• ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె. ఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. సుధా నారాయణ మూర్తి పేరు పొందిన రచయిత్రి గొప్ప సంఘ సేవకురాలు. ఆమె ఎన్నో ఆర్ఫనేజ్ లు స్థాపించారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కంప్యూటర్స్ లైబ్రరీ ఫెసిలిటీస్ కల్పించారు. కన్నడ లో ఆమె రాసిన డాలర్ బహు ఇంగ్లిష్ తెలుగు తో పాటు ఎన్నో భాషల్లోకి అనువాదం చేశారు. ఎన్నో అవార్డులు ఆమెను కోరి వరించాయి.

    టిటిడి ధర్మ కర్తల మండలి సభ్యురాలిగా సుధామూర్తి

    ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు  దేవాదాయ శాఖ ముఖ్య…

  • కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ తర్వాత వ్యోమగామిగా పరిశోధనలు చేసేందుకు ముందు కోస్తున్నారు. షావనా పాండ్యా. పాండ్యా పూర్వీకులు భారతీయలు. ఆమె కుటుంబం ముంబాయి లో వుంది. ఆమె కెనెడా లో పుట్టి పెరిగింది. ఆమె మంచి గాయని రచయిత. వైద్య విద్య చదివింది. కెనెడా లోని ఆల్చర్టా యూనివర్సిటీ హాస్పిటల్ లో వైద్యురాలిగా పని చేస్తున్నారు. సిటిజెన్ సైన్స్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ ద్వారా జరిగిన ఎంపికలో 3200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో పాండ్యా ఒకరు. మొత్తం ఎనిమిది మంది బృందంగా అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేసేందుకు ఎంపికయ్యారు బయో మెడిసన్ వాతావరణ మార్పుల ద్వారా ప్రయోగాలు చేశామన్నారు బృందం.

    అంతరిక్షంలోకి మూడో అమ్మాయి

    కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ తర్వాత వ్యోమగామిగా పరిశోధనలు చేసేందుకు ముందు కోస్తున్నారు. షావనా  పాండ్యా. పాండ్యా పూర్వీకులు భారతీయలు. ఆమె కుటుంబం ముంబాయి లో వుంది.…

  • నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవాలి. ఎన్ని నైపుణ్యాలు అభ్యాసం చేయాలి. అక్షరాలా ఇప్పుడు తాప్సీ చేస్తోందదే. సినిమా సినిమాకు ఆమె లో ఒక వైవిధ్యం . బేబీ సినిమాలు సీరియస్ పాత్ర చేసి తాప్సీ లో అమితాబ్ తో పోటీపోటీగా నటించింది. ఇప్పడు రాణా హీరోగా వస్తున్నా ఘాజీ సినిమాలో అనన్య గా నటించింది. ఇది కూడా ఆమెను ఓ సవాల్ వంటి పాత్రే నట. ఈ పాత్ర కోసం తా ప్సీ బెంగాలీ నేర్చుకుందిట. అందుకోసం ఒక ట్యూటర్ ని నియమించుకుంది. పాత్రల కోసం కొత్త భాషలు నేర్చుకునే అవకాశం అరుదుగా వస్తుంది. నేర్చుకుంటూ నటిస్తే ఆనందం ఇంకో స్థాయిలో ఉంటుంది. అరుదుగా వస్తుంది. ఇప్పుడు నాకు చాలా మంచి పత్రాలు వస్తున్నాయి. అందులో ఘాజీలో అనన్య పాత్ర ఒకటి అంటోంది తాప్సీ. ఈ సినిమా 17 న విడుదలవుతుంది.

    బెంగాలీ నేర్చుకున్న తాప్సీ

    నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని…

  • ఆంధ్రప్రదేశ్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నేపథ్యంలో లోక్ సభ లో సంఖ్య పరిశీలిస్తే అంతంత గానే ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశ చరిత్రలో మొదటి సారిగా 62 మంది మహిళలు ఎంపికయ్యారు. 2009 ఎన్నికల్లో గెలుపొందిన మహిళల సంఖ్యా 59. మొత్తం 543 సీట్లలో మహిళలు దక్కించుకున్న సీట్ల సంఖ్య 11.23 గా వుంది. మొట్టమొదటి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల శాతం 4.4 శాతం మాత్రమే. అతి తక్కువ శాతం గెలుపొందింది 1977 లోక్ సభ ఎన్నికల్లోనే . ఆ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల శాతం 3.5 గా వుంది . ప్రపంచ వ్యాప్తంగా 189 దేశాల్లో పార్లమెంట్ లో మహిళల సంఖ్య గమనిస్తే ఇండియా 111 వ స్థానంలో వుంది. బంగ్లాదేశ్ 19 వ స్థానంలో నేపాల్ 30 వ స్థానంలో వుంది. చట్ట సభలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని అందరు కోరుకుంటారు కానీ అందుకు ఉపయోగపడే మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం ఇంతవరకు ఆమోదంపొందలేదు .

    మహిళా ప్రాతినిధ్యం అతి తక్కువ

    ఆంధ్రప్రదేశ్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నేపథ్యంలో లోక్ సభ లో సంఖ్య పరిశీలిస్తే అంతంత గానే ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశ  చరిత్రలో మొదటి…

  • అద్దం ముందర నిలబడితే అది నిజమే చెపుతోంది. ,మన మనసులో ఎలా వుండాలనుకొన్నామో ఆలా లేకపోతే శరీర లావణ్యం తీరు మనం ఊహించే అందం ఇవన్నీ వుండకపోవటానికి మన బద్ధకం మాత్రమే కారణం . అందంగా అంటే ఆరోగ్యంగా అని అర్ధం చెప్పుకోవాలి ముందు మనసుకి. ఇప్పుడు మనసు డిసైడ్ చేస్తుంది తప్పనిసరిగా వ్యాయామం చేయి. ప్రతి పూట చూస్తున్నాం. ఈ ఫలాన్ని సినిమాలో హీరో ఓ సినిమా కోసం 30 కిలోల బరువు పెరిగి మళ్ళీ వెంటనే 40 కిలోల బరువు కేవలం ఫిట్ నెస్ శిక్షకుడి ఆధ్వర్యంలో కష్టపడి తగ్గించుకున్నాడని మనం మాత్రం అందులో ఐదో వంతైనా చేయలేమని నెట్ లో వెతికితే పెద్దగా బరువులో వత్తిడి ఆయాస పడనక్కర్లేదని తేలికైన వ్యాయామాలు ఉంటాయి. అవన్నీ ఒక ఆటలాగా సరదాగా ప్రేమగా మొదలుపెడితే చాలు. ఐదు నిముషాలు నుంచి మొదలు పెట్టి అరగంట వరకు సాగదీయచ్చు. అంతెందుకు మన శరీరం లో వచ్చే మార్పులు చెమటోడిస్తే మోహంలో కనబడే మెరుపు మనకు తప్పనిసరిగా ఉత్సాహం ఇస్తాయి . ఓ నెలయ్యాక ఎవరో ఫ్రెండ్ ఎదురై ఎంత బావున్నావో కాస్త తగ్గావు మోహంలో ఎదో సమ్ థింగ్ స్పెషల్ కనిపిస్తోంది. అన్నారనుకోండి ఇంకా ఉత్సాహమే ఉత్సాహం !!

    ఇదే నిమిషాలతో మొదలెట్టండి

    అద్దం  ముందర నిలబడితే అది నిజమే చెపుతోంది. ,మన మనసులో ఎలా వుండాలనుకొన్నామో ఆలా లేకపోతే శరీర లావణ్యం తీరు మనం ఊహించే అందం ఇవన్నీ వుండకపోవటానికి…

  • శిరోజాలకు ఎదో ఒక దువ్వెన తో దువ్వవద్దనీ కొన్ని ప్రత్యేకమైన బ్రష్ ప్రత్యేకమైన శిరోజాలకు మేలు చేస్తాయని చెపుతున్నారు. ఎక్స్ పెర్ట్స్ ఒత్తయిన జుట్టున్న వాళ్ళు స్టర్చి నైలాన్ బ్రష్ లు ముఖ్యంగా చివరలో గుండ్రంగా బాల్ మాదిరిగా ఉండేవి వాడితే అవి మాడుకు హాని చేయవు. వైర్ బ్రిస్టల్స్ కూడా ప్రయత్నం చేయవచ్చు. పల్చని శిరోజాలు ఉంటే బ్రష్ కొనే సమయంలో బ్రిస్టల్స్ బాగా మృదువుగా వున్న వాటిని ఎంచుకోవాలి. వెంట్ బ్రెష్ లు ముఖ్యంగా హేయిర్ డ్రయ్యర్ తో స్టయిల్ చేసినవి జుట్టు కుదుళ్ళని వ్యాల్యుమ్ ఇస్తాయి. మీడియం హేయిర్ అయితే పెద్ద సమస్యలు లేకుండా అన్ని రకాల హేయిర్ బ్రెష్ లు దువ్వెన లు ఒకే మాదిరి పనిచేస్తాయి. దువ్వుకున్నప్పుడు మాడుకు మసాజ్ చేసినట్లు ఉండాలి. ఇక కర్ల్ హేయిర్ అయితే తేలిగ్గా పైపైన బ్రష్ చేయాలి. స్టయిల్ లేదా హెవీ హేయిర్ మాదిరి కాకుండా జుట్టు పొడిబారక ముందు తడిగా ఉన్నప్పుడే దువ్వుకోవాలి. బ్రిస్టల్స్ లేదా దువ్వెన పళ్ళ నడుమ ఖాళీ ని బట్టి ఎంతసేపు దువ్వుకోవచ్చు మనకే తెలిసిపోతుంది. సాధ్యమైనంత వరకు గబగబా తెగిపోయేంత స్పీడ్ గా జుట్టు దువ్వుకోకూడదు.

    దువ్వెనలదీ కీలకమైన విషయమే

    శిరోజాలకు ఎదో ఒక దువ్వెన తో దువ్వవద్దనీ కొన్ని ప్రత్యేకమైన బ్రష్ ప్రత్యేకమైన శిరోజాలకు మేలు చేస్తాయని చెపుతున్నారు. ఎక్స్ పెర్ట్స్ ఒత్తయిన  జుట్టున్న వాళ్ళు స్టర్చి…

  • ఈ మధ్య కాలంలో సోయా వినియోగం పెరిగింది. సొయా పాలు చీజ్ ఎన్నో ఉత్పత్తులు మార్కెట్ లోకి వస్తున్నాయి . న్యూట్రీషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని మహిళలకు ఎంతో ప్రయోజనాకరమని అందరు చెపుతున్నారు. దీన్నో అద్భుతమైన ఆహారం అంటున్నారు. సోయాను సహజ రూపాల్లో అంటే సోయాపిండి పాలు టోఫు ఇలా ఏ రూపంలో అయినా హాయిగా తినచ్చు. ఎలాంటి దుష్ప్రభావాల భయము లేదు. ప్రోటీన్ కు ఇది మంచి ఆధారం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇది గుండెకు మంచిదని ఎముకల్లో సాంద్రత పెంచుతుందని అలాగే ఆస్ట్రియో పోరోసిస్ రాకుండా ఏది రక్షిస్తుందని మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని గుర్తించారు. ఇది మహిళలకు నిస్సందేహంగా మంచి ఆహారం. బ్రేడ్స్ కుకీస్ వంటి బెకెడ్ ఫుడ్స్ సోయాలోని ఏ ఆహార విలువను పోకుండా తయారవుతున్నాయి. ఉదయపు ఆహారంగా సొయా తీసుకుంటే ప్రోటీన్స్ కావలిసినన్ని దక్కినట్టే . సోయాలో ఎన్నో రకాలు టెక్నీక్స్ ఎలా చేసుకోవాచ్చొ అంతర్జాలం లో వెతకచ్చు.

    సోయాచాలా మంచిది

    ఈ మధ్య కాలంలో సోయా వినియోగం పెరిగింది. సొయా పాలు చీజ్ ఎన్నో ఉత్పత్తులు మార్కెట్ లోకి వస్తున్నాయి . న్యూట్రీషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని మహిళలకు…

  • మంచి గుమ్మడి కాయ తో చేసే తియ్యని హాల్వా చాలా బావుంటుంది. అలాగే ఈ గుమ్మడి ముక్కాలా దప్పళం కూడా భోజనాల స్పెషల్. ఏడాది పొడవుగా దొరికే మంచి గుమ్మడి కాయను వింటర్ స్క్వాష్ అని పిలుస్తారు. కాయ పూర్తిగా ఆకు పచ్చ రంగు వదిలి బాగా ఎండి ఎర్రగా అయ్యాకే కోసి వాడతారు . కొంచెం తియ్యని రుచి తో వుండే ఈ గుమ్మడి లో ఎన్నో వెరైటీలు. రోగనిరోధిక వ్యవస్థను బలోపేతం చేసే అద్భుతమైన ఆధారం. ఈ తియ్య గుమ్మడి ప్రీ రాడికల్స్ ను అడ్డు కోగల విటమిన్ సి ఇందులో పుష్కలం క్యాలరీలు చాలా తక్కువ. డైటరీ పీచు చాలా ఎక్కువ. గుమ్మడి గింజల్లో 75 శాతం లినో లిక్. ఓలిక్ యాసిడ్స్ ఉండటం వల్ల తిరుగులేని చిరు తిండిగా పరిగణించబడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ ఇస్తుంది. కాన్సర్ డయాబెటిక్ గుండె జబ్బులపై పోరాడే శక్తి నిస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉంటాయి. బీటా కెరోటిన్ ఉండటం వల్ల ఆస్తమా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ల నుంచి పరిరక్షించడంలో ముందుంటుంది. తియ్య గున్నదిలో చేసే కూడా చాలా బావుంటుంది.

    తిరుగు లేని చిరు తిండి గుమ్మడి

    మంచి గుమ్మడి కాయ తో చేసే తియ్యని హాల్వా చాలా బావుంటుంది. అలాగే ఈ గుమ్మడి ముక్కాలా దప్పళం కూడా భోజనాల స్పెషల్. ఏడాది పొడవుగా దొరికే…

  • ఫ్యాషన్ డిజైనర్ల చేతిలో దండం ఏదైనా ఉందేమో నని వెతికి చూడాలనిపిస్తుంది ఒక్కసారి. ఇప్పుడీ ఫ్యాషన్ ప్రపంచపు ట్రెండ్ గా ఉన్న కొన్ని రకాల డ్రెస్ లకు అచ్ఛం ఆభరణాల్లాంటి ఎంబ్రాయిడరీలు జత చేసారు డిజైనర్లు. అందమైన చీర ఉందనుకోండి దానికి తగిన ఆభరణాలుంటేనే ఏదైనా పార్టీలు ప్రత్యేకం. కానీ అదే ఎంబ్రాయిడరీ జరీ మెరుపులు బ్లౌజ్ తోడైతే . అందులోనూ మంచి ముత్యాలు కుందన్ వెండి బంగారు దారాలతో ఎంబ్రాయిడరీ ఉందనుకోండి ఇక నగల అవసరం ఏముందీ . అలాగే నెక్ కాలర్ పార్టీకి హ్యాండ్ కప్స్ కి ఎంబ్రాయిడరీ జత చేస్తే వేరే నగలే అక్కరట్లేదు. హైనెక్ స్టయిల్ బ్లౌజ్ కు పాజరీ ఎంబ్రాయిడరీ చేసి సాదా సీదా చీర కట్టుకున్న వజ్రాభరణాలు పెట్టుకున్నంత అందం. ఏదైనా వేడుక కు లెహెంగా ఓణీ కావాలనుకుంటే మొత్తంగా డిజైనర్ క్లాత్ తోనే ఆ లెహెమ్ టేస్ట్. ఇవన్నీ ఇప్పటి ట్రెండ్ చేతికొక్క గాజు కూడా వేసుకోవాలిసిన పనిలేదు. అన్నీ డిజైనర్ పనితనమే . నిలువెత్తు బంగారు బొమ్మలా నిలబెట్టాలన్న ఆభారణాలు పోలిన ఎంబ్రాయిడరీ తో మొత్తం డ్రెస్ అంతా నింపేస్తున్నారు. ఇప్పుడిక బంగారు నగలు వజ్రాలు ఈ డ్రెస్ ల ముందు దిగదిడుపే.

    అచ్ఛం నగల్లాంటి డ్రెస్ లు

    ఫ్యాషన్ డిజైనర్ల చేతిలో దండం ఏదైనా ఉందేమో నని వెతికి చూడాలనిపిస్తుంది ఒక్కసారి. ఇప్పుడీ ఫ్యాషన్ ప్రపంచపు ట్రెండ్ గా ఉన్న కొన్ని రకాల డ్రెస్ లకు…

  • నీహారికా , స్నేహానికి కూడా హద్దులుంటాయి అన్నావు. హద్దులంటే స్థలాలకు ళ్ళకు మధ్య ఉండేలాంటివే. కొంతవరకే స్నేహంలో అయినా ముందులేళ్ళగలం. ఎంతవరకు వెళ్ళాలి. ఎలా గుర్తించాలి. అంటే మరి దాన్ని సభ్యతగా ప్రవర్తించటం అనాలి. మనిషి అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతి మనిషి చుట్టూ ఒక హద్దు గీత కనిపించకుండా ఉంటుంది. అది ఎంత దూరం అనేది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటోంది . కొందరి సరిహద్దు చాలా విశాలంగా ఉండి ఎదుటివారిని కొంత మనసుకి దగ్గరగా రానిస్తుంది. కానీ మనం గుర్తించవలిసింది ఎదుటి వాళ్ళ వ్యక్తిగత సమయం వ్యక్తిగత అభిప్రాయాలూ ఆలోచనల హద్దులు స్నేహితులు కదా అని పర్సనల్ విషయాల్లోకి దూసుకుపోవటం అడక్కపోయినా అభిప్రాయాలూ చెప్పేయటం ఒక విషయంలో చాలా త్వరగా ఒక నిరణయానికి వచ్చ్చేయటం స్నేహాలను పాడుచేస్తాయి. అందుకే హద్దులు కావాలన్నది. ఎంత స్నేహితులు ఆత్మ బంధువు లైనా సరే ఒక సున్నితమైన రేఖ ఉంటుంది. మనం దాన్ని దాటి ప్రయత్నం చేయకూడదు . అలాగే అన్నీ గబగబా చెప్పేసుకుని మళ్ళీ మన విషయాలు అవతలి వాళ్లకు తెలిసిపోయాయే అన్న న్యూన్యత మన లోనూ రాకూడదు. అందుకని కొంచెంగా మనకు ప్రైవసీ ఉంచుకోవాలి. అందులోకి ఎవర్ని తొంగిచూడనీయ వద్దు. అదే హద్దుల్లో వుండే స్నేహం అంటే. అలావుంటే స్నేహాలు ఎప్పటికీ శాశ్వతం. !!

    కనిపించని సరిహద్దులుంటాయి

    నీహారికా , స్నేహానికి కూడా హద్దులుంటాయి అన్నావు. హద్దులంటే స్థలాలకు ళ్ళకు మధ్య ఉండేలాంటివే. కొంతవరకే స్నేహంలో అయినా ముందులేళ్ళగలం. ఎంతవరకు వెళ్ళాలి. ఎలా గుర్తించాలి. అంటే…