ముంబైలోని ఎం ఈస్ట్ వార్డ్ మురికివాడికి చెందిన పది మంది మహిళలు ఇప్పుడు ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ నిర్మించారు. వీళ్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు గా పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులు గా పనిచేస్తున్నారు. 2014లో అణగారిన మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే కోరిక తో కోర్ ఇండియా ప్రతినిధి సుప్రియ జాన్ ఈ ఆలోచన చేశారు. మురికివాడల్లోని మహిళలకు సురక్షితమైన ఉచిత పబ్లిక్ టాయిలెట్స్ కోసం సాగుతున్న రైట్ టు పీ ఉద్యమం మీద ఒక లఘు చిత్రం తీయాలనుకున్నారు. దీన్ని అక్కడ పని చేసే వాళ్లతోనే తీస్తే బాగుంటుందని సుప్రియ ఊహించారు. ఐదు నిమిషాల శానిటేషన్ వీడియో గా మొదలైన ఈ ప్రాజెక్టు తీస్తున్న కొద్ది 70 నిమిషాల డాక్యుమెంటరీగా మారింది ఇది పూర్తి చేయడానికి రెండేళ్లు పట్టింది .ఈ చిత్రానికి మస్త మహిళా మండలి అనే పేరు పెట్టారు మురికివాడలో పనిచేస్తున్న మహిళలే ఈ సినిమాని చక్కగా తీశారు .ఈ చిత్రం తీసినందుకు పదిమంది మహిళలకు 22 వేల చొప్పున పారితోషికం కూడా ఇచ్చారు.














