• నీహారికా ,నిజమే నువ్వన్నది. ప్రతి తరం తర్వాత తరాన్ని తక్కువ చేసి మాటాడుతుంది. కొత్త తరం కన్నా తమ తరం మెరుగైనదని చెపుతోంది. నువువ్ ఈ కొత్త తరానికి చెందిన దానివేకదా.. ఇటీవల వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ లో ఈ తరం స్వార్ధ చింతన 58 శాతం మందిలో ఉందని చెపుతోంది. చక్కని జీతం సౌకర్యాలతో గడుపుతున్నారు. కానీ ఈ తరానికి ఉన్న ఒత్తిడి గతంలో లేదు. ఎన్నో రంగాల్లో ప్రగతి కానీ సామజిక స్పందన చాలా తక్కువ. సాంకేతిక ప్రగతి లో సునాయాసంగా అడుగులేస్తూ ఖండాంతర వివాహాలు కులం మతం తెరలు జారిపడిపోతున్నాయి. కొత్త ఆలోచనలతో గత తరం హక్కు కూడా అందని అంశాలను ఒడుపుగా పట్టుకుని ముందుకెళ్తున్నారు. సేవారంగంలో సత్తా చూపిస్తారు. వేలాదిమందికి మెరుగుపడే ఉపాధి మార్గాలు వెలుగులోకి తెస్తున్నారు. కానీ వస్తావ అంశాలపైనా దృష్టి పెట్టె తీరేలేదా ? సేవాసంస్థలకు ఆర్థికసాయం చేస్తారు కానీ ఆప్తులను పట్టించుకునే అవకాశాలే తీసుకోరు. ఎన్నో రకాలుగా ప్రగతి సాధిస్తున్నారు కానీ తమచుట్టూ ఉన్న సమాజంలో సమస్యలతో ఈ తరానికి సంబంధం లేదు. మనుషుల్లో తడి ఇంకిపోతున్నాదని ఈ తరం పై పాత తరానికి ఉన్న ఫిర్యాదు. భారత దేశం వచ్చే శతాబ్దం లో యువదేశంగా అవతరించనుంది. ప్రపంచ జనాభా యువ తరమే అధికం యువదేశంగా అవతరించనుంది. ప్రపంచ జనాభాలో యువ తరమే అధికం కదా. చిన్న చిన్న విమర్శలను అర్ధం చేసుకుంటే బావుండదూ..

    తీరుమారిపోతున్న యువతరం

    నీహారికా , నిజమే నువ్వన్నది. ప్రతి తరం తర్వాత తరాన్ని తక్కువ చేసి మాటాడుతుంది. కొత్త తరం కన్నా తమ తరం మెరుగైనదని చెపుతోంది. నువువ్ ఈ…

  • అన్నింటితో పాటు వస్త్రాల విషయంలో కూడా సర్వే జరుగుతాయి. అసలు ఎలాంటి వస్త్ర శ్రేణి ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి కదా. ఫ్యాషన్ లో చీరకే అగ్రస్థానం. అసలు చీరకట్టు లోనే బాలెయాన్ని వెరైటలుంటాయి . 16 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారితో చేసిన సర్వే లో 85 శాతం మంది పెళ్లిళ్లకు హాజరైతే చీరె ఎంచుకుంటామన్నారు. 46 శాతం మంది పండగలు ప్రత్యేక సందర్భాల్లో చీరలే అన్నారు. 17 శాతం మంది యువతులు కార్పొరేట్ ఈవెంట్స్ అప్పుడు చీరె కడతామన్నారు. ఈ సర్వే లో 52 మంది శాతం మంది అందమగా చీర కట్టుకోగలరు. 28 శాతం మంది సొంతంగా కట్టుకోవటం కాదు కానీ సాయం తీసోమంటున్నారు. 94 శాతం మంది చీర చాలా రోజులు కట్టకపోతే ఏదైనా వేరే డ్రెస్ లే వాడుతుంటే అబ్బా చీర మిస్ అయిపోతామనిపిస్తుంది. అన్నారు. సర్వే రిపోర్ట్స్ అందమైన చీరలకే డిమాండ్ ఉందని కన్ ఫర్మ్ చేసింది. ఈ సర్వే సంతృప్తి పడి ఫ్యాషన్ డిజైనర్లు సమరోత్సాహంతో అందాల చీరల డిజైన్స్ సృష్టించటంలో మునిగిపోతారన్నమాట.

    చీరె గొప్ప సింగారమన్న సర్వే

    అన్నింటితో పాటు వస్త్రాల విషయంలో కూడా సర్వే జరుగుతాయి. అసలు ఎలాంటి వస్త్ర శ్రేణి ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి కదా. ఫ్యాషన్ లో చీరకే  అగ్రస్థానం. అసలు చీరకట్టు…

  • అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఈ సంవత్సరపు ప్రత్యేకమైన రంగు ఆరోగ్యకరమైన జీవన విధానానికి దగ్గరగా వుండే ఆకుపచ్చే అంటున్నారు. ఆకుపచ్చ రంగులో ఎన్నో భయాలున్నా కొత్తదనాన్ని కోరుకునేవాళ్ళు లేతాకుపచ కోరుకుంటారని నిపుణుల గాఢమైన నమ్మకం. కలర్ థెరపిస్ట్లు ఈ రంగు ఆందళోనననీ డిప్రెషన్ నీ తగ్గిస్తుందంటారు. ఫ్యాషన్ డిజైనర్ సవ్య సాచి డిజైన్ చేసిన చీరలు ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ బోర్డర్ సారీస్ మింట్ క్రిస్టల్ చివరకు రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ శారీ క్రియేట్ చేసిన దానికి తప్పనిసరిగా ఎక్కడో గ్రీన్ కలర్ ఎట్టాచ్డ్ గా వుంటాయి. మొత్తం ఇమేజెస్ అన్నీ చూపిన ప్రతి చీరకు ఏదో రకంగా హరితవర్ణ సోయగం మిక్స్ అవ్వకుండా వుండదు. దీపికా పదుకునే విద్యా బాలన్ కంగనా రనౌత్ వంటి తారలు కట్టుకుని తళుక్కున మెరిసిన చీరల్లో కూడా ఈ ఆకుపచ్చని ఛాయలే ఎక్కువ సిరిసంపదలకు ప్రతీకగా నిలిచే ముదురాకు పచ్చ లేదా గడ్డి రంగు అర్థం విశ్వాసాన్ని పెంచచే రంగులే.

    ఫ్యాషన్ నిపుణుల మెచ్చిన ఆకుపచ్చ

    అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఈ సంవత్సరపు ప్రత్యేకమైన రంగు ఆరోగ్యకరమైన జీవన విధానానికి దగ్గరగా వుండే ఆకుపచ్చే అంటున్నారు. ఆకుపచ్చ రంగులో ఎన్నో భయాలున్నా కొత్తదనాన్ని కోరుకునేవాళ్ళు…

  • పిల్లలు కాన్ఫిడెంట్ గా ఉండాలంటే ముఖ్యమైనది వారి వయస్సుకు తగిన విధంగా స్వతంత్రత ఇస్తూ వుండాలని తమ సొంతంగా ఏవైనా చేయగలిగే స్వేచ్ఛ ఉన్నపడే వాళ్లలో ఆత్మ స్థైర్యం పెరుగుతుందని చెపుతారు సైకాలజిస్టులు. ప్రతి చిన్న పనీ తామే చేసిపెట్టాలని తల్లితండ్రులు భావించటం పొరపాటనీ సరైన మార్గంలో నడిచేలా పిల్లలకు గైడ్ లైన్స్ ఇవ్వాలి తప్ప అన్నీ తామే అన్నట్లు ఉండకూడదంటారు . పిల్లలు చేసే పనిలో చిన్నపాటి లోట్లు తప్పిదాలు జరిగినా ఆమోదించాలి. వాళ్ళు సరిగా వ్యవహరించాలినప్పుడు గుర్తించినట్లు చెప్పాలి. ఎక్కడ పొరపాటు జరిగిందో సున్నితంగా చెప్పాలి. అలాగే పిల్లలకు అనేక పద్ధతులు అనేక విధాలుగా ప్రేమను వ్యక్తం చేయాలి. ఫిజికల్ ఎఫక్షన్ చాలా అవసరం వీలైనన్ని సార్లు దగ్గరకు తీసుకోవాలి. ఎంత ప్రేమించినా దాన్ని వ్యక్తం చేయకపోతే ఉపయోగం ఉండదు. ప్రేమ తాలూకు సిగ్నల్స్ పిల్లలకు అందుతుండాలి. దీనివల్ల పిలల్లతో పాజిటివ్ సెల్ఫ్ ఇమేజెస్ ఏర్పడుతుంది. ఎప్పుడు ప్రతికూల ప్రవర్తన గురించి వారు చేసిన చిన్నపాటి తప్పుల గురించి చర్చలు పెట్టకూడదు. వీలైనంత ఎక్కువ సమయం వాళ్ళతో గడిపి వాళ్ళను స్వేచ్ఛగా ఎరగనివ్వాలి.

    ప్రేమని వ్యక్తం చేస్తేనే ఉపయోగం

    పిల్లలు కాన్ఫిడెంట్ గా ఉండాలంటే ముఖ్యమైనది వారి వయస్సుకు తగిన విధంగా స్వతంత్రత ఇస్తూ వుండాలని  తమ సొంతంగా ఏవైనా చేయగలిగే స్వేచ్ఛ ఉన్నపడే వాళ్లలో ఆత్మ…

  • మనుషులతో అభద్రతా భావం వంటరితనం కుటుంబ సభ్యుల ప్రేమాదరాలు లేకపోవుటం ఇవన్నీ వాళ్ళను చాలా త్వరగా అనారోగ్యాల బారిన పడేలా చేస్తోందని నార్త్ కరోలీనా యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. 2500 మంది పైన ఈ అధ్యయనం నిర్వహిస్తే అవివాహితులు విడాకులు పొందినవారిలో గుండె జబ్బులు పక్షవాతం రావటం చాలా ఎక్కువగా నమోదయ్యాయట. జీవన శైలి ఆహారపు అలవాట్లు బావున్నప్పటికీ ఒంటరిగా జీవించేవారు అవివాహితులు చాలా త్వరగా జబ్బుల బారిన పడ్డారు. వివాహితులు కొందరు అనారోగ్యాలు కుంగదీసినా కోలుకుంటే అవివాహితులు కాస్త అనారోగ్యానికి కోలుకోలేనంత జబ్బు పడ్డారట. కొంతమంది చనిపోయారు కూడా. వివాహితులు కోలుకోవడానికి జీవిత భాగస్వామి సపర్యలు కుటుంబ సభ్యుల భరోసా కారణం రాగా అవివాహితులు ఒంటరిగా వున్నవారు దగ్గరుండి చూసుకునే వారు ఎవ్వరూ లేకపోవటం గానూ మానసికంగా కోలుకోలేక ఒకరకంగానూ మృత్యువును చేరువయ్యారని చెపుతున్నారు. ఒక అభద్రతా భావమే అనారోగ్యాలకు మూలం అని చెపుతున్నారు.

    అభద్రత తోనే ఆరోగ్య సమస్యలు

    https://scamquestra.com/20-kak-vse-nachinalos-u-finansovoy-piramidy-questra-agam-17.html

  • పరుగు పెడితే మోకాళ్ళు తిరిగి పోతాయంటారు చాలా మంది కానీ ప్రతి రోజూ కాసేపన్నా పరుగు పెడితేనే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అంటారు అమెరికా పరిశోధకులు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల స్త్రీ పురుషుల పైన ఈ పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో సగం మంది మోకాలి దగ్గర వాపు ఉన్నవారే . అరగంట పరుగులు పెట్టేస్తే వాపు కనిపించకుండా పోయింది. అంతకు ముందు నొప్పులతో ఉన్న అవస్థ కూడా తగ్గుమొహం పట్టిందట. ప్రతిరోజు అరగంట పరుగుపెట్టటం లేదా వేగంగా నడవటం వల్ల మోకాలి వాపుకు కారణం అయ్యేలా CYTOKINS అనే రసాయనం కనపడకుండా పోయిందిట. 30 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ప్రత్యేకంగా ఈ అరగంట పరుగు మానకుండా ఉండాలనీ భవిష్యత్తులో మోకాళ్ళు నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే ఇప్పటినుంచే ఈ పరుగు తీయటం ప్రారంభించాలని వారు సూచనలిస్తున్నారు. ఆలాగైతేనే వార్ధక్యంలో వచ్చే కాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ కాకుండా ఉంటుందంటున్నారు. అంటే వయసులో వున్నప్పుడే ఈ ఆరోగ్య పరుగుని మొదలుపెట్టాలన్నా మాట.

    పరుగుతో మోకాలు పదిలం

    పరుగు పెడితే మోకాళ్ళు తిరిగి పోతాయంటారు చాలా మంది కానీ ప్రతి రోజూ కాసేపన్నా పరుగు పెడితేనే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అంటారు అమెరికా పరిశోధకులు. 18…

  • సాధారణంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తమ మెటర్నిటీ సెలవులను జాగ్రత్తగా లెక్కపెట్టి తొమ్మిదవ నెల వచ్చే వరకు పని చేస్తారు. ఇలా చేయటం వల్ల ప్రసవం తర్వాత బిడ్డతో ఎక్కువగా గడిపేందుకు వీలవుతుందని కష్టం ఓర్చుకుని పని చేస్తారు. కానీ ఉద్యోగినులు తమ ఆలోచన మార్చుకుని తీరాలి. ఆరవ నెల దాటిన దగ్గర నుంచి ఎక్కువ సేపు కూర్చోవటం రాత్రి పూత పొద్దుపోయే వరకు పనిచేయటం వంటివి గర్భస్థ శిశువుకు ఇబ్బంది పెడతాయి. పైగా డెస్క్ ముందర కదలకుండా అదే పొజిషన్ లో గంటల తరబడి కుర్చీలో ఇరుకుగా ఇబ్బందిగా కూర్చోవటం పొట్టలో పాపాయికి చిరాకే సాయంత్రవేళ కూడా త్వరగా ఆహారం తీసుకుని విశ్రమించటం చాలా మంచిది. రాత్రి పది తర్వాత ఎటువంటి పనైనా అదీ కంప్యూటర్ ముందు కూర్చుని శ్రద్ధగా చేయవలిసిన ఆఫీస్ పనియైన చేయద్దనే హెచ్చరిక. ఆఫీస్ లో గంటల తరబడి కూర్చోవటం పొట్ట పైన వత్తిడి పడుతుంది. గంటల తరబడి పని అదీ మళ్ళీ రాత్రిపూట చేసే పనివల్ల మానసిక వత్తిడి ఈ రెండిటి ప్రభావం కడుపులో పిల్లల ఎదుగుదల పైన ఉంటుంది. ఒత్తిడి కి గురైన తల్లులకు బరువు తక్కువ పిల్లలు పుడుతున్నారని వైద్యులు గ్రహించిన అంశం.

    గర్భిణీలు ఉద్యోగం చేస్తుంటే

    సాధారణంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తమ మెటర్నిటీ సెలవులను జాగ్రత్తగా లెక్కపెట్టి తొమ్మిదవ నెల వచ్చే వరకు పని చేస్తారు. ఇలా చేయటం వల్ల  ప్రసవం తర్వాత…

  • ప్రపంచంలో మంచి తల్లులు తప్పించి చెడ్డ తల్లులు వుండరనే అందరి నమ్మకం. ఆ మంచితనం ఎక్కడినుంచో రాదనీ వారి జన్యువుల లోని ఒక ప్రత్యేక భాగం ఇస్తుందని తేల్చాయి. పరిశోధనలు. ఎ.వి.పి.ఆర్ 1 ఎ అనే జన్యువు మంచితనం నిర్దేశిస్తుందట. పిల్లల పైన పెంచే తల్లి తండ్రులున్నారు. ప్రవర్తన విషయంలో తమ మాటకు కట్టుబడి ఉండకపోతే తల్లులు క్షమించలేరు. భయపెట్టి లేదా దండించి తమ దారికి తెచ్చుకుంటారు. పిల్లలకు అర్ధంకాదని వాళ్ళు పసివాళ్ళని తెలిసినా అలిగే తల్లులుంటారు. ఇటువంటి తరహా ప్రవర్తన వుండే తల్లులతో ఆ జన్యువు దానికి ప్రతిగా మరో జన్యుభాగం కారణమంటున్నారు. ఇదే జన్యువులను తల్లి పిల్లలకు అందిస్తుంది. ఈ జన్యువులోని భాగాలను బట్టి తల్లితో కొందరికి విడదీయలేని బంధం వుంటే మరికొందరు కొంచెం దూరంగా ఉండటం కనిపిస్తుంది. బిడ్డలలో మంచితనం అన్నది తల్లి జన్యువు లోంచే అన్న విషయం రూఢీ చేసాయి పరిశోధనాంశాలు.

    మంచితనం అమ్మ నుంచే

    ప్రపంచంలో మంచి తల్లులు తప్పించి చెడ్డ  తల్లులు వుండరనే  అందరి నమ్మకం. ఆ మంచితనం ఎక్కడినుంచో రాదనీ  వారి జన్యువుల లోని ఒక ప్రత్యేక భాగం ఇస్తుందని…

  • మీకు ఇంత కష్టం అవసరమా అంటున్న రకుల్

    శరీర లావణ్యం విషయంలో అమ్మాయిల రోల్ మోడల్స్ సినీ తారలే. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం హీరోయిన్లను చూసి డైటింగ్ లు ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయద్దంటోంది.…

  • ఏ చీర కట్టినా రాణి అందం మైసూర్ సిల్క్ చీరలు వస్తుందంటారు. దక్షిణాది అమ్మాయిలు. ప్రత్యేక సందర్భాల్లో ఒక్క చీరైనా కొనుక్కుంటారు. కూడా. ఈ చీరలు హుందాగా కళ్ళు చెదిరేలా కట్టిన వారి వయసును బట్టి అందం మారిపోతూ ఉంటుంది. నూటికి నూరు శాతం స్వచ్ఛమైన పట్టు బంగారు జరీ తో తయారవుతుంది చీర. మైసూర్ లోని సిల్క్ ఫ్యాక్టరీలు తయారవుతోంది చీర. మైసూర్ మహారాజా తన సంతతి వారి కోసం 1912 లో స్విట్జర్లాండ్ నుంచి ప్రత్యేకంగా మగ్గాలు తెప్పించి దీన్ని ప్రారంభించారు. రాణులు మాత్రమే ధరించిన ఈ చీర తర్వాత అందరికీ చేరింది. అందుబాటులోకి వచ్చాకే పమిట కొంగు డిజైన్లు దానైకి ఎంబ్రాయిడరీలు వచ్చాయి. బాందినీ టిక్కర్ జత కలిపారు. గతంలో కొన్నే రంగులు వుండేవి. ఇప్పుడు రంగుల ప్రయోగాల్లో కూడా మైసూర్ సిల్క్ చీరల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగాయి. విదేశాల్లోనూ ఈ చీరలకు మంచి డిమాండే వుంది.

    అందాన్ని పెంచే మైసూర్ సిల్క్స్

    ఏ చీర కట్టినా రాణి అందం మైసూర్ సిల్క్ చీరలు వస్తుందంటారు. దక్షిణాది అమ్మాయిలు. ప్రత్యేక సందర్భాల్లో ఒక్క చీరైనా కొనుక్కుంటారు. కూడా. ఈ చీరలు  హుందాగా…