కమాండో సుమన్ కుమారి భారత సరిహద్దు భద్రతా దళం లో మొట్టమొదటి మహిళా స్నైపర్ గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ఆమె పురుషులు సైతం వెనుకంజ వేసే స్నైపర్ ఎనిమిది వారాల కోర్స్ పూర్తిచేసి పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదని నిరూపించారు. హిమాచల్ ప్రదేశ్ నుండి మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి 2021 లో బి.ఎస్.ఎఫ్ లో చేరారు.కమాండో శిక్షణ తర్వాత అత్యంత కఠినమైన స్నైపర్ శిక్షణ తీసుకున్న 56 మందిలో ఆమె ఒక్కతే మహిళ.














