• ఆరోగ్యంగా, తీరైన శరీర సౌష్టవంతో వుండాలంటే జిమ్ కు వెళ్లితీరాలా లేక తినే ఆహారం సాధ్యమైనంత తక్కువ తీసుకొంటే సరిపోతుందా అనే డైలమా చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు ఇంట్లో అస్తమానం బొంగరంలా తిరుగుతాం కదా ఇంకా జిమ్ ఎందుకు? అంటారు. సరే అటునుంచి రావాలంటే కొద్దిపాటి వాకింగ్ తో పాటు కొద్దిపాటి ఆహార ఎంపికలు ఫలితాలు శీఘ్రం గా చూపించి ఉత్సాహం తెస్తాయి. తక్షణ శక్తి కోసం సింపుల్ కార్బోహైడ్రేట్స్ చాలు పది నిముషాలు వాకింగ్ చాలు. మంచి మూడ్ కోసం మెదడుకు మంచి పోషకాలు కావాలి. 20 నిముషాలు వ్యాయామం మెదడును ఉత్సాహంతో నింపుతుంది. వీక్ మజిల్ ఉన్నవారు కండరాలు పటిష్ట పరిచే ఆహారపదార్ధాలు తీసుకోవాలి. సలాడ్ల పైన ఆలివ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ఆరోగ్యవంతమైన ఫ్యాట్ కండరాల వేస్టేజీని అరికడతాయి. కార్బోహైడ్రేట్స్ నాడీ వ్యవస్థను ఉద్దీప్తం చేసి మానసిక శక్తిని పెంచుతాయి. లంచ్ లో బీన్స్ వంటివి మూడ్ ను, మెమొరీని పెంచుతాయి. కేవలం గృహిణులు ఎన్నో గంటలు నాలుగ్గోడల మధ్యనే పని చేస్తుంటారు కనుక వారికి మనసు, శరీరం చైతన్యంగా ఉంది, తీసుకున్న ఆహారం సరిపోయి చేసే కాస్త వ్యాయామం సరిపోతుందని ఎక్స్పర్ట్స్ చెపుతున్న విషయాలు. ఎటుతిప్పినా సవ్యంగా కాస్తయినా శరీరం కదిలించాలి.

    జిమ్ అవసరమా? సలాడ్ బౌల్ చాలా?

    ఆరోగ్యంగా, తీరైన శరీర సౌష్టవంతో వుండాలంటే జిమ్ కు వెళ్లితీరాలా లేక తినే ఆహారం సాధ్యమైనంత తక్కువ తీసుకొంటే సరిపోతుందా అనే డైలమా చాలా మందికి ఉంటుంది.…

  • అద్దం ముందర నిలబడితే అది నిజమే చెపుతోంది. ,మన మనసులో ఎలా వుండాలనుకొన్నామో ఆలా లేకపోతే శరీర లావణ్యం తీరు మనం ఊహించే అందం ఇవన్నీ వుండకపోవటానికి మన బద్ధకం మాత్రమే కారణం . అందంగా అంటే ఆరోగ్యంగా అని అర్ధం చెప్పుకోవాలి ముందు మనసుకి. ఇప్పుడు మనసు డిసైడ్ చేస్తుంది తప్పనిసరిగా వ్యాయామం చేయి. ప్రతి పూట చూస్తున్నాం. ఈ ఫలాన్ని సినిమాలో హీరో ఓ సినిమా కోసం 30 కిలోల బరువు పెరిగి మళ్ళీ వెంటనే 40 కిలోల బరువు కేవలం ఫిట్ నెస్ శిక్షకుడి ఆధ్వర్యంలో కష్టపడి తగ్గించుకున్నాడని మనం మాత్రం అందులో ఐదో వంతైనా చేయలేమని నెట్ లో వెతికితే పెద్దగా బరువులో వత్తిడి ఆయాస పడనక్కర్లేదని తేలికైన వ్యాయామాలు ఉంటాయి. అవన్నీ ఒక ఆటలాగా సరదాగా ప్రేమగా మొదలుపెడితే చాలు. ఐదు నిముషాలు నుంచి మొదలు పెట్టి అరగంట వరకు సాగదీయచ్చు. అంతెందుకు మన శరీరం లో వచ్చే మార్పులు చెమటోడిస్తే మోహంలో కనబడే మెరుపు మనకు తప్పనిసరిగా ఉత్సాహం ఇస్తాయి . ఓ నెలయ్యాక ఎవరో ఫ్రెండ్ ఎదురై ఎంత బావున్నావో కాస్త తగ్గావు మోహంలో ఎదో సమ్ థింగ్ స్పెషల్ కనిపిస్తోంది. అన్నారనుకోండి ఇంకా ఉత్సాహమే ఉత్సాహం !!

    ఇదే నిమిషాలతో మొదలెట్టండి

    అద్దం  ముందర నిలబడితే అది నిజమే చెపుతోంది. ,మన మనసులో ఎలా వుండాలనుకొన్నామో ఆలా లేకపోతే శరీర లావణ్యం తీరు మనం ఊహించే అందం ఇవన్నీ వుండకపోవటానికి…

  • ఎంతగా స్వేదం చిందిస్తే అంతగా క్యాలరీలో ఖర్చవుతాయి అనేది అపోహ మాత్రమే అంటున్నారు. ఎక్సపర్ట్స్. అస్సలు స్వేదానికి క్యాలరీలకు సంభంధం ఉందట. స్వేదం శారీరిక ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. ఇక క్యాలరీలు ఖర్చు చేయటం అన్నది వర్కవుట్ల సమయం ఇంటెన్సిటీ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఖాళీ కడుపులో వర్కవుట్స్ చేయటం వల్ల కొవ్వు కరుగుతుందని భావిస్తారు. ఇది పూర్తిగా అపోహ. ఇలా చేయటం వల్ల ఎక్సర్ సైజ్ లు ఇంటెన్సిటీ లోపిస్తుంది. దీని వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు కావు. వర్కవుట్స్ కు అరగంట ముందుగా అరటి పండు లాంటివి ఏవైనా తింటే మంచిది. అలాగే వ్యాయామం ఎలాగూ చేస్తున్నాం కదా అని గంటల కొద్దీ కదలకుండా కూర్చునే జీవనశైలి ప్రధాన అనారోగ్య హేతువు. అంచేత గంటలకోసారి లేచి కాస్త నడవాలి. అధికంగా బరువు లేము కదా అనీ ఏ వ్యాయామం చేయకపోవటం కూడా తప్పే . శారీరికంగా చైతన్యంగా ఉండటంకోసం వ్యాయామం తప్పని సరి .

    ఇవన్నీ అర్ధం లేని అపోహలు

    ఎంతగా స్వేదం చిందిస్తే అంతగా క్యాలరీలో ఖర్చవుతాయి అనేది అపోహ మాత్రమే అంటున్నారు. ఎక్సపర్ట్స్. అస్సలు స్వేదానికి క్యాలరీలకు సంభంధం ఉందట. స్వేదం శారీరిక ఉష్ణోగ్రతను సమతుల్యం…