ఆధునిక పర్యావరణానికి స్ఫూర్తి ఇచ్చే వ్యక్తి గా గుర్తింపు పొందారు రేచల్ కార్సన్ రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడటం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని గురించి విస్తృతంగా తన రచనల ద్వారా ప్రచారం చేశారు రేచల్. రసాయనాలు చల్లటం వల్ల చనిపోతున్న కీటకాలు,వాటిని తిని చనిపోతున్న పక్షులు దీనివల్ల జరుగుతున్న పర్యావరణ సమతుల్యం గురించి ప్రచారం చేశారామె. 1962 లో ఆమె రాసిన సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం రాశారు ఆమె రాసిన పుస్తకం వల్లనే అటు తర్వాత పురుగు మందుల వాడకం పై పరిమితులు వచ్చాయి పక్షులను రక్షించుకొందాం ఆమె ఇచ్చిన పిలుపు శాస్త్రీయ సమాజం ఎంతో గౌరవంతో స్వీకరించింది.













