“ఉత్థాన ఏకాదశి ప్రసాదం”

“అనిమిషేంద్రులు,మునులు దిక్పతులమర
కిన్నెర సిధ్దులూ…క్రమముతో నీ కొలువుకిపుడూ కాచినారెచ్చరికయా..కొలచినారెచ్చరికయా!!
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా”!!

ఈ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. దీనినే బృందావన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజున శయనించి ఈ రోజున యోగ నిద్ర నుంచి మేల్కొనిన రోజు కావున ఉత్థాన ఏకాదశిగా పూజలు నిర్వహిస్తారు.
యాఙ్ఞవల్కి మహర్షి జన్మించిన రోజు, భీష్మపితామహులు కూడా ఈ రోజే ఆయుధాలను పరిత్యజించి అంపసెయ్యపై శయనించారు.ఉపవాసంతో పూజలు చేసి ద్వాదశ ఘడియలు ప్రవేశించకుండా భోజనం  చేయాలి.శ్రీ  మహావిష్ణువుకి హారతి ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం విశేషం.దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి.అన్నదానం,వస్త్రదానం చేసిన మోక్షం కలుగుతుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పులిహోర,దద్ధోజనం.

-తోలేటి వెంకట శిరీష