ఇది నా వ్యక్తిగత ప్రయాణ గాధ

అయోధ్య అంశం నేపథ్యంలో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నానంటోంది కంగనా రనౌత్ . అపరాజిత్ అయోధ్య పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చెపుతోంది . అయోధ్య రామమందిర నిర్మాణం ఏళ్ళుగా చర్చినీయాంశం అయింది . అయోధ్య కేసు భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసింది తుది తీర్పు ఏళ్ళనాటి వివాదానికి ముగింపు పలుకుతూ దేశ లౌకిక స్ఫూర్తిని నిలబెట్టింది . అవిశ్వాసం నుంచి విశ్వాసం వైపుకు ప్రయాణించే ఓ వ్యక్తి కథగా ఈ సినిమా ఉంటుంది . ఓ రకంగా ఇది నా వ్యక్తిగత ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది . అందుకే నిర్మాతగా నా తొలిచిత్రంలో ఈ అంశాన్ని ఎంచుకున్నాను అంటోంది కంగనా .