ఆమె భద్రత దళాధిపతి

ఆమె భద్రత దళాధిపతి

ఆమె భద్రత దళాధిపతి

143 ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్. పి. ఎఫ్) కు తొలిసారిగా మహిళా డైరెక్టర్ జనరల్ అయ్యారు సోనాలి మిశ్రా 1983 లో ఐ పి ఎస్ కు ఎంపికైన సోనాలి మధ్యప్రదేశ్ కేడర్ లో పనిచేశారు. ఆ రాష్ట్రంలో ఎస్ పి గా ఆ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ కేంద్రానికి అధిపతిగా వ్యవహరించారు. ఆ రాష్ట్ర పోలీస్ అకాడమీ పర్యవేక్షించింది ఆర్.పి.ఎఫ్ కేంద్ర ప్రభుత్వ భద్రత బలగాల లో ఒకటి. సోనాలి 2021 లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి ఎస్ ఎఫ్) కి కమాండర్ గా వ్యవహరించారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు భద్రతా విభాగపు ఐ జి గా ఆ భద్రతా దళాల ఇంటెలిజెన్స్ విభాగపు అధికారిగా బి ఎస్ ఎఫ్ కి అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా కూడా పనిచేశారు.