‘ఒకే గ్రాండ్’ మా పేరుతో జపాన్ లో బామ్మ లను అద్దెకు వ్యాపారం మొదలైంది వృద్ధుల అనుభవాలు వ్యాపారంగా మారుస్తున్నారన్నమాట. 60 నుంచి 94 ఏళ్ల బామ్మ లను మోరల్ సపోర్ట్ కోసం ఎంచుకొనేవారు ఉన్నారు. కస్టమర్ అవసరం గురించి చెబితే అందుకు తగిన బామ్మను సెలెక్ట్ చేసి పంపుతారు. ఈ కంపెనీ లో 100 మంది బామ్మలు ఉన్నారు. బామ్మ సర్వీస్ కు గంటకు రెండు వేలు తీసుకుంటున్నారు. పిల్లలకు కథలు చెప్పే బామ్మ,సంప్రదాయ వంట చేసి పెట్టి పిల్లలను సంతోషపెట్టే బొమ్మలకు డిమాండ్ ఎక్కువగానే ఉందట.













