మట్టి బలాన్ని చెప్పే పరికరం

మట్టి బలాన్ని చెప్పే పరికరం

మట్టి బలాన్ని చెప్పే పరికరం

ప్రతి సంవత్సరం విత్తనాలు నాటే ముందర తమ పొలాల్లో మట్టి పరీక్షించడానికి ల్యాబ్స్ కి పంపుతారు రైతులు. ఆ ఫలితాలు చాలాసార్లు ఆలస్యం అవుతూ రైతులకు ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దానికి మంచి పరిష్కారం కనుక్కున్నారు ఐఐటీ ముంబై శాస్త్రవేత్త డాక్టర్ రాజుల్ పాట్కర్ . వ్యవసాయ క్షేత్రంలోని సాయిల్ హెల్త్ తెలుసుకునే పరికరాన్ని అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలోని పూణే కి చెందిన  రాజుల్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు .బాంబేలో ఎంటెక్ చదివారు అక్కడే రీసెర్చ్ స్కాలర్ గా  ఆరేళ్లకు పైగా ఉన్నారు ఆమె కనుగొన్న న్యూట్రిసెన్స్ అనే చిన్న పరికరం మట్టిలోని పీహెచ్ విద్యుత్ వాహకత, నైట్రేట్ , పొటాషియం ఇట్లా ఆరు పారమితులను పరీక్షిస్తుంది. కాగితం ఆధారిత సెన్సార్ స్ట్రిప్ తో ఇది రైతుకు తెలియజేస్తుంది .ఈ పరికరాన్ని నేరుగా క్షేత్రస్థాయికి తీసుకుని వెళ్లొచ్చు. ఈ పరీక్ష చేసేందుకు 30 సెకండ్లు మాత్రమే పడుతుంది.