• నీహారికా , అందరం అమ్మ గురించి మాట్లాడుకుంటాం ,మరి తండ్రి ప్రభావం పిల్లల పై వుండదా అంటారు. కరెక్టే తల్లి కొంచెం దగ్గరగా ఉంటుంది కనుక పిలల్లకు సర్వ సదుపాయాలు తనే చూస్తుంది. కనుక ఒక వేళ జాబ్ చేసే అమ్మయినా పిల్లల విషయంలో ఉన్న సమయం అంతా ఖర్చు పెడుతుంది. కనుక ఆలా అనిపిస్తుంది కానీ టీనేజ్ పిలల్ల పైన తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు గట్టిగా చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ వంటి కష్టమైన సబ్జెక్ట్ లలో రాణించాలంటే తండ్రి ప్రేమ చాలా అవసరం. అనేది వారి అభిప్రాయం అలాగే భాషా పరిజ్ఞానం రావాలంటే కూడా తండ్రి ప్రేమ దగ్గరితనం పిలల్లతో ఎక్కువగా స్నేహంగా గడపటం కావాలి. వయసు పిల్లలు తల్లీ తండ్రీ ఆదరాపూర్వకమైన వాతావరణంలో వుంటే ఎంతో ఉత్సాహంగా వుంటారు. జీవితంలో రాణించేందుకు ఇదెంతో ఉపయోగపడుతుంది. తండ్రి ప్రేమ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది కూడా. టీనేజ్ లో వుండే పిలల్లు తమ శరీరంలో జీవితంలో అనుభవాలు ప్రతి నిమిషం కలిగే మార్పులనీ ఫీలింగ్స్ ని ముందస్తుగా తల్లి తండ్రులకే చెప్పుకునేంత స్నేహంగా వాళ్ళు మెలిగితే అసలు పిలల్ల జీవితాల్లో ఎలాంటి తప్పులూ జరగవు. ప్రతి విషయం వాళ్ళతో చెప్పుకుని తమ సమస్యల్ని తేలికగా పరిష్కరించుకోగలుగుతారు. పిలల్ల కొచ్చే ప్రతి సంకటాన్ని వాళ్ళ ప్రతి చర్యలో అర్ధాన్ని తల్లితండ్రులు గ్రహిస్తే పిల్లల జీవితం బంగారమవుతుంది.

    అమ్మెంతో నాన్నా అంతే

    నీహారికా , అందరం అమ్మ గురించి మాట్లాడుకుంటాం ,మరి తండ్రి ప్రభావం పిల్లల పై వుండదా అంటారు. కరెక్టే తల్లి కొంచెం దగ్గరగా ఉంటుంది కనుక పిలల్లకు…

  • గర్భం దాల్చాక తల్లి మనోభావాలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం ఉంటుందని భారతీయ సంస్కృతి ఏ నాటి నుంచో విశ్వసిస్తోంది. అందుకే ఆమె చురుగ్గా ఉండాలని మంచి వాతావరణం మంచి పరిసరాలు ఉండాలని మంచి పుస్తకాలూ చదువుకోవాలని మంచి సంగీతం వినాలని చెప్తుంటారు. వీటన్నింటి ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందని వారి అభిప్రాయం. ఇటీవల పరిశోధనలు ప్రాచీన నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. తల్లిలోని భావోద్వేగ సంబంధిత హార్మోన్లు బిడ్డకు ట్రాన్స్మిట్ కావటమే ఇందుకు కారణం గర్భంలో వున్నప్పుడు తల్లి తీవ్రమైన వత్తిడి ఎదుర్కుంటున్నట్లైతే ఆ బిడ్డలు హైపరాక్టీవ్ లేదా ఎమోషనల్ సమస్యలతో ఉంటారని సగటు ఐక్యూ కంటే తక్కువ కలిగి ఉంటారని అధ్యయనం లో పేర్కొన్నారు. కాబట్టి తల్లి ఎంత మానసిక ప్రశాంతతతో వుంటే బిడ్డకు అంత మంచిది.

    బిడ్డ పై తల్లి ప్రభావం

    గర్భం దాల్చాక తల్లి మనోభావాలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం  ఉంటుందని భారతీయ సంస్కృతి ఏ నాటి నుంచో విశ్వసిస్తోంది. అందుకే ఆమె చురుగ్గా ఉండాలని…

  • ఆకలి తగ్గిపోతుందని ఫలితంగా బరువు తగ్గి పోతారని యువతరం అదేపనిగా నమితే చూయింగ్ గమ్ వల్ల లాభం ఏదీ ఉండదనీ అందుకు మింట్ గమ్ ఏ మాత్రం సహకరించదని ఈ మధ్యకాలపు పరిశోధనలు చెపుతున్నారు. ఈ మింట్ చూయింగ్ గమ్ వల్ల పండ్ల కూరగాయలు తినాలనే కోరిక తగ్గిపోయి చిప్స్ క్యాండీలు వైపుకు ధ్యాస వెళ్లిపోతుందిట. మింట్ గమ్స్ పండ్ల కూరగాయల రుచి తగ్గిస్తాయి. తక్కువ ఆరోగ్యం ఇచ్చే ఆహారం వైపుకు జిహ్వ కు లాగేస్తాయి. లవంగం భోజనానికి ముందు నమిలితే ఆహారం తక్కువే తింటారేమో గానీ క్యాలరీల మోత భారీగానే వుంటుంది . మింట్ లో వుండే మెంథాల్ పండ్ల కూరగాయల్లోని పోషకాలతో ఇంటరాక్ట్ అయ్యి కొంత చేదు రుచి సృష్టిస్తుంది. దీన్ని చప్పరించే వాళ్ళు ఇక పొటాటో చిప్స్ కాండీల వైపు మళ్లుతారు. కాబట్టి బరువు తగ్గించే మార్గం చూయింగ్ గేమ్ నమలటం మాత్రం కాదు.

    క్యాలరీలు పెంచే చూయింగ్ గమ్

    ఆకలి తగ్గిపోతుందని ఫలితంగా బరువు తగ్గి పోతారని యువతరం అదేపనిగా నమితే చూయింగ్ గమ్  వల్ల లాభం ఏదీ ఉండదనీ అందుకు మింట్ గమ్  ఏ మాత్రం…

  • చీర కట్టులో వుండే అందం నాజూకుతనం ఇంకే డ్రెస్సుల్లోనూ వుండదు. ఫారినర్స్ సైతం మన చీర కట్టుకు వంద మార్కులు ఇచ్చేస్తారు. అయితే చీర కట్టే తీరులోనే వెరైటీ వుంటుంది. పమిటలు కుడిఎడమకు మార్చి కుచ్చిళ్ళు పోసి ఎన్నో రకాలు. ఇందులో మళయాళీల డ్రెస్ చాలా ప్రత్యేకం. ఇక్కడి చీరలను సెట్టుముండు లేదా ముండుమ్ నేరియా తుమ్ అంటారు. ఇది మామూలుగా టూపీస్ కాస్ట్యూమ్. కేరళీయుల ట్రెడిషనల్ కట్టుతీరు. నెరియత్తు అప్పర్ గార్మెంట్ ముండు లోయర్. అయితే చక్కని జరీ అంచులతో ముట్టుకుంటే మెత్తగా తగిలే ఈ అందమైన నేత చీర నూరు శాతం మగ్నం పైన నేసే ఈ చీర ఇప్పుడు ఆరు గజాల మామూలు చీరలు అన్ని ప్రాంతాల వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇక ఈ చీరపైన జరుగుతున్న ప్రయోగాలకు అంతులేదు. నెమలి వెన్నెల పింఛాలు దగ్గర నుంచి ప్రకృతి అందచందాల దాకా ఈ జరీ అంచునేత చీర పై చిత్ర కారులు లేసే అందమైన కళా ఖండాలై అన్ని ప్రాంతాల వారి మనసు దోచేస్తున్నాయి.

    కేరళ కాటన్ పైన వర్ణ సోయగాలు

    చీర కట్టులో వుండే అందం నాజూకుతనం ఇంకే డ్రెస్సుల్లోనూ వుండదు. ఫారినర్స్ సైతం మన చీర కట్టుకు వంద మార్కులు ఇచ్చేస్తారు. అయితే చీర కట్టే తీరులోనే…

  • కొన్ని చిన్న చిన్న పనులు జాగ్రత్తల తాలూకు మెళకువలు తెలుసుకుంటే అంతా మేలే జరుగుతుందని చెపుతున్నారు. అధ్యయనకారులు. కొన్ని పనులు సంతోషం ఇస్తాయి. ఆనంద పెడతాయి. పూర్తిస్థాయి ధాన్యంతో తయారైన సాండ్ విచ్ అరటిపండు చిలకడదుంప తదితర కాంప్లెక్ కార్బోహైడ్రేట్స్ స్నాక్ మూడ్ ను ఒక్క క్షణంలో మెరుగుపరుస్తుంది. తిన్న అరగంట లోపే ఆనందం మనసుకి తెలిసిపోతుంది. ముప్ఫయ్ నిమిషాల గార్డెనింగ్ తో మౌనంగా అరగంట సేపు పుస్తకం చదవటం కంటే సమర్ధవంతంగా ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. ఇరవై నిమిషాల వ్యాయామం మరింత శృంగార స్పందన ఇస్తుంది. రిలాక్సింగ్ బబుల్ బాత్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాలు నిరంతరం వింటుంటే వినికిడి సమస్యలొస్తాయి. రణగొణ ధ్వనుల్ని వినకుండా ఇయర్ ప్లగ్స్ వాడటం ఉత్తమం.

    చిన్న చిన్న పనులతో పెద్ద ప్రయోజనం

    కొన్ని చిన్న చిన్న పనులు జాగ్రత్తల తాలూకు మెళకువలు తెలుసుకుంటే అంతా మేలే  జరుగుతుందని చెపుతున్నారు. అధ్యయనకారులు. కొన్ని పనులు సంతోషం ఇస్తాయి. ఆనంద పెడతాయి. పూర్తిస్థాయి…

  • పాలకూర ఆకుల్ని ఎక్కువ రోజులు తాజాగా వుంచాలంటే కొనగానే పేపర్ టవల్ చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఐదు రోజులు తాజాగా వుంటుంది. అయితే వీలున్నంతవరకు కొన్న మరునాడే వండటం బెటర్. ఆకుల్ని ఐస్ వాటర్ లో ముంచితే మరింత తాజాగా కూర ఆకుపచ్చదనం పోగొట్టుకోకుండా వుంటుంది. బ్రొకోలీని స్టీమ్ చేసి ఆహారంలో భాగంగా తింటే ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి వుంటుంది. అన్నంలో చాలినన్ని పాలుపోసి బ్లెండ్ చేసి కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వెన్న వేసి రెండు నిమిషాల ఉడక పెడితే ఇన్స్టెంట్ వైట్ సాస్ రెడీ. చాకును మరుగుతున్న నీళ్లలో వుంచి ఛీజ్ కాటేజ్ ఛీజ్ లను కట్ చేయటం వల్ల స్లైసులు పొడి కాకుండా నీట్ గా వుంటాయి. కాచిన పాల గిన్నె పైన చిల్లుల ప్లేట్ వుంచితే మీగడ మందంగా కడుతుంది. పాత్రల నుంచి కోడి గుడ్డు వాసన పోవాలంటే సెనగ పిండి వేడి నీటితో గానీ నిమ్మచెక్క రుద్దిగానీ కడిగేయాలి.

    వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారా ?

    పాలకూర ఆకుల్ని ఎక్కువ రోజులు తాజాగా వుంచాలంటే కొనగానే పేపర్ టవల్ చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఐదు రోజులు తాజాగా వుంటుంది. అయితే వీలున్నంతవరకు కొన్న…

  • నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడూ మాట్లాడుకుంటే వచ్చే టాపిక్ లు అందరినీ ఇబ్బంది పెట్టె ప్రశ్న ఒకటి ముందుకొస్తూ వుంటుంది. కొందరు స్నేహితులు లేదా చాలా మంది బంధువులు వ్యక్తిగత అంశాలకు సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తుంటారు. చెప్పకూడదని కాకపోయినా ఇబ్బందిపెట్టే సందర్భం ఇది. ఈ అనుభవం దాదాపు అందరికీ ఎదురవుతుంది. వ్యక్తిగత కుటుంబ ఆర్ధిక అంశాలన్నీ కూడా ఈ ప్రశ్నల్లో ఉండచ్చు. మామూలు కబుర్లతో ఇలాంటి అంశాలు దొర్లితే పట్టించుకోనట్లు విననట్లు వదిలేస్తే కొంత మేలు. ఇది ఒకలిద్దరు ఉన్నప్పుడు వీలవుతుంది. లేదా ఇలాంటి ప్రశ్నల తాలూకు అంశాల్ని వదిలేయమని మృదువుగా చెప్పాలి. ఇంకోసారి అడగరూ. కానీ అన్నింటికంటే ముఖ్యం ఇలాంటి సందర్భాన్ని ఖండించే తీరు ఎదుటి మనిషికి నొప్పి కలగకుండా భాంధవ్యానికి ఇబ్బంది రాకుండా వుండాలి. సాధారణంగా మనుషులందరికీ ఎంతో ఉన్నతమైన సంస్కారం వుంటే తప్ప ఇతరుల గురించి కుతూహలం ఎక్కువగానే ఉంటుంది. సంభాషణను పక్కకు మళ్లించే సామర్ధ్యాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. అంతే పరిష్కారం.

    ఎలాంటి కుతూహలం ఇది

    నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడూ  మాట్లాడుకుంటే వచ్చే టాపిక్ లు అందరినీ ఇబ్బంది పెట్టె ప్రశ్న ఒకటి ముందుకొస్తూ వుంటుంది. కొందరు స్నేహితులు లేదా చాలా మంది బంధువులు…

  • కొన్ని సందర్భాల్లో మనం వాడుతున్న మందులు సురక్షితమూ కాదా వాటివల్ల కలిగే మంచి ఫలితాలతో పాటు అవి చేసే నష్టాన్ని గురించి కూడా మిగతా జాగ్రత్తల తో పాటు డాక్టర్లను తప్పనిసరిగా అడగాలి. ఏదైనా శరీరానికి అసౌకర్యం కలిగితే యాంటీ బయోటిక్స్ వాడక తప్పదు. అయితే యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ తప్పనిసరి వీటిని వేసుకునే ముందు వాస్తవం తెలుసుకోవాలి. గర్భవతిగా ఉంటే బిడ్డకు స్తన్యం ఇస్తూఉంటే వాడే యాంటీ బయోటిక్స్ సురక్షితమా కాదా అడిగి చెక్ చేసుకోవాలి. యాంటీ బయోటిక్స్ తో పాటు వైద్యుడు లాక్టో బిసిల్లస్ గల మందులు ఖాళీ కడుపుతో తీసుకోవచ్చో లేదో అడగాలి. యాంటీ బయోటిక్స్ వాడే సమయంలో యాంటాసిడ్స్ అల్యూమినియం మేగ్నేషియం గలవి లేదా న్యూట్రీషియన్ సప్ప్లమెంట్స్ ఐరన్ జంక్ కాల్షియం గలవి వాడచ్చొ లేదో తెలుసుకోవాలి. ఆల్కహాల్ కొన్నింటికి పడదు ఏమందులు వేసుకొంటున్నా అవగాహన సందేహనివృత్తి అవసరం. నెలసరి రకరకాల హార్మోన్లకు ప్రభావితం అయ్యే స్త్రీల శరీరానికి పడే మందుల విషయంలో తరచి తరచి అడిగినా తప్పులేదు.

    తరచి అడిగి తెలుసుకోండి

    కొన్ని సందర్భాల్లో మనం వాడుతున్న మందులు సురక్షితమూ కాదా వాటివల్ల కలిగే మంచి ఫలితాలతో పాటు అవి చేసే నష్టాన్ని గురించి కూడా మిగతా జాగ్రత్తల తో…

  • హడావిడి జీవితంలో మంచి భోజనం వండుకునేందుకు కూడా సమయం ఉండదు. పిలల్లు పెద్దలు అందరూ ఇన్స్టెంట్ ఫుడ్ వైపే చూస్తుంటారు. కానీ ఎన్నో ఆహార పదర్ధాల్లో నిల్వ కోసం రంగు రుచి కోసం వాడే ఎడిక్టివ్ లు అసంకల్పితంగా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతూనే ఉంటాయి . పానీయాలు ఐస్ క్రీమ్స్ క్యాండీలు బేక్ చేసిన పదార్ధాలు గెలాటిన్ కిసార్టులు సూప్ బేస్ లు డ్రై ఈస్ట్ డ్రై బ్రేక్ ఫాస్ట్ సెరల్స్ తో వాడే కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఒత్తిడి కాలేయం కిడ్నీ సంబంధిత సమస్యలు కొని తెస్తాయి. ఫ్లేవర్ ను పెంచేందుకు దాదాపు అన్నీ ప్రాసెస్డ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ తో మోనో సోడియం గ్లుకా మెట్ వాడతారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. క్వాన్డ్స్ సీ ఫుడ్ సలాడ్ డ్రెస్సింగ్ ల రుచి రంగు పెంచటానికి వాడే ఐటీడీఏ మజిల్ క్రామ్ప్స్ ఉదర సంబంధిత ఇబ్బందులకు దారి తీస్తుంది. బ్రేడ్ రోల్స్ ఫిల్ట్రీ స్టఫిన్గ్ చాకోలెట్ ఉత్పత్తులు ప్రాసెస్డ్ బ్రేడ్ కేక్స్ ఆర్టీఫీషియల్ స్వీటెస్ట్ జెల్లీ లో వాడే సోడియం కాల్షియం ప్రాపియవేట్ ఎలర్జిక్ రియాక్షన్లకు కారణం అవుతోంది.

    ఇవి చేటు తెస్తాయ

    హడావిడి జీవితంలో మంచి భోజనం వండుకునేందుకు కూడా సమయం ఉండదు. పిలల్లు పెద్దలు అందరూ ఇన్స్టెంట్ ఫుడ్ వైపే చూస్తుంటారు. కానీ ఎన్నో ఆహార పదర్ధాల్లో నిల్వ…

  • నిన్ననే పుట్టిన రోజు జరుపుకుంది విద్యా బాలన్. కకోని 2 చిత్రం విజయం సాధించి ఆమె కొత్త సంవత్సరపు కానుక ను అందజేసింది. విద్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువ నటించింది. ఇష్టపడుతుంది కూడా. ముంబై విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్స్ చేసిన విద్యకు నటనాసక్తి చిన్నపటినుంచి ఎక్కువే. మలయాళ నటుడు మోహన్ లాల్ తో చక్రం సినిమాలో నటించాక ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక పరిణీత లగే రహా మున్నాభాయ్ తో బాలీవుడ్ లో ఆమె పేరు మోగిపోయింది. విద్య అవసరం ఉన్న మహిళలలకు సాయం చేయటంలో ముందుండే విద్యకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా ఇచ్చింది. జనవరి 1 న పుట్టిన రోజు జరుపుకుంటున్న విద్యా బాలన్ కు శుభాకాంక్షలు చెప్పేసి 2017 లో ఇంకెన్నో సినిమా అవకాశాలు రావాలని కోరుకుందాం.

    పుట్టిన రోజు శుభాకాంక్షలు

    నిన్ననే పుట్టిన రోజు జరుపుకుంది విద్యా బాలన్. కహాని-2 చిత్రం విజయం సాధించి ఆమె కొత్త సంవత్సరపు కానుక  ను అందజేసింది. విద్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యం…