పిల్లల చదివే లక్ష్యం

పిల్లల చదివే లక్ష్యం

పిల్లల చదివే లక్ష్యం

చెన్నైలో పదేళ్ల క్రితం మొనీషా బాలమురుగన్‌ ‘నామ్ విధై కాలమ్’ అనే సంస్థ ప్రారంభించారు. ఆమె చెన్నైకు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో తొలి మహిళా గ్రాడ్యుయేట్. సైకియాట్రిక్ సోషల్ వర్క్ లో స్పెషలైజేషన్ చేసిన మొనీషా వీధుల్లో తిరిగే నిరాశ్రయులు అనాధలైన పిల్లల ఆకలి తీర్చటం వారికి చదువు నేర్పించడం, వారి మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 63 ప్రాజెక్ట్స్ తో స్కూలు పిల్లలు తమ పాకెట్ మనీ లోంచి కొంత ఈ పిల్లల భోజనం కోసం ఇచ్చేలా ప్రచారం చేశారు. వేలాదిమంది ఆకలి తీరుస్తోంది ఆ ప్రాజెక్ట్. నామ్ విధై కాలమ్ ద్వారా ఎంతో మంది పిల్లలు అక్షరాసులైనవారు. ఇంకెన్నో సంస్థలు ఈ పిల్లల కోసం కలిసి పని చేస్తున్నాయి.