• నీహారికా .... చక్కని మాటలు అద్భుతమైన ఒక రోజు గడిచిపోతూ తీయతీయగా కొత్త సంవత్సరం వచ్చేసిందీ అన్నావు. మాటలు అద్భుతాలు చేస్తాయి. ఉదాహరణకు నాకు ఇంగ్లీష్ రాదు అని పదిసార్లు అన్నామనుకో ఇంకంతే ... ఆ నెగిటివ్ ఫీలింగ్ మన చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. అదే రోజుకో పది కొత్త మాటలు నేర్చుకుంటూ ఒక సంవత్సరం నిష్టగా అభ్యాసం చేస్తే ఇంగ్లీష్ భాషే మన సొంతం అవుతుంది. రాదు చేయను కష్టం నావల్ల ఏమవుతుంది లాంటి నెగిటివ్ సజెషన్స్ ఇచ్చుకునేకూడదు. భవిష్యత్తు పైన విశ్వాసం లేకపోతేనే అలంటి మాటలొస్తాయి. ఎవరైనా ఎలా ఉన్నవని అడిగితే గ్రేట్ ఎక్స్లెంట్ హ్యాపీ అంటూ మనస్ఫూర్తిగా చెప్పామనుకో మన మనసు వాటిని అంగీకరించి ఆమోదం చెపుతుంది. మనకు తెలియకుండా ఆ ప్రభావం మనసు పైన పడుతుంది. అవే నమ్మకాలవుతాయి .మొత్తం మన బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్ గా మారిపోతుంది. దాన్ని బట్టి సత్ఫలితాలుంటాయి. ఇందాక అన్నావే .. ఎన్ని అద్భుతమైన ఉదయాలు. ఎన్ని పూలు వికసించాయి . ఎంత మంది చిరునవ్వుతో మనల్ని పలకరించారు? ప్రకృతి అందించిన ఎన్ని కమ్మని ఫలాల్లో ఒక ముక్క మన నోటికిచేరింది. మనకి దొరికిన ఎన్నింటిని మనం మన చుట్టూ చేరిన వాళ్ళకి ఇవ్వగలిగాం. ఎన్ని చల్లని చూపుల దీవెనలు దక్కాయి. ఇవన్నింటినీ పదిలంగా పట్టుకుని కొత్త సంవత్సరం వైపు చూస్తుంటే ఎంత బావుందీ ? జీవితమా నువ్వెంత విలువైనదానివి !

    ఈ మాటలకెంత శక్తీ

    నీహారికా …. చక్కని మాటలు అద్భుతమైన ఒక రోజు గడిచిపోతూ తీయతీయగా కొత్త సంవత్సరం వచ్చేసిందీ అన్నావు. మాటలు అద్భుతాలు చేస్తాయి. ఉదాహరణకు నాకు ఇంగ్లీష్ రాదు…

  • క్వాంటికొ అనే టి.వి షో లో నటిస్తున్న ప్రియాంకా చోప్రా వాణిజ్య ప్రకటనలు, ఇతర కార్యక్రమాల ద్వారాసంపాదించిన మొత్తంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న టి.వి నటిగా ఫోర్బ్స్ పత్రిక జాబితాకు ఎక్కింది. బాలీవుడ్ లో చాలా కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న వాళ్ళు ప్రియాంక చోప్రా టాప్ ర్యాంక్ అని చెప్ప వచ్చు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. మేరికొమ్ లాంటి బయో పిక్స్ లో అలరించిన ప్రియాంక ఇటీవలే అస్సాం టురిజంకు బ్రాండ్ అమ్బసిడర్ గా ఎంపికైంది. దానికి సంబందించిన కార్యక్రమాల్లో ఒక అంతర్జాతీయ పర్యాటక సంస్థల ప్రతి నిధులతో మాట్లాడుతూ ఆడవాళ్ళు ఇప్పుడు అన్ని రంగాల్లో విజయాలు సద్ధిస్తున్నారని వాళ్ళని వేరు చేసి చూడవలసిన అవసరం లేదన్నది. స్త్రీ, పురుషుల మధ్య వుండే గాఢమైన అనుబంధం వాళ్ళు ఆనందానికి హేతువు అవుతుందని చెప్పింది ప్రియాంక.

    11 మిలియన్ల సంపాదన

    క్వాంటికొ అనే టి.వి షో లో నటిస్తున్న ప్రియాంకా చోప్రా వాణిజ్య ప్రకటనలు, ఇతర కార్యక్రమాల ద్వారాసంపాదించిన మొత్తంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న టి.వి నటిగా ఫోర్బ్స్ పత్రిక…

  • ఆలియా భట్ కు ఈ ఏడాది కపూర్ అండ్ సన్స్ తో సుభారంభం ఇచ్చింది. డియర్ జిందగీ మంచి వసూళ్ళు అందుకుంది. ఇక ఉడ్తా పంజాబీ విడుదలకు ముందే సంచలనం.జాతీయస్థాయి లో పెద్ద చర్చ నడిచింది ఈ చిత్రం తో ఇప్పటి వరకు ఆలియాకున్న ఇమేజ్ వేరు. ఈ ఏడాది ఈ పాత్ర తో వచ్చిన ఇమేజ్ వేరు. అందమైన అమ్మాయి గా నే కాదు. పరిమితి చెందిన నటిగా కూడా పేరు తెచ్చుకుంది. రాబోయే సంవత్సరంలోకూడా ఆమె డైరీ నిండుగానే వుంది. చేసే పాత్రలో ఇమిడిపోయే ఆలియా తన నటన తో అన్ని కోణాలు బయటకు తీస్తుంది. కపూర్ అండ్ సన్స్ లో ఆలియా హాస్య కోణం భయట పెట్టింది. ఉడ్తా పంజాబీ లో బీహార్ నుంచి వచ్చిన యువతి గా ఆలియా నటించింది. ఈ సినిమా కోసం ఆలియా బీహార్, పంజాబీ కలగలిసిన యాసలో మాట్లాడే శిక్షణ తీసుకుంది. పూర్తి డి-గ్లామర్ పాత్రలో నటించి మెప్పించిన ఆలియా భట్ ఉత్తమ నాయికగా రేస్ లో ముందుంది.

    కెరీర్ రేస్ లో ఆలియా భట్

    ఆలియా భట్ కు ఈ ఏడాది కపూర్ అండ్ సన్స్ తో సుభారంభం ఇచ్చింది. డియర్ జిందగీ మంచి వసూళ్ళు అందుకుంది. ఇక ఉడ్తా పంజాబీ విడుదలకు…

  • పళ్ళు తినటం మంచిదే కానీ పళ్ళ రసాలు ఆరోగ్యం కావని చెపుతున్నారు శాస్త్రజ్ఞులు. గ్లాస్ జ్యూస్ కోసం నాలుగు పళ్ళు అవసరమైతే ఆ పళ్ళు జ్యూస్ తీయటం కన్నా తినటం బెటర్ అంటున్నారు. పెద్ద గ్లాస్ పళ్ళ రసంలో పోషకాల కన్నా క్యాలరీ లే ఎక్కువగా శరీరానికి అందుతాయి. అలాగే తేలికగా ఉంటుండీ కదా అని ప్యాక్ చేసిన జ్యూస్ టిన్ పైన లో ఫ్యాట్ అని రాసి ఉన్నప్పటికీ అది నిజం కాదని గ్రహించాలంటున్నారు. అంతే కాదు ప్యాక్ చేసి నిల్వ చేసిన జ్యూస్ లో ఏ ఏ ఫ్రూట్స్ ని కలిపారు నిల్వ ఉండేందుకు వాడిన రసాయనాలు రుచికోసం చేర్చిన చక్కర తక్కువ శాతంలో ఉప్పు ఇవన్నీ లెక్కలు చూడమంటున్నారు. ఒక గ్లాస్ తాజా ఆరెంజ్ జ్యూస్ ద్వారా 110 క్యాలరీలు లభిస్తే అదే తాజా ఆరెంజ్ ద్వారా 62.9 క్యాలరీలు లభిస్తాయి. తాజా ఆపిల్ ద్వారా 87. 9 క్యాలరీలు లభిస్తాయి. ఇదే సాఫ్ట్ డ్రింక్స్ ద్వారా 138 క్యాలరీలు లభిస్తాయట. మిగతా పండిన పండ్ల లో ఫైబర్ శాతం ఎంతో ఎక్కువగా ఉంటుందనీ ఆలా పండిన పండే రుచిగా ఆరోగ్యానికీ మేలు చేస్తుందనీ గ్రహించాలని సలహా ఇస్తున్నారు.

    పళ్ళా ? పళ్ళ రసాలా ?

    పళ్ళు తినటం మంచిదే కానీ పళ్ళ రసాలు ఆరోగ్యం కావని చెపుతున్నారు శాస్త్రజ్ఞులు. గ్లాస్ జ్యూస్ కోసం నాలుగు పళ్ళు అవసరమైతే ఆ పళ్ళు జ్యూస్ తీయటం…

  • అమ్మాయిలు తప్పించుకోలేని ఇబ్బంది నెలసరి. ఈ సమయంలో కలిగే సమస్యలను ఎదుర్కోవాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. తృణ ధాన్యాలతో చేసిన ఆహారం కాల్షియం తగినంత మోతాదులో అందేందుకు పాలు పాల పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఆరుకురలు పప్పు ధాన్యాలు ముఖ్యంగా గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు అవిసె గింజలు తీసుకోమంటున్నారు. ముఖ్యంగా అవిసెలు కాల్షియం తో పాటు మేగ్నేషియం మోతాదు కూడా ఎక్కువ ఈ పోషకాలు నెలసరి సమయంలో నీరసం రాకుండా కాపాడతాయి. కాఫీ చాక్లేట్ల బదులుగా గ్రీన్ టీ చామంతి హెర్బల్ టీ తాగచ్చు. మంచి నీళ్లు బాగా తాగితే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఎదురవకుండా ఉంటుంది. మంచి పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పండ్లు కూరగాయలు ఎక్కువగా వుండే డైట్ తీసుకోవాలి. అలాగే ఆహారం జీర్ణం అయ్యేందుకు శరీరం చైతన్యం ఉండేందుకు పది పదిహేను ,నిమిషాలు నడక కూడా ఆనందమే. అలసట చిరాకు వత్తిడీ వంటివి ఎదుర్కొనేందుకే మంచి ఆహారం.

    ఈ ఆహారం ఆరోజుల కోసం

    అమ్మాయిలు తప్పించుకోలేని ఇబ్బంది నెలసరి. ఈ సమయంలో కలిగే సమస్యలను ఎదుర్కోవాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. తృణ ధాన్యాలతో చేసిన ఆహారం కాల్షియం తగినంత మోతాదులో…

  • ఇంట్లో ఇస్త్రీ చేస్తూ ఉంటే ఒక్కసారి వేడి ఎక్కువై దుస్తులు కాలిపోవటం ఐరన్ బాక్స్ పైన అవి అతుక్కుపోయి మరకలు పడటం సర్వ సాధారణం . ఆ మరకలు పూవు సరికదా వేరే దుస్తులు ఇస్త్రీ చేస్తుంటే అతుక్కుని అవీ పాడవుతుంటాయి. ఒక చిన్న చిట్కా ఉపయోగిస్తే మరకలు పోతాయి. ఒక పల్చని క్లాత్ పైన ఒక గ్లాసు ఉప్పును పొరలుగా పరిచి ఐరన్ బాక్స్ ను మాక్సిమం వేడిచేసి దానితోఉప్పు పైన రుద్దితే దానిపైన ఉన్న మారకలన్నీ మాయం అవుతాయి. ఐరన్ బాక్స్ చల్లారాక దానిపైన ఉప్పు పాత గుడ్డతో తుడిచేస్తే సరి. అలాగే వైట్ వెనిగర్ వేడిచేసి అందులో క్లాత్ ను ముంచి దానితో ఐరన్ బాక్స్ ప్లేట్ శుభ్రం చేయచ్చు. వెనిగర్ వల్ల మరకలు పూర్తిగా పోలేదనిపిస్తే టేబుల్ సాల్ట్ కానీ బేకింగ్ సోడాను వేడిగా ఉన్న లైట్ ఐరన్ బాక్స్ ను తుడిస్తే మెరిసి పోతుంది. హైడ్రోజన్ పెరాక్సిడ్ తో గానీ టూత్ పేస్ట్ తో గానీ ఏ మరకలు పోగొట్టచ్చు. కొన్ని వస్తువులు ఎంతకాలం వాడినా కొత్తవిగా కనిపించాలంటే ఇలాంటి చిట్కాలు ఉపయోగించాలి మరి.

    మరకలు ఇలా పోగొట్టచ్చు

    ఇంట్లో ఇస్త్రీ చేస్తూ ఉంటే ఒక్కసారి వేడి ఎక్కువై దుస్తులు కాలిపోవటం ఐరన్ బాక్స్ పైన అవి అతుక్కుపోయి మరకలు పడటం సర్వ సాధారణం . ఆ…

  • శారీరిక ధారుడ్యాన్ని పరిశీలించుకునేందుకు 50 అధ్యయన నివేదికలను యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నాయకత్వాన ఒక నిపుణుల బృందం అధ్యయనం చేసి ఇచ్చిన సరికొత్త నివేదిక లో ఇప్పటి పిల్లల్లో శారీరిక సామర్ధ్యం తగ్గిపోతోంది. ఈ విశ్లేషణ ప్రకారం తిండి పుష్టి తగ్గిపోయింది. శారీరిక శ్రమ తగ్గింది . ఇళ్లల్లో వంట పాత్రల సైజు కూడా తగ్గింది. ఆరునుంచి 17 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలో తల్లితండ్రుల్లో ఉన్న ఫిట్ నెస్ కూడా లేకపోవటానికి కారణం ఎక్కువసేపు టీవీ చూడటం వీడియో గేమ్స్ శారీరిక శ్రమ ఎంత మాత్రం లేకపోవటం వ్యాయామాలు క్రీడలు ఏవీ లేకపోవటం వల్ల బరువుగా ఉండటం కారణాలంటున్నారు. 26 దేశాల నుంచి రెండు కోట్ల మంది పిలల్లపై ఈ అధ్యయనం జరిగింది. 5 నుంచి 15 నిమిషాల వ్యవధిలో ఈ పిలల్లు ఎంత దూరం పరిగెత్తుతారు? వారి వయసు తిండి వివరాలు పరిగెత్తే సమయంలో హృదయ స్పందన హృదయ నాళికలో పనిచేసే తీరు రికార్డు చేసారు. ఫిట్ నెస్ లో తల్లితండ్రుల కంటే 1. 5 శాతం తక్కువగా వున్నారని బాల బాలికల విషయం పెద్ద తేడా ఏమీ లేదని తేల్చారు. మానవ శక్తీ సామర్ధ్యాలకు సంబంధించి శాస్త్ర వెతలు ఎప్పటికప్పుడు నివేదికలు తయారుచేస్తూనే ఉంటారు.

    పిల్లల్లో క్షీణిస్తున్న శారీరిక సామర్ధ్యం

    శారీరిక ధారుడ్యాన్ని పరిశీలించుకునేందుకు 50 అధ్యయన నివేదికలను యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నాయకత్వాన ఒక నిపుణుల బృందం అధ్యయనం చేసి ఇచ్చిన సరికొత్త నివేదిక లో…

  • ఈ ఏడాది మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. జనవరి లో నాన్నకు ప్రేమతో విజయం మొదలై డిసెంబర్ లో ధృవ విజయంతో పూర్తయింది. ఈ సంవత్సరం నాకు చాలా లక్కీ. నన్ను లక్కీ హీరోయిన్ అంటారు కానీ అదంతా టీమ్ ఎఫెక్ట్. దర్శకుడు రచయిత మంచి సంగీతం అన్నీ కలిసి సినిమా సక్సెస్ చేస్తాయి. నేను కష్టపడతాను అంటోంది. రకుల్ ప్రీత్ సింగ్. నా జీవితంలో పెద్ద రహస్యాలేమీ లేవు. పైగా నేను దాచిపెట్టలేను కూడా అంటోంది లక్కీ హీరోయిన్. ఎప్పుడూ నార్మల్ గా వుంటా. మేకప్ వేసుకోను షూటింగ్ లేకపోతేనే టెన్షన్. ఖాళీగా ఉంటే అస్సలు తోచదు. ఎక్కువగా ఆలోచిస్తే ముసలితనం వచ్చేస్తుందని నాకు భయం. అంటోంది రకుల్. న పని మీద నాకున్న గౌరవమే నన్నీ స్థాయికి తీసుకువచ్చింది. ఇక్కడ ఏదీ నాకు ఈజీ గా రాలేదు. ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు వరస విజయాల ఫేమ్ లో ఉన్నా. మంచి పారితోషకం ఆఫర్ చేస్తున్నారు. అందంగా ఉండటం అనేది పుట్టుకతో వచ్చిందే. ఫుడ్ విషయంలో పెద్ద జాగ్రతలేమీ వుండవు. ఫ్రూప్ట్స్ వెజిటబుల్స్ తీసుకోవటం రోజూ జిమ్ లో గంట గడపటం ఇదే నా బ్యూటీ రహస్యం అన్నది రకుల్ ప్రీత్ సింగ్.

    లైఫ్ లో పెద్ద రహస్యాలేమీ లేవు

    ఈ ఏడాది మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. జనవరి లో నాన్నకు ప్రేమతో విజయం మొదలై డిసెంబర్ లో ధృవ విజయంతో పూర్తయింది. ఈ సంవత్సరం…

  • కంగనా కు ఈ మధ్య అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన ఆధారంగా సాజిర్ నడియార్ వాలా నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా రనౌత్ జూలియా అనే సినిమా నటి పాత్రను పోషిస్తోంది. ముప్పయ్యవ దశాబ్దంలో హాంటర్ వాలే సినిమాలో స్వీట్ క్వీన్ గా నటించిన నాదియా ను తలదన్నేలా కంగనా పాత్ర ఉంటుందని దర్శకుడు విశాల్ భరద్వాజ్ పోల్చి చెప్పాడు. ఈ రంగూన్ సినిమా కధ చాలా బావుంది. ఈ సినిమాలో జూలియా పాత్ర పోషిస్తున్న కంగనా తనను నటిగా తీర్చిదిద్దిన కబీర్ ఖన్నా ను ప్రేమిస్తుంది. ఈ పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ సైనికులకు ఇండియన్ నేషనల్ ఆర్మీ కి జరిగిన యుద్ధం దృశ్యంలో మన్వా షెర్గల్ అనే సైనికుడికి జూలియా మనసిస్తుంది. ఆ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తున్నాడు. ఈ రంగూన్ సినిమా పోస్టర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రంలో కంగనా మార్లిన్ మన్రో అందాలతో కనబడటం ఒక ప్రత్యేకత. అరుణాచల్ ప్రదేశ్ మెక్సికో దీవుల్లో నిర్మాణం జరుపుకుంటున్న రాంజీగోం సినిమా ఫిబ్రవరి 24 న దేశవ్యాప్తంగా విడుదలవుతోంది.

    రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా

    కంగనా కు ఈ మధ్య అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన ఆధారంగా సాజిర్ నడియార్ వాలా నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామా రంగూన్…

  • పట్టు,నేత వంటి ఖరీదైన చీరల తో పాటు మాచింగ్ బ్లవుజ్ ఇచ్చేస్తున్నారు. కనుక గొడవే లేదు.అందమైన చీర ఎంచుకుంటే సరి పోయేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందమైన బ్లవుజు డిజైన్ చేయిన్చుకున్నాకే చీర వైపు చూడటం. కట్టుకునే చీర అతి సాదా సీదా, లేత రంగు అయినా పర్లేదు బ్లవుజు అందాన్ని చీర ఏమి డామినేట్ చేయదు కదా.చీరకి బ్లవుజ్ తోనే అందంరావాలి. ఇప్పుడు ప్రతి స్పెషల్ అకేషన్ కి ప్రత్యేకంగా కనిపించి యునీక్ గా వుండే బ్లవుజ్ కావాలి.అందమైన డిజైనర్ బ్లవుజులు,లేస్ల అందం తో, ఎంబ్రాయిడరీ సగసు తో, రంగు రాళ్ళ మెరుపులతో మెడలో ఒక్క నగ కూడా కనపడనంత జిగేల్ మంటూ వస్తున్నాయి. నిజానికి చెక్కని ప్లైన్ పట్టుకి ఈ మ్యాచింగ్ డిజైనర్ బ్లవుజ్ తోడు చేస్తే వేరే నగలు అవసరమే లేదు.

    ఇప్పుడీ బ్లవుజే ఫ్యాషన్

    పట్టు,నేత వంటి ఖరీదైన చీరల తో పాటు మాచింగ్ బ్లవుజ్ ఇచ్చేస్తున్నారు. కనుక గొడవే లేదు.అందమైన చీర ఎంచుకుంటే సరి పోయేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందమైన…