ఐ సి ఐ సి బ్యాంక్ లో సొల్యూషన్ మేనేజర్ గా పనిచేస్తున్న పల్లవి వేద్ బ్యాంకింగ్ వదిలేసి చాక్లెట్ల తయారీ లోకి రావడం ఒక సినిమా కథ లాటిదే. గొప్ప జీతం వచ్చే బ్యాంక్ కు రాజీనామా చేసి ఇష్టమైన వ్యాపారంలోకి వచ్చారామె.2011 లో వెల్వెట్ ఫైన్ చాక్లెట్స్ పేరుతో కంపెనీ స్థాపించారు. ఎంతో రుచిగా, సాధారణ చాక్లెట్స్ కు భిన్నంగా ఆమె తయారు చేసిన చాక్లెట్ కు ఎంతో ఆదరణ లభించింది. కోటిన్నర టర్నోవర్ తో మహిళల ఉపాధి మార్గం గా ఉంది వెల్వెట్ ఫైన్ చాక్లెట్స్ సంస్థ.














