నిఓన్ పేరుతో పుస్తకాలు అద్దెకు ఇచ్చే డిజిటల్ ప్లాట్ ఫారం తీసుకొచ్చారు క్రాంతి గడ షెమారు సంస్థ లో సి ఈ ఓ గా పనిచేస్తున్న క్రాంతి పిల్లలకు స్క్రీన్ టైం తగ్గించి పుస్తకాలు చదివే అలవాటు పెంచాలనుకొన్నారు.నిఓన్ లో ఇప్పుడు 50 వేల పుస్తకాలు ఉన్నాయి నెలకు కొంత మొత్తం చందా కట్టి ఇందులో సభ్యులుగా చేరిన పిల్లలు ఐదు పుస్తకాలు తీసుకోవచ్చు. చదవడం పూర్తయ్యాక సంస్థ వాటిని వెనక్కు తీసుకుంటుంది పిల్లలు మళ్లీ కొత్త పుస్తకాలు తీసుకోవచ్చు. లైబ్రరీల సాయంతో నడుస్తున్న ఈ సంస్థ సేవలు 300 పట్టణాలు నగరాలకు విస్తరించాయి.హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల పుస్తకాలు ఈ డిజిటల్ లైబ్రరీ ద్వారా తీసుకోవచ్చు.














