లోపల ఆమె అద్భుతమైన ఫోటోలు తీయగలరు. ఆమె ప్రతిభను మెచ్చుకొంటు నెటిజన్లు మోస్ట్ బ్యూటిఫుల్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ గా ప్రేశంసలు కురిపిస్తున్నారు.

    ఫోటో దిగాలంటే నీళ్ళలోకి వెళ్ళాలి

    ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో,…

  • శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట దగ్గర పలుచగా వుంటుంది. మాడు పైన జుట్టు అణిగినట్లుంటుంది. ఇలా వుంటే ఏ స్టైల్ కూడా సరిగ్గా నప్పదు. సాధారణంగా జుట్టును నుదుటి పై నుంచి వెనక్కి లాగినట్లు దువ్వుతాం కనుక స్ట్రెచ్ చేసే చోట పలుచ పడిపోతుంది. పైగా పాపిట తీస్తాం కనుక సమస్య మరింత ఎక్కువగా వుంటుంది. పాపిట పొడుగైన జుట్టు పలుచగా వున్న చోట ఆముదం అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రొజూ చేస్తే రెండు నెలల్లో ఫలితం కనిపిస్తుంది. చిన్న చిన్న వెంట్రుకలు పెరగడం మొదలవుతుంది. వారానికి ఒక్క సారి గోరు వెచ్చని కొబ్బరి నూనె మాడంతా అప్లై చేసి మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్ళకు అదనపు లూబ్రికేషన్, పోషకాలు లభిస్తున్నాయి. జుట్టును ముడి వేసుకుంటే కుదుళ్ళను కిందికి లాగ కుండా వుంటుంది. జుట్టు చిక్కులు పడకుండా సమంగా దువ్వుకుంటూ వెటినర్ ఆయిల్ రాసుకుంటే ఇందులో సన్ స్కన్ వుండి జుట్టుకు హాని చేసే కిరణాల నుంచి రక్షిస్తుంది.

    మాడు పై జుట్టు పల్చబడిందా?

    శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట దగ్గర పలుచగా వుంటుంది. మాడు పైన జుట్టు అణిగినట్లుంటుంది. ఇలా వుంటే ఏ…

  • మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో ఎక్కువసేపు ఏకాగ్రత తో కొనసాగించగలరని వారి జ్ఞాపకశక్తిని మెరుగ్గా వుంటుందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ అధ్యయనాలు గ్రూప్ కు మైండ్ ఫుల్ మెడిటేషన్ ఎనిమిదివారాల శిక్షణ రెండో గ్రూపు కు రిలాక్సేషన్ ట్రైనింగ్ లు ఎనిమిది వారాలు మూడో గ్రూప్ కు ఏ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తూ కొన్నాళ్లు పరిశోధనలు నిర్వహించారు. వాళ్లందరికీ ఎన్నో రకాల పనులు ఇచ్చారు. ఈ మల్టీ టాస్కింగ్ వేగాన్ని ఖచ్చితంగా చేసే తీరుని సమర్ధతని నిపుణులు అంచనా వేశారు. అందరికంటే ముందు మైండ్ ఫుల్ మెడిటేషన్ ట్రైనింగ్ తీసుకున్నవారున్నారు. ఈ గ్రూప్ సభ్యులు ఎక్కువ సేపు దేని పై ధ్యానం వుంచగలిగారు . బహుళ పనులు చేయగలిగారు. బహుళ పనులు చేస్తూ ఆ వృత్తిని జయించగలిగారు. ఎలాంటి శ్రమ వత్తిడీ లేకుండా ఎంతో సమర్ధవంతంగా పనులు చేశారట. ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ చాలా అవసరం. అంచేత ధ్యానం చేయటం వాళ్ళ కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధ్యాన ఫలాలు పోందండని చెపుతున్నారు పరిశోధకులు.

    ధ్యానంతో మల్టీ టాస్కింగ్ సులభం

    మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో  ఎక్కువసేపు ఏకాగ్రత తో కొనసాగించగలరని వారి జ్ఞాపకశక్తిని మెరుగ్గా వుంటుందని  తాజా అధ్యయనాలు చెపుతున్నాయి.  ఈ   అధ్యయనాలు…

  • కెరీర్ లో ఒక్కసరైన జాతీయ ఉత్తమ నటి అవార్డు సాదించాలనే కల అందరి హీరోయిన్స్ కు వుంటుంది. ఇప్పటి దాక 41 మంది హీరోయిన్స్ ఈ అవార్డు అందుకున్నారు కానీ కొందరే ఈ అవార్డు మళ్ళి మళ్ళి అందుకున్నారు. కనగనా రనౌత్ మూడు సార్లు జాతీయ అవార్డు తీసుకుంటే, ఊర్వశి శారద మూడు సార్లు, షర్మిలా టాగూర్, స్మితా పాటిల్, అర్చన, శోభన, టబు, కంగనా సేన్ శర్మ రెండు సార్లు తీసుకున్నారు. ఈ లిస్ట్ లో అందరి కంటే ఎక్కువ సార్లు ఏకంగా ఐదు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకున్నది షాబాన్ ఆజ్మి. వీళ్ళంతా ఆర్టిస్ట్లు . ఒక భావాన్ని మాట నియి౦ లేకుండా కళ్ళతోనో, పెదవి విరుపుల తో నో పలకరిస్తారు. పాత్రల్లో ఒదిగిపోతారు. రచయిత ఊహించిన రూపంలోకి మారిపోతారు. అవార్డులు తీసుకుంటారు.

    ఉత్తమ నటీమణులు

    కెరీర్ లో ఒక్కసరైన జాతీయ ఉత్తమ నటి అవార్డు సాదించాలనే కల అందరి హీరోయిన్స్ కు వుంటుంది. ఇప్పటి దాక 41 మంది హీరోయిన్స్ ఈ అవార్డు…

  • చావి రాజావత్ రాజస్థాన్ లోని సోడా గ్రామ సుర్పుంచ్. తగునీరు, మరుగు దొడ్లు, పవర్ లేని ఆ గ్రామం అభివృద్ధి కోసం, ఆ గ్రామస్తులు మేనేజ్ మెంట్ లో డిగ్రీ తీసుకున్న రాజావత్ ను సర్పంచ్ గా ఎంచుకున్నారు. నాలుగేళ్ళలో సోడా గ్రామ రూపురేఖలు మార్చింది చావి రాజావత్ ఎం.బి.ఎ డిగ్రీ తీసుకున్న ఫస్ట్ ఎంగెస్ట్ సర్పంచ్ ఈ అమ్మాయే ఇవ్వాల రోడ్లున్నాయి. తాగునీటి చెరువు బాగు చేసే ఖర్చును బరించేందుకు ముందుకు వచ్చిన ఓ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ స్థాపించే ప్రయత్నం లో వుంది ఈ ౩౦ ఏళ్ల చావి రాజావత్ ముందుకు వచ్చిన సేవాశీలి.

    మారు మూల పల్లె ని మెరిపించిన రాజావత్

    చావి రాజావత్ రాజస్థాన్ లోని సోడా గ్రామ సుర్పుంచ్. తగునీరు, మరుగు దొడ్లు, పవర్ లేని ఆ గ్రామం అభివృద్ధి కోసం, ఆ గ్రామస్తులు మేనేజ్ మెంట్…

  • మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు. బచ్చల కూర లో ఇనుము నైట్రేట్ లు పుష్కలంగా వుంటాయి. ఈ కూరను వండాక మళ్ళి నేరుగా వేడి చేయకూడదు. వేడి నీళ్ళ గిన్నెలో వుంచి వేడెక్కేలా చేయాలి. అలాగే ఉడికించి లేదా కూర చేసిన గుడ్లు కూడా మళ్ళి వేడి చేస్తే అందులోని పోషకాలు పోతయి. చికెన్ కూడా అంతే, వండాక మళ్ళి మళ్ళి వేడి చేస్తే మాంసకృతులు పోతాయి సరి కదా జీర్ణ సంబందమైన సమస్యలు వస్తాయి. బంగాళా దుంప కూర కూడా వేడి చేసి తింటే విషపదార్ధాలు శరీరంలోకి చేరినట్లే. మాంసకృతులు పుష్కలంగా అందించే పుట్ట గొడుగు కూర కూడా ఫ్రిజ్ లో వుంచి, సాయంత్రం వేడి చేసి తినాలి అని చుస్తే అనారోగ్యాలు తధ్యం . సాధ్యమయినంత వండిన కూరలు మళ్ళి మళ్ళి వేడి చేసి తినడం వల్ల నష్టమే.

    వండినవి మళ్ళి వేడి చేస్తే నష్టం

    మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు.…