కేరళలోని త్రిసూర్ కు చెందిన నలభై ఏడేళ్ల జోసెఫిన్ జోస్ ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ 75 రోజుల్లో 18 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు చుట్టి వచ్చారు. ఈ ప్రయాణానికి ‘లాడ్లీ’ అని పేరు పెట్టారు. ఈ భారత యాత్ర తన తండ్రి కల అంటున్నారు జోసెఫిన్ జోస్ కూతురితో టూ వీలర్ పైన ఈ యాత్ర చేయాలన్న కల నెరవేరకుండా ఆయన చనిపోయారు. ఆ తర్వాత 17 ఏళ్లకు జోసెఫిన్ జోస్ ఒంటరిగా 75 రోజుల్లో 14277 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. మహా నగరాలు మారుమూల గ్రామాల్లోంచి కొండ అంచుల గుండా ఈ సాహసోపేతమైన ప్రయాణం చేశారు జోసెఫిన్ జోస్.ఈ పర్యటన ఎంతోమంది ఒంటరి ప్రయాణికులకు స్ఫూర్తి.














