టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీ దేవి

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీ దేవి మైనపు విగ్రహం కొలువు తీరింది . 1987లో అనిల్ కపూర్ శ్రీ దేవి నటించిన మిస్ ఇండియా లోని హవా హవాయి పాటలో ఆమె రూపాన్ని పోలిన మైనపు బొమ్మను రూపొందించారు . బంగారు వర్ణపు దుస్తులు తలపైన కిరీటం తో శ్రీ దేవి నిజంగా జగదేక సుందరి లాగే ఉందని,ఆమె ముగ్ద మనోహర రూపాన్ని చూసి ఎంతో సంతోషించమని శ్రీ దేవి అభిమానులు నివాళి సందేశాలు పంపారు . వాటిని మ్యూజియం గోడలపై ప్రదర్శించారు .