మూడున్నర దశాబ్దాలుగా బస్తర్ దంతేవాడ సుక్మా ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీలకు వైద్య సేవలు అందిస్తున్నారు సునీత గోడ్ బోలె చదువుకునే రోజుల్లోనే మహారాష్ట్రలోని రాయగడ లో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసేవారు. ఆయుర్వేద వైద్యులైన రామ్‌చంద్ర తో కలిసి పెళ్లయిన రెండు వారాలకే ఛత్తీస్గడ్ లో వైద్య సేవ నిమిత్తం వెళ్లారు సునీత దంతేవాడ సమీపంలోని బార్సూర్ లో ఆసుపత్రి తెరిచారు. స్థానిక భాష నేర్చుకుంటూ వారిలో ఒకరిగా కలిసిపోయి సేవలు అందిస్తున్న ఈ దంపతులకు పద్మశ్రీ దక్కింది.














