శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు మంగళా కపూర్ లో కాశి లతా మంగేష్కర్ అంటుంటారు. సంగీత రంగంలో గొప్ప కృషి చేస్తున్న సమయంలో 1965 లో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఫలితంగా ఆరేళ్లపాటు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. 37 సర్జరీలు జరిగాయి. అయినా ఆమె కుంగిపోకుండా బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో సంగీత విద్య పూర్తిచేశారు.అక్కడే ప్రొఫెసర్ గా ఉన్నారు సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఎంతో కష్టపడతారామె.ఆమె జీవితం ఆధారంగా 2025 లో మరాఠీ చిత్రం మంగళా నిర్మించారు ఆమెకు జాతీయ గౌరవం దక్కింది. ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ తో సత్కరించింది.














