చరిత్ర సృష్టించిన అమ్మాయిలు

చరిత్ర సృష్టించిన అమ్మాయిలు

చరిత్ర సృష్టించిన అమ్మాయిలు

బీహార్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చరిత్రలో తొలిసారిగా ఆరుగురు మహిళలు డ్రైవర్లుగా బాధితులు తీసుకొని చరిత్ర సృష్టించారు. అనిత కుమారి,బేబీ కుమారి, గాయత్రి, ఆర్తి, సరస్వతి, రాగిణి కుమారి లు బీహార్ లోని అత్యంత వెనుకబడిన కులమైనా ముషాహర సామాజిక వర్గానికి చెందిన వాళ్లు సామాజిక కార్యకర్త సుధీర్ వర్గీస్ తో పాటు ప్రభుత్వ సహకారం కూడా వీరి అభివృద్ధి వెనుక ఉంది వీరంతా 2023లో చిన్న వాహనాలు లైసెన్స్ లు 2024 లో భారీ వాహనాలు లైసెన్స్ పొంది ఔరంగాబాద్ లోని ఐ డి టి ఆర్ సంస్థ లో వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసుకుని ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజు పింక్ బస్ డ్రైవర్లుగా ఉద్యోగం లోకి వచ్చారు. మగవాళ్లే నడుపుతున్న ఇలాంటి భారీ వాహనానికి ఇవాళ ఆడపిల్లలు పరుగులు పెట్టిస్తున్నారు.