నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ క్యాంప్ కు సైకిల్ పై ప్రయాణం చేసి చేరుకున్నది దివ్య సింగ్. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరక్ పూర్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేసే దివ్య సింగ్. మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెళ్లాలనే ఆశయంతో తొమ్మిది రోజుల పాటు మైనస్ డిగ్రీల చలిలో 11 కిలోల బరువు మోస్తూ రాళ్లు రప్పల దారిలో సైకిల్ ను భుజాన పెట్టుకుని మోస్తూ కఠినతరమైన ప్రయాణం చేసింది దివ్య సింగ్. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా, ప్రపంచంలోనే రెండో మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొనేలా తన శరీరాన్ని సిద్ధం చేసుకున్నారు దివ్య సింగ్.













