ఢిల్లీలో విలాసవంతమైన గృహాలను నిర్మించే ఎం త్రీ ఎం సంస్థ డైరెక్టర్లలో ఒకరు డాక్టర్ పాయల్ కనోడియా. హర్యానాలోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన పాయల్ సామాన్యుల కష్టాల గురించి ఆలోచించారు. ఆమె చొరవతో 2019లో ఎం 3 ఎం ఫౌండేషన్ ఏర్పాటు అయింది. విద్య నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ, పర్యావరణం, క్రీడలు మొదలైన అనేక కార్యక్రమాలు చేపడుతుంది ఈ సంస్థ 22 రాష్ట్రాల్లోని 50 లక్షల మంది జీవితాలని ప్రభావితం చేసిన ఈ సంస్థను హరూన్ ఇండియా దాతృత్వ సంస్థల జాబితాలో నమోదు చేసింది ఏడాదికి ఈ సంస్థ ద్వారా 100 కోట్లు గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారు పాయల్ కనోడియా.













