గంటలకు గంటలు పని, ఆఫీస్ ఒత్తిడి వల్ల కార్తిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదలై చర్మం లోని తైల గ్రంధులను ప్రేరేపించి మనసు పైనా ముఖం పైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు.దీన్ని కార్పొరేట్ యాక్నె అని పిలుస్తున్నారు. ఎక్కువ సేపు ఏసీ గదుల్లో కూర్చోవడం, లాప్టాప్ కంప్యూటర్ల నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల చర్మం సహజరంగుని కోల్పోతుంది. మొటిమలు మచ్చలు వస్తాయి.ఈ స్కిన్ బర్న్ అవుట్ ని పోగొట్టుకునేందుకు పని మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. తేలికైన ఆహారం వేళ తప్పకుండా తీసుకోవాలి. యోగా, ధ్యానం కూడా చర్మాన్ని మళ్లీ కాంతివంతంగా మారుస్తుంది. ఉద్యోగినులు తమ జీవనశైలిని కొద్దిగా మార్చుకోగలిగితే ప్రశాంతంగా ఉండగలిగితే ఈ ముఖం మచ్చలు రావు. అలాగే తినే తిండిలో హై ప్రోటీన్, లో కార్బ్స్ ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు తీపి తినడం మానేయాలి. ఆరోగ్య జీవనంతో అన్ని సమస్యలు పోతాయి.













