మునగాకు తో ఉపాధి

మునగాకు తో ఉపాధి

మునగాకు తో ఉపాధి

జితేందర్ సరళ దంపతులు ఢిల్లీలో కాలుష్యానికి భయపడి సొంత వూరైనా సోనిపట్ జిల్లా లోని పల్లెకు వెళ్లారు.అక్కడ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకొన్నారు.మునగ మొక్కల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్,ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రీసెర్చ్ చేసి నాణ్యమైన విత్తనాలతో సేంద్రియ ఎరువుతో మునగ మొక్కలు పెంచారు.అవి పెరిగి పెద్దయ్యాక మునగాకు పొడి చేసి అమ్మకానికి పెట్టారు.వాళ్ళ సంస్థ పేరు ‘హస్బెండ్ వైఫ్ ఫామ్’.మునగాకును క్యాప్సూల్ రూపంలో ఉత్పత్తి చేసి లండన్ అమెరికాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు .అతి సామాన్యంగా ఇళ్లల్లో పెరిగే మునగ మొక్క సరాలను పారిశ్రామిక వేత్తను చేసింది.