• ఒకప్పుడు గ్లామర్ డాల్స్ గా కేవలం సినిమాకు అందం ఇస్తున్నట్లు ఉండే తారలు ఇప్పుడు పంధా మార్చేశారు. గ్లామర్ తో నెగ్గుకొచ్చిన వీళ్ళు యాక్షన్ తో ఫైట్లతో సందడి చేస్తున్నారు. ఈ రూట్లోకి ఇప్పుడు త్రిష కూడా వచ్చారు . దాదాపు పదిహేనేళ్ల పాటు కమర్షియల్ సినిమాలు చేసిన ఈమె అందమైన నటిగా పేరుతెచ్చుకున్నారు . గ్లామర్ కే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ప్రతి సినిమాకు ప్రత్యేకత చూపించారు. ఇప్పుడు ఆ గ్లామర్ పక్కన పెట్టేసి ఓన్లీ యాక్షన్ అంటోంది త్రిష . లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ సినిమా భారమంతా తన భుజాలపై వేసుకుంటోంది త్రిష. ఇప్పుడు చేస్తున్న ముహని సదురంగ వేట్టయ్ -2 1818 లాంటి సినిమా లన్నీ లేడీ ఓరియెంటెడ్ లే.. హిందీ సూపర్ హిట్ ఎన్ హెచ్ 10 తమిళ రీమేక్ గర్జనై తో యాక్షన్ హీరోయిన్ గా హిట్ అందుకోవాలని త్రిష తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

    గ్లామర్ కంటే యాక్షన్ కె ఓటు

    ఒకప్పుడు గ్లామర్ డాల్స్ గా కేవలం సినిమాకు అందం ఇస్తున్నట్లు ఉండే తారలు ఇప్పుడు పంధా మార్చేశారు. గ్లామర్ తో నెగ్గుకొచ్చిన వీళ్ళు యాక్షన్ తో ఫైట్లతో…

  • జీవితంలో ఎప్పుడూ సంతోషాలే వుండవు. ఎన్నో సవాళ్లు అనుభవాలు అనుభూతుల సంగమం జీవితం. సినీ నటి త్రిష ఈ మధ్య కాలంలో హండ్రెడ్ హ్యాపీ డేస్ ఛాలెంజ్ తీసుకుందిట. ఈ ఛాలెంజ్ కు వప్పుకునే వంద రోజుల పాటు ఎలాంటి విషయానికీ బాధ పడకుండా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి. ప్రతి ఒక్కరితో సంతోషాన్ని ఆత్మ విశ్వాసాన్ని సానుకూల దృక్పధాన్ని పెంచే దృష్టితో హండ్రెడ్ హ్యాపీ డేస్ సంస్థ ఈ పోటీ ని నిర్వహిస్తోంది. అందరితో ప్రేమగా ఉత్సాహంగా ఉండాలని తీర్మానించుకుని ఈ ఛాలెంజ్ తీసుకున్నా అన్నారు త్రిష. గతంలో ఈమె నో మేకప్ ఛాలెంజ్ తీసుకుని చాలా రోజులపాటు మేకప్ లేకుండానే బయట కార్యక్రమాల్లో పాల్గొన్నారట. ఇలాంటి ఛాలెంజ్ లు వప్పుకుంటే జీవితంలో నిరాశ అన్న పదం కాస్త దూరం జరుగుతుందేమో !

    వంద రోజులు సంతోషంగా ఉంటా

    జీవితంలో ఎప్పుడూ సంతోషాలే  వుండవు. ఎన్నో సవాళ్లు అనుభవాలు అనుభూతుల సంగమం జీవితం. సినీ నటి త్రిష ఈ మధ్య కాలంలో హండ్రెడ్ హ్యాపీ డేస్ ఛాలెంజ్…