అప్రిషియేటింగ్ భరతనాట్యం పుస్తకం రాశారు ప్రముఖ నర్తకి సంగీత విద్వాంసురాలు విద్యా భవాని సురేష్. భరతనాట్యం అన్నది వేదిక పైన ప్రదర్శించే కల మాత్రమే కాదు, ఆలోచనలు రేకెత్తించే మార్గం అంటున్నారు విద్యా భవాని. నృత్యం లో పాతకాలపు అనుకువ లు చూపే పురాణ పాత్రలే ఎందుకు ఉండాలి అంటారామె. నేటి మహిళల మనస్తత్వానికి తగ్గ పాత్రలతో నృత్యం రూపురేఖలు మార్చుకోవాలి అన్నారు విద్యా భవాని. సంగీతం నాట్యానికి ఉండే సున్నితమైన అనుబంధాలను వివరించే ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. ఈ పుస్తకం నృత్యాన్ని సామాన్యులకు, పాఠకులకు ఒక స్నేహితుడిలా వివరిస్తుందని రచయిత్రి విద్యా భవాని అంటున్నారు.














