అస్సాం గాయని పోఖిలా లేక్తిపి పోఖిలా కార్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో గత ఐదు దశాబ్దాలుగా స్వరాల రాణిగా పేరుపొందింది పోఖిలా కార్బీ భాషలో ఆధునిక మ్యూజిక్ ఛాయలతో పాటలు కట్టి పాడేది. సాంప్రదాయ జానపదాలను క్యాసెట్లుగా తీసుకువచ్చి ప్రచారం చేసింది. తమ ఆదివాసి కళ అంతరించిపోకుండా ఎంతో కృషి చేసింది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి శిల్పి అసోం గౌరవ పురస్కారాలు అందుకున్నది క్వీన్ ఆఫ్ మెలోడీ గా పేరు తెచ్చుకున్న పోఖిలా కు కళ పట్ల ఉండే అంకితభావానికి ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 300 పైన కార్బీ భాషలో పాటలు పాడింది పోఖిలా.














