• మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం పప్పు, వాటిలో అధికంగా వుంటాయి కనుక వీటిని ఒక మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి మూడుగంటలకొసారి ఎదో ఒక్కటి తినాలి. పండ్లు, కూరగాయలు, మొలకలు ఇలా ఎదో ఒక్కటి తినాలి. రాత్రి ఎనిమిది గంటల లోపునే ఈ ఆహారం పూర్తి చేయాలి. ఇలా చేస్తే జీవక్రియల రేటు బావుంటుంది. మసాలా పదార్దాలు, బయటి ఫుడ్ కి అవకాసం ఇవ్వకూడదు. శరీరంలోని వ్యర్ధాలు బయటకు పంపే పానీయాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం వల్లనే వ్యర్ధాలు బయటకు పోతాయి. సాధ్యమైనంత నిల్వపచ్చళ్ళు, అప్పడాలు, నూనె లో వేయించిన చిరు తిళ్ళు తినకపోతేనే మంచిది.

    ప్రతి మూడు గంటలకొ సారి తినాలి

    మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం…

  • ఏం తిన్నా ఎక్కువ తిన్నాం అని కంగారు పడిపోతుంటారు అమ్మాయిల. కొంచం నియంత్రణ తో వుంటే ఎలాంటి ఆందోళన వుండదు. తినేదేదో హడావిడి లేకుండా తినాలి. అసలు ఎం తింటున్నాం అన్నది గమనించుకోవాలి. టి.వి చూస్తూ ఏదైనా చదువుకుంటూ రిలాక్స్డ్ గా తినడం సమస్య లేకుండా ఎక్కువ తింటాం. ఖచ్చితంగా డైట్ చేసే పదార్ధాలు ఏవి రుచిగా వుండవు. అందుకని రుచిగా వున్న మంచి ఆహారం తిన్నా తప్పు లేదు ఎంత పరిణామం లో తింటున్నామన్నది చూసుకోవాలి. పిచు, నీరు, ప్రోటీన్లు వున్న పదార్ధాలు బాగా తినాలి. కాలరీలకు దూరంగా ఉండలి. ఖచ్చితమైన డైట్ గురించి అయితే ఒక బుక్ మైన్టైన్ చెయ్యాలి. తప్పని సరిగా పది, పన్నెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి. బాగా నిద్రపొతే శరిరం రిలాక్స్డ్ గా వుంటుంది. మెదడు పైన ఒత్తిడి తగ్గిపోతుంది. ౩౦,40 నిమిషాల వ్యాయామం చేసి తీరాలి. దీనికి ఏ కారణం చేతను వాయిదా వద్దు.

    నియంత్రణ వుండటం కరెక్టే

    ఏం తిన్నా ఎక్కువ తిన్నాం అని కంగారు పడిపోతుంటారు అమ్మాయిల. కొంచం నియంత్రణ తో వుంటే ఎలాంటి ఆందోళన వుండదు. తినేదేదో హడావిడి లేకుండా తినాలి. అసలు…