• బిడ్డ శ్రీరామ రక్ష ఇవి.

    పసిబిడ్డకు అమృతం కంటే  తల్లి పాలే ఎక్కువ పాలు వీలైనవి అంటారు. పాపాయికి ఆరోగ్య కవచం తల్లిపాలే. ప్రసవం అయిన వెంటనే బిడ్డకోసం ఉబికి వచ్చే తల్లి…

  • గతంలో వున్న కుటుంబ వాతావరణంలో పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిద్రా సమయం, భోజన సమయం అంటూ వుండేవి. ఇప్పిడా పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు పరుగులెత్తే ఉద్యోగాలు, పిల్లలకు వత్తడి తెచ్చే వాతావరణంఎక్కువ కాలరీలున్న భోజనం, తియ్యని డ్రింకులు, తల్లిదండ్రుల కోసం ఎదరు చూస్తూగంటల కొద్దీ టీ.వి ల ముందు కూర్చోవడం పెద్దలతో సమానంగా నిద్ర ఇవన్నీ పిల్లల్ని ఉబకాయం వైపుగా లాగుతున్నాయి. తొందరగా తిని తొందరగా నిద్ర పొతే ఈ సమస్య వుండదు అంటారు పరిశోధకులు. కోరుకున్న స్థాయిలో లేదా అవసరమైనంత నిద్ర పోయేవారుతినే తిండి కంటే తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ఈ నిద్ర తోనే పిల్లల్లో తిండి పరిమాణం తగ్గడం గమనించారు. మితిమీరిన బరువు వల్లన వచ్చే బద్ధకం కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల కూడా శ్రద్ధ తక్కువై పోతుంది. తల్లిదండ్రుల గారాబం వల్లనే పిల్లలకు జంక్ ఫుడ్ తినడం ఎక్కువ అయ్యింది అని, పిల్లల క్షేమం కోరితే ముందుగా వాళ్ళ ఆహారం, నిద్ర, ఆటలాడే వేళల పైన దృష్టి పెట్టాలని పరిశోధనలు గట్టిగా చెపుతున్నాయి.

    నిద్ర తగ్గడం వల్లనే ఈ శరీర భారం

    గతంలో వున్న కుటుంబ వాతావరణంలో పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిద్రా సమయం, భోజన సమయం అంటూ వుండేవి. ఇప్పిడా పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు పరుగులెత్తే ఉద్యోగాలు,…

  • ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వాగ్వివాదాలు వస్తాయి. పిల్లల ముందు గట్టిగా అరుచుకుంటారు. ఇలా వాళ్ళు తరుచు గొడవ పడుతుంటే పిల్లల్లో కుంగుబాటు మానసిక ఆందోళన పెరుగుతాయంటున్నారు. ఎక్స్ పెర్ట్స్. చిన్న పిల్లలను భయానికి గురిచేసే విషయాల్లో మొదటిది తల్లి తండ్రులు ఇలా పోట్లాడుకుని విడిపోతారేమోనని చాలా టెన్షన్ పడతారట. ఎడ మొహం పెడమొహం తో పెద్దవాళ్ళంటే వాళ్లకు చదువు పైన ఏకాగ్రత వుండదంటున్నారు . కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు తమ కోపాన్ని వ్యక్తం చేసే మార్గాల్ని వెతకమంటున్నారు. పిల్లల్ని భయాందోళనలకు గురిచేయద్దు. మీ సమస్యలకు ఒక పేపర్ పై రాసి పరస్పరం ఇచ్చుకోండి. ఇది పిల్లల వరకు వెళ్ళదు కనుక ప్రాబ్లమ్ లేదు. లేదా ఎంత ఉద్వేగం వచ్చినా పిల్లల ముందు బయటపడకుండా వాటిని గురించి వాళ్ళు లేనప్పుడే మాట్లాడుకుని పరిష్కరించుకోండి. సమస్య పరిష్కారం కాకపోయినా వాళ్ళ ముందు మౌనంగా అయినా వుండండి. భార్య భర్తలు తల్లి తండ్రుల పాత్రలోకి వచ్చాక వాళ్లకు బాధ్యత ఉంటుంది కనుక దాన్ని గుర్తుంచుకుని ప్రవర్తించమంటున్నారు నిపుణులు .

    వాళ్ళు ఆందోళన పడతారు. జాగ్రత్త

    ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వాగ్వివాదాలు వస్తాయి. పిల్లల ముందు గట్టిగా  అరుచుకుంటారు. ఇలా వాళ్ళు తరుచు  గొడవ పడుతుంటే పిల్లల్లో  కుంగుబాటు మానసిక…

  • మనలో చాలా మందికి సొంత వైద్యాల పైన చాలా నమ్మకం. పిల్లల విషయంలో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేస్తారు కూడా. ఉదాహరణకు పిల్లవాడికి కళ్ళు ఎర్రగా ఉంటే నిద్రలేక అంటారు. చమ చాలు పోస్ట్ తగ్గుతుందంటారు. కానీ వైరస్ దానికి కారణం కావచ్చు. అలాగే ఐదారేళ్ళ పిల్లలు పుస్తకాలూ పట్టుకున్న పది నిమిషాలకే పక్కన పెట్టేస్తే మాయోపియా హైపర్ మయోపియా ఆష్టిష్ ,మాటిజం వంటి సమస్య ఉండొచ్చు. పిల్లాడు టీవీ దగ్గరగా చూస్తుంటే అస్తమానం అదో పాడలవాటు టీవీ ని వదులడు అంటారు. అంతే కానీ వాడికి చూపులో ఎదో లోపం వుంది కనుక అలా టీవీ దగ్గరగా చూస్తున్నాడని ఎంత మాత్రం అనుమానించరు. మరీ గ్రామాల్లో పిలల్లు మెల్ల కన్నుతో పుట్టినా అదృష్టమని సంతోషించి ఊరుకుంటారు అది అదృష్టం కానే కాదు. వైద్య పరిభాషలో స్కింట్ అంటారు. చిన్న వయసులోనే చిన్నపాటి శస్త్ర చికిత్సతో సరిచేయచ్చు. తల్లికి మధుమేహం ఉన్న బిడ్డకు కంటి సమస్య లొస్తాయి. ఇవన్నీ డాక్టర్ పరిష్కారించవలిసిన విషయాలు .

    సొంత వైద్యం చాలా డేంజర్

    మనలో చాలా మందికి సొంత వైద్యాల పైన చాలా నమ్మకం. పిల్లల విషయంలో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేస్తారు కూడా. ఉదాహరణకు పిల్లవాడికి కళ్ళు…

  • తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని వైద్యులు చెపుతూ వుంటారు. ఇది పూర్వీకుల నుంచి వింటున్నదే. తల్లి తీసుకునే ఆహారంపైనే కడుపులో బిడ్డ జీవితం పర్యంతం ఆరోగ్యాంగా వుంటాడని ఇటీవల పరిశోధన చెపుతోంది. గర్భవతి తగినంత మోతాదులో ఆహారం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు గుండె సంబంధిత సమస్యలు బిడ్డ అకాల వృధాప్యనికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. తల్లి తీసుకునే ఆహారం ద్వారానే బిడ్డకు ఆక్సిజన్ అందుతోంది. తల్లి సరైన ఆహారాం తీసుకోకపోతే బిడ్డకు శ్వాసకోశాలు గుండె పనితీరు స్వయంగా వుండవనీ వీటిని సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొంటారని చెపుతున్నారు. తల్లి ఆహారం పైన బిడ్డ భవిష్యత్తు ఆధార పడి వుంటుందంటున్నారు. బిడ్డ కడుపులో వుండగానే రూపం దిద్దుకునే అవయవాలు ఉంటుందని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.

    బిడ్డ ఆరోగ్యానికి గర్భంలోనే బీజాలు

    తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని వైద్యులు చెపుతూ  వుంటారు. ఇది పూర్వీకుల నుంచి వింటున్నదే. తల్లి తీసుకునే ఆహారంపైనే కడుపులో బిడ్డ జీవితం పర్యంతం…