భారత సైన్యంలో రుద్ర యుద్ధ హెలికాప్టర్ ను నడిపిన తొలి మహిళ పైలట్ గా కెప్టెన్ హంస్జా శర్మ రికార్డ్ సృష్టించారు.జమ్మూ కు చెందిన 27 సంవత్సరాల హంస్జా శర్మ ఇటీవల రాజస్థాన్ లో జరిగిన 2026 ఆర్మీ పెరేడ్ డే లో 251 ఆర్మీ ఏవియేషన్ స్వాడెన్ కు నాయకత్వం వహించారు ఆరోజున స్వాడెన్ ప్రదర్శించిన విన్యాసాలు దేశం గర్వపడేలా ఉన్నాయి. హంస్జా నడిపే ఈ రుద్ర హెలికాప్టర్ భూమికి దగ్గరగా ఉంటూ శత్రువుల ట్యాంక్ లు స్థావరాలను ధ్వంసం చేయగలదు.హిమాలయాల్లో గడ్డకట్టే చలి ప్రదేశంలో కూడా ఈ రుద్ర హెలికాప్టర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఉత్తమ యుద్ధ విమాన పైలట్ కు ఇచ్చే ప్రతిష్టాత్మక సిల్వర్ చీతా ట్రోఫీని అందుకున్న తొలి మహిళ అధికారిగా హంస్జా రికార్డ్ సృష్టించారు.














