కాశ్మీర్ లో పుట్టి పెరిగిన జన్నత్ నాలుగేళ్ల వయసులో నుంచి పడవలో తండ్రి పక్కన కూర్చొని ప్రభుత్వ పర్యాటక కేంద్రమైన దాల్ లేక్ లో విహరించింది. తండ్రితో కలిసి ఆ సరస్సులో వ్యర్థాలను బయటికి తీయడం నేర్చుకున్న జన్నత్ పెద్దయ్యాక కూడా ఆ పని వదిలిపెట్టలేదు పర్యావరణ పరిరక్షణ కోసం జన్నత్ చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధాని మోదీ నుంచి గౌరవ సత్కారం అందుకున్నది. ప్రతి ఆదివారం ఎప్పటికీ దాల్ లేక్ లో వ్యర్ధాలను తీసివేస్తూ ప్రజల్లో పర్యావరణం పట్ల శ్రద్ధ కలిగిస్తుంది జన్నత్.














