అందం పేరు ఆత్మవిశ్వాసం

ఆమెకు పుట్టుక తోనే చేతులులేవు. అయినా అంగవైకల్యం. ఆమె ఆత్మవిశ్వాసానికి ఏమాత్రం అడ్డం రాలేదు. మేక్సీ కో మోడల్ అనా గాబ్రియెలా మొలీనా  ఇటీవల నిర్వహించిన అందాల పోటీలో గెలిచి మిస్,నాన్ బిటాల్ 2020 గా ఎంపికైంది. వైకల్యం ఒక శాపం కాదు,భారం కూడా కాదు. దీన్ని గెలిచేందుకు నేను చిన్నపుటి నుంచి కృషి చేశాను. చేతులు లేకపోయిన నష్టాన్ని కాలివేళ్ళలో పూరించాను అందాల పోటీలంటే శారీరక కొలతలే కాదు, ఆత్మవిశ్వాసం కూడా అని నిరుపించేందుకే ఇంత చేశాను అంటోంది గ్రాబ్రియోలా.