మోషన్ ఫోటోగ్రాఫర్ రమ్య శ్రీ రామ్ తీసిన ఫోటో నాట్ జియో ఇండియా వరల్డ్ వైడ్ 2025 పోటీకి ఎంపికై అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నది కదిలే సందర్భాన్ని ఫోటో తీయగల రమ్య కేరళలోని తేయ్యం ఉత్సవాన్ని ఎంచుకున్నారు. ఆ ఉత్సవంలో గ్రామదేవతలను, తమ తెగ కోసం పోరాడి మరణించిన వీరులను తలుచుకుంటూ ప్రత్యేక వేషధారణతో భారీ మేకప్ తో పెద్ద కిరీటాలతో మండే మంటల మధ్య కళాకారులు ప్రదర్శన ఇస్తారు.ఈ నిప్పు కణికలు తొక్కుతూనే రమ్య ఈ కళాకారుల ఫోటోలు తీసింది.ఈమె తీసిన ఫోటో నేషనల్ జియోగ్రాఫర్ క్యాలెండర్ వారి అంతర్జాతీయ మ్యాగజైన్ లో ప్రచురిస్తారు.














