• దుస్తులు వెలిసిపోకుండా వుంటాయ్.

    సాదాసీదాగా వున్న దుస్తుల ధర కూడా ఇప్పుడు వేలల్లోనే ఉంటుంది. ఉతికితే మెరుపు, కొత్తదనం పోతాయనిపిస్తుంది. కాని కొన్ని డ్రెస్ లు కొంత ప్రత్యేకంగా ఇంట్లో వాష్…

  • బట్టలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్లో వేయడం లేదా బండ కేసి బాడి వుతికేయడం రెండే పద్దతులు. కానీ ఒక్క రకం దుస్తులకు ఒక్కో రకం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపొతే రంగు వెలసి పోవడం నాణ్యత తగ్గడం తప్పదు. నీలిరంగు, ముదురు రంగు వెలసిపోవడం, డెనిమ్ ప్యాంట్లు అయితే చల్లని నీళ్ళల్లో ఉతకాలి. ఆవే ఇతర రంగుల దుస్తులైతే గోరు వెచ్చని నీళ్ళు వాడాలి. వీటిని నీడపట్టునే ఆరేయాలి ముదురు రంగు నీలి దుస్తులకు చల్లని నీళ్ళు వాడాలి. లేత రంగులో తెలుపు రంగు వెచ్చని నీళ్ళే ఉత్తమం. కొన్ని దుస్తుల్ని కొంత సేపు ధరించి ఎండలో ఆరేసి మడతేసి ఇంకోసారి వాడతారు. మిగతావాటి సంగతి ఎలా వన్నా లెనిన్ తరహ వస్త్రాలు మాత్రం వదిన వెంటనే ఉతికేయాలి. లేదంటే చమట కారణంగా వాటిలో ఫంగస్ పేరు కొంటుంది. రేయాన్ దుస్తుల్ని బ్లీచింగ్ లో వేయకూడదు. మెలితిప్పి పిండకూడదు. పాలిస్టర్ చల్లని నీటితో ఉతికి అలాగే ఆరేయాలి. పట్టు సిల్క్ రకాలు చల్లని నీటి లో ఉతికి అలాగే ఆరేయాలి, పిండకూడదు. ప్రతి దుస్తులను ఉతికేందుకు దానికి ప్రత్యేక పద్దతులు వుంటాయి.

    ఒక్కో దుస్తులు ఒక్కో రకంగా

    బట్టలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్లో వేయడం లేదా బండ కేసి బాడి వుతికేయడం రెండే పద్దతులు. కానీ ఒక్క రకం దుస్తులకు ఒక్కో రకం జాగ్రత్తలు…

  • ఎంతో ఇష్టంగా కొనుకున్న దుస్తుల పైన మరకలు పడితే కష్టంగా ఉంటుంది. ఒక్కసారి చిన్న మరకకే అందమైన డ్రెస్ వేసుకోవాలనిపించదు. ఇప్పుడు వాటిని వదిలించే మార్గాలుకోనున్నాయి. దుస్తుల పైన గ్రీజు మరకలు పడితే సూడ నీళ్లలో నాన్ననిచ్చి ఉతికితే మరకలు మాయం అవుతాయి. అదే నూనె మరకైతే దానిపైన పౌడర్ చల్లటమో సుద్ద ముక్కతో రుద్దటమో చేయాలి. ఆరిన తర్వాత గోరు వెచ్చని నీళ్లతో నానబెట్టి ఉతికితే నూనె మరకలుండవు. అలాగే కాఫీ తాగాక మరక పడితే ఆమరకలను బేకింగ్ షోడా వేసిన నీళ్లలో నానబెట్టి ఉతకాలి. చెమట మరకలకు నిమ్మరసం మంచిగా పనిచేస్తుంది.లేదా నిమ్మచెక్కను చెమట వాసన వచ్చే సాక్స్ పైన లేదా దుస్తుల పైన రుద్ది కాసేపాగి ఉతికేస్తే పోతాయి. ఇంకో మరకలు పాలతో రుద్దితే పోతాయి. మేకప్ చేసుకుంటునప్పుడు ఫౌండేషన్ లు ఒలకటం పౌడర్లు పడటం వల్ల ఏర్పడిన మారకాలని షేవింగ్ క్రీం తో రుద్దేస్తే పోతాయి. రక్తం మరకలు పడితే హైడ్రోజన్ పెరాక్సిడ్ వేసి రుద్దితే పోతాయి.

    మరకలు ఇలా వదిలించచ్చు

    ఎంతో ఇష్టంగా కొనుకున్న దుస్తుల పైన మరకలు పడితే కష్టంగా ఉంటుంది. ఒక్కసారి చిన్న మరకకే అందమైన డ్రెస్ వేసుకోవాలనిపించదు. ఇప్పుడు వాటిని వదిలించే మార్గాలుకోనున్నాయి. దుస్తుల…