• ఏ మందులకు జలుబు తగ్గదు. అది ఏ వాతావరణ ప్రభావంతో ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు. కానీ జలుబుకు విటమిన్-డి అన్ని మందుల కన్నా బాగా పని చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జలుబు సాధారణ సమస్యగా పైకి కనపడుతుంది. కొన్ని సందర్భాలలో ప్రనంతకంగా మారే అవకాసం వుంది. జలుబు నుంచి విముక్తి కి విటమిన్-డి వాడండి అంటున్నారు. క్వీన్ యూనివర్సిటీ పరిశోధకులు 14 దేశాలల్లో 11 వేల మంది పైన ఈ పరిశోధన జరిగింది. తీవ్రమైన జలుబు తో బాధ పడే వారికి క్రమం తప్పకుండా విటమిన్-డి సప్లిమెంట్స్ ఇచ్చారు. క్రమేపి జలుబు తగ్గిపోతుంది. కొంతసేపు ఎండలో తిరిగితే విటమిన్-డి అందుతుంది అంటారు. కానీ దాని వల్ల లాభం లేదని విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పుతున్నారు. సో జలుబు వస్తే ఈ విటమిన్ గురించి గుర్తు చేసుకోవాలి.

    జలుబుకు విటమిన్-డి

    ఏ మందులకు జలుబు తగ్గదు. అది ఏ వాతావరణ ప్రభావంతో ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు. కానీ జలుబుకు విటమిన్-డి అన్ని మందుల కన్నా బాగా…

  • టీన్ ఏజ్ పిల్లలకు నెలసరి ఎప్పుడూ సమస్యే. సానిటరీ ప్యాక్స్ ఎన్నో కంపెనీలవి వుంటాయి. ఏవి మేలైనవి అంటూ వుండవు. నెలసరి ఋతుస్రావం పిల్చేయడానికి వుద్దేసించినవే కనుక ప్రత్యేకమైన బ్రాండు బాగుంటుంది అని చెప్పడం కష్టం. ఏది సౌకర్యంగా వుంటుంది అని, ఎవరికి వాళ్ళు కొన్ని రకాలు వాడి తలిసుకోవాలి. ఏ సానిటరీ ప్యాక్ మంచిదో, వాళ్ళ పీరియడ్ తీరు తెన్నులు బట్టి వుంటుంది. ఋతుస్రావం కొందరికి భారీగా కొందరికి తేలికగా వుంటుంది. కొందరికి తక్కువ రోజులు కొందరికి వరం రోజులు సాగుతుంది. ప్యాడ్ ఎలాంటిది అన్నది ఈ విషయం పై ఆధారపది వుంటుంది. భారీగా రుతుస్రావానికి, తక్కువకు, రాత్రులు ఇబ్బంది లేకుండా రకరాకలున్నాయి. కొన్నింటికి వింగ్స్ వుంటాయి. తక్కువ బ్లిడింగ్ కు వీలైన మినీ పాడ్స్ వుంటాయి. ఇవి తరచూ మార్చాలి అవసరాన్ని సౌకర్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.

    బ్రాండ్ కంటే సౌకర్యం బట్టి ఎంచుకోవడం బెస్ట్

    టీన్ ఏజ్ పిల్లలకు నెలసరి ఎప్పుడూ సమస్యే. సానిటరీ ప్యాక్స్  ఎన్నో కంపెనీలవి వుంటాయి. ఏవి మేలైనవి అంటూ వుండవు. నెలసరి ఋతుస్రావం పిల్చేయడానికి వుద్దేసించినవే కనుక…

  • నీహారికా, మహిళా దినోత్సవం రోజున నాకేం చెప్తావు. ఏదో కొత్తదై వుండాలి. నీ జీవితం గుర్తు పెట్టుకొనేదై వుండాలి అన్నావు. సరే విను, ఇవాల్టి ఆధునిక మహిళ మూడు ప్రపంచాల పౌరురాలు. గడప దాటేదాక భర్త, ఇల్లు, పిల్లలు దాటాకా ఆఫీస్ కెరీర్ పోటీ ఇన్ని పాత్రలకు ఎంతో కష్టంతో న్యాయం చేస్తోంది. ఎక్కడ తేడా వచ్చినా అది వైఫల్యమే. ఇన్ని బాధ్యతల మధ్య చిరునవ్వుతో తనకు తాను నిరూపించుకోవాలంటే ముందస్తుగా ఆరోగ్యంగా ఉండాలి. అoదుకే వేళకు సరిగ్గా తినమని చెప్పాలనిపిస్తుంది. శరీరానికి వ్యాయామం, కంటినిండా నిద్ర, మెదడుకు విశ్రాంతి కావాలి.నువ్వు ప్రపంచం గెలవలే కానీ కెరీర్ మహిళవు కావచ్చు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళని తపించే మామూలు అమ్మవీ కావచ్చు. ఏం సాధించాలన్నా ఆరోగ్యంగా వుండాలి. ఆర్ధరైటీస్ తో నీ ఉద్యోగమూ చేయలేవు, నీరసంతో సేవలూ చేయలేవు, అనారోగ్యంతో ఏ సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించలేవు. పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే గ్రామాల్లో స్త్రీలు 80 శాతం రక్తహీనతతో వున్నారు. సగంమంది భారతీయ మహిళలకు ఎయిడ్స్ అంటేనే తెలియదు. లక్ష ప్రసవాలకు ఐదు వందల మరణాలున్నాయి. ఏటా లక్ష రొమ్ము కాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. సగానికి సగం మహిళలకు హైపర్ టెన్షన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఈ లెక్కలకు సమాధానం చెప్పమ్మా. పురుషాధిక్య సమాజానికి సమాంతరంగా స్త్రీల ప్రాధాన్యతా క్రమాలు మారాయి. నిజమే నువ్వెంతో సాధించాలి. ఇంకా సాధిస్తావు కనుక నీ ఆరోగ్యం గురించి కాస్త ప్రాధాన్యం ఇచ్చుకో. నీ స్వభావం మార్చుకో. సున్నితం గానే ఉండు. కానీ ఆరోగ్యంగా ఉండు. తమ ఆకలి పట్టించుకోని, ఆరోగ్యం పట్టించుకోని, ఎప్పుడూ కుటుంబ శ్రేయస్సే ఆలోచించే మహిళా లోకం అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. నీహారికా ఇది నువ్వు గుర్తుంచుకోదగిన కానుకే అనుకొంటాను.

    ఆరోగ్యo జాగ్రత్తమ్మా – నిన్ను నువ్వయినా పట్టించుకో

    నీహారికా, మహిళా దినోత్సవం రోజున నాకేం చెప్తావు. ఏదో కొత్తదై వుండాలి. నీ జీవితం గుర్తు పెట్టుకొనేదై వుండాలి అన్నావు. సరే విను, ఇవాల్టి ఆధునిక మహిళ…

  • 2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు, భారత దేశపు బయోటిక్ రంగంలో తిరుగు లేని ప్రతిభ చూపించారు. కిరణ్ మంజుదాస్ షా, ఫోబ్స్ ప్రకటించిన 2016 జాబితా లో ఈమె పేరు శక్తి వంతమైన మహిళల జాబితాలో వుంది. బయోకాన్ స్థాపించి నాదిపిస్తున్నారు కిరణ్ మంజు దాస్. డయాబెటిక్ రోగాలుని ప్రణాలు కాపాడే ఇన్సులిన్ ని తాయారు చేసే అతి పెద్ద కంపనీ అమెది. బయోకాన్ పరిశోధన విభాగం నుంచి 950 పేటెంట్స్ కి వెళ్ళారంటే ఆ పరిశ్రమ ఎంత గొప్ప స్థానం లో వుందో తేలింది. దేశ ఆరోగ్యం పెంపొందించడంలో తన వంతు కర్తవ్యం నిర్వహించిన కిరణ్ స్ఫూర్తి నిచ్చే మహిళల్లో ముందుంటారు.

    దేశ ఆరోగ్యం కోసం బయోకాన్

    2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు, భారత దేశపు బయోటిక్ రంగంలో తిరుగు…

  • ట్రాక్టర్స్ రాణి అంటారు మల్లికా శ్రీనివాసన్ ను . సాంప్రదాయ తమిళ కుటుంబంలో పుట్టిన మల్లికా టాఫే పరిశ్రమ చైర్ పర్సన్ గా , సిఇఓ గా వ్యవరహిస్తూ దాన్ని లాభాల బాట లో నడిపిస్తున్నారు. అమెరికాలోని విజిసిఓ సంస్థ బోర్డులో ఆమె సభ్యురాలు. టాటాస్టీల్ , టాటా గ్లోబల్ బెవరేజస్ లో మల్లికా డైరెక్టర్. అమెరికాలో బిజినెస్ స్కూల్ లో ఎం.బి.ఏ చేసిన మల్లిక పర్యవేక్షణ లో టుఫే అంటే ట్రాక్టర్ అండ్ ఫర్మా ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఇప్పుడు లక్షకు పైగా ట్రాక్టర్లు తయారు చేస్తుంది. పద్మశ్రీ అవార్డు గ్రహిత. ఫస్ట్ బిజినెస్ విమెన్ అవార్డుని బిబిసి నుంచి అందుకొన్న ఆమె 2016 ప్రపంచ ప్రభావిత మహిళ అయ్యారు. ఆమె అందుకొని అవార్డులు లేవు. సామాజిక సేవలో భాగంగా శంకర్ నేత్రలయం మద్రాస్ కాన్సర్ ఇన్ స్టిట్యుట్ కి అండగా నిలబడుతుంది.

    ట్రాక్టర్స్ రాణి మల్లికా

    ట్రాక్టర్స్ రాణి  అంటారు  మల్లికా  శ్రీనివాసన్ ను . సాంప్రదాయ  తమిళ  కుటుంబంలో  పుట్టిన  మల్లికా టాఫే పరిశ్రమ చైర్ పర్సన్ గా  , సిఇఓ గా…

  • ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసే వంద మందిలో ఒక్కరుగా సునీతా నారాయణన్ పేరుని టైమ్స్ పత్రిక గుర్తించింది. స్వచ్చంధ సేవా సంస్థ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ల ను నడిపిస్తున్న పర్యావరణ వేత్త సునీతా నారాయణన్. బహుళ జాతి సంస్థలు ఉత్పత్తి చేసే సాఫ్ట్ డ్రింక్స్ లో విషపూరిత పదార్ధాలు వున్నాయి అని లేబరేటరీ రిపోర్ట్స్ ద్వారా నిరూపించి కొక్, పెప్సీ, కోలా కంపెనీలకు హడలెత్తించారు సునీత. పండ్లు ముగ్గపెట్టడం లో వాడుతున్న రసాయినాలు నిషేదపు ఉత్పత్తులు ప్రభుత్వం ఇబ్బందన్నా, ఢిల్లీ విధుల్లో డిజిటల్ ఆటో లో వాహనాలు పోయి సి.ఎన్.జి వాడకం వచ్చిందన్న నీడలా దాని వెనక వున్నది సునీత జల కాలుష్యం వచ్చిందన్న, వాయు కాలుష్యం , కాలుష్య కారణాలు డాక్యుమెంటేషన్ చేస్తారు సునీత. పద్మశ్రీ అవార్డు తో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థల అవార్డులు, ఎన్నో గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు సునీత.

    పర్యావరణ పరిరక్షణ లక్ష్యం.

    ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసే వంద మందిలో ఒక్కరుగా సునీతా నారియన్ పేరుని టైమ్స్ పత్రిక గుర్తించింది. స్వచ్చంధ సేవా సంస్థ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్…

  • హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానికి ప్రోచాన్సులర్ కూడా వున్నారామే. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్. ఎండెవర్ ఇండియాకి ఆమె ప్రస్తుత చైర్మన్. ఆమె తండ్రి కె.కె బిర్లా తాత జి.జి బిర్లా, శక్తి వంతమైన వ్యాపార కుటుంబంలో పుట్టిన శోభన పత్రికా రంగంలో అతి చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏనాడో ఆమెను గ్లోబల్ లీడర్ ఆఫ్ టుమారో గా కీర్తించింది. ఔట్ స్టాండింగ్ బిజినెస్ విమెన్ అవార్డు, కార్పోరేటే ఎక్స్ లెన్స్ అవార్డు, జర్నలిజం రంగంలో పద్మశ్రీ , ఆమెను వరించాయి. మింట్ పత్రిక, ఫీవర్ 104, ఎఫ్ ఎమ్ రేడియో ఛానల్ ఆమె రూపం పోసినవే మీడియా రంగం లో తిరుగు లేని మహిళ శోభనా భార్తియా.

    మీడియాలో తిరుగులేని శోభనా

    హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్టాత్మక…

  • ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ గా ఆపైన ఏడేళ్ళ పాటు సిస్కో కి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేసారు. ‘నెక్ట్స్ఇవి’ అనే చైనా కు చెందిన ఎలక్ట్రికల్ కార్ల కంపనీకి అమెరికా విభాగంలో సి.ఇ.ఓ గా పద్మశ్రీ బాధ్యతలు తీసుకున్నారు. ఐ.టి రంగంలో తిరుగులేని రాణిగా పేరు పొందిన పద్మశ్రీ భూగోళం పైన మొబైల్ ఫోన్ గురించి ఆలోచించిన అత్యున్నత సంకేతిక నిపుణురాలు పద్మశ్రీ ఒకరని ఆమె కితాబులు అందుకున్నారు. స్వయం బోదిత వాహనాల రూప కల్పన, ఎలక్ట్రిక్ కారు రూపకల్పనలో ఆమె పోషించిన పాత్రకు ఫోబ్స్ మేగజైన్ ఆమెకు ఆమెకు క్వీన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్ బిజ్ అని పేర్కొన్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే మహిళల జాబితాలో పద్మశ్రీ ఒక్కరు.

    ఐటీ లో తిరుగు లేని పద్మశ్రీవారియర్

    ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ…

  • టీ.వి దర్శకురాలిగా, పప్రోడ్యుసర్ గా , నటిగా, రచయిత్రి గా నేహాసింగ్ ముంబాయి మహిళలకే స్పూర్తి. ముంబాయిలో అమ్మాయిల స్వేచ్చ కోసం, రండి, గుంపులుగా రండి, కలసి కట్టుగా ముంబాయి వీధుల్లో నడవండి. ఆకతాయిల గుండెల్లో రైళ్ళు పరిగేట్టిద్దాం రండి అంటూ పిలుపునిచ్చిన నేహాసింగ్ సంకల్ప బలం తో ఆకతాయిలను లొంగ దీద్దాం అంది. పురుషులు ఎంత స్వేచ్చగా విహరిస్తున్నారు నాకూ అంతే స్వేచ్చ కావాలి మహిళలకు మాత్రం తక్కువ స్వేచ్చ, ఆంక్షలు ఎందుకు. ఇది అంగీకారం కాదు అంటూ మొత్తం మహిళలంతా గళం విప్పేలా చేయగలిగిన ధిక్కార స్వరం నేహాసింగ్. ఈ ఉద్యమానికి ముంబాయి జోహార్ అంది. టీవి సీరియల్స్ షో స్ లో నేహాసింగ్ , సమర/ బిజ్లా అన్న పాత్ర ద్వారా అందరికి పరిచయం. స్టార్ ప్లస్ లో వచ్చిన ఫార్ద్ సీరీయల్ భూమిక పాత్రలో నటించిన నేహా ఇప్పుడు సంచలనం.

    ఒక ధిక్కారం నేహాసింగ్

    టీ.వి దర్శకురాలిగా, పప్రోడ్యుసర్ గా , నటిగా, రచయిత్రి గా నేహాసింగ్ ముంబాయి మహిళలకే స్పూర్తి. ముంబాయిలో అమ్మాయిల స్వేచ్చ కోసం, రండి, గుంపులుగా రండి, కలసి…

  • తిమక్కా అంటే ఎవ్వరూ గుర్తు పట్టారు ఏమో కానీ, సాలుమారద అంటే చెట్ల వరస తిమక్క అంటే మాత్రం కర్ణాటక అందరికి తెలుసు. అభివృద్ధి పేరు తో చెట్లు కులుస్తున్న ఈ రోజుల్లో మొక్కలే ప్రాణం అనుకుని 60 సంవత్సరాలుగా తన స్వగ్రామం హలికల్ కు వచ్చే దారిలో వరుస్సగా చెట్లు నాటి, వాటి సంరక్షణ చేసింది. ఇప్పుడవి పెద్ద వృక్షాలు. ఈమెది ఈ చెట్ల పరిరక్షణ చేసిననదుకు నేషనల్ సిటిజన్ అవార్డు ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం మొక్కలు నటించే కార్యక్రమానికి తిమక్క అని పేరు పెట్టారు. రహదారుల వెంట నీడ నిచ్చే చెట్లను పెంచడమే తిమక్క లక్ష్యం 20 వ ఏట పెళ్ళైన ఆమెకు 40 ఏళ్ళు వచ్చినా సంతానం లేరు. చుట్టూ పక్కల వాళ్ళు ఆమెను గొడ్రాలు అంటే చెరువులో దుకిందట తిమ్మక్క. ఒక్క చెట్టు ఆమె చేతికి దొరికి ఆమెను చవనివ్వలేదట. ఆ నాడు తనకు ప్రాణాలు కాపాడి సందేశం ఇచ్చిందని భావించి, మొక్కలు పెంచడం మొదలు పెట్టింది తిమక్క ఎంతో మంది తిమక్కలు పుట్టి ఈ భూగోలాన్ని పచ్చగా చేస్తే బాగుంటుంది.

    చెట్ల పరిరక్షణ చేసిన తిమక్క

    తిమక్కా అంటే ఎవ్వరూ గుర్తు పట్టారు ఏమో కానీ, సాలుమారద అంటే చెట్ల వరస తిమక్క అంటే మాత్రం కర్ణాటక అందరికి తెలుసు. అభివృద్ధి పేరు తో…