తెల్లని అన్నమే ప్రమాదం

భారత దేశంలో కోట్ల మందికి ప్రధాన ఆహారం వరి అన్నమే. కానీ కూల్ డ్రింక్ కల కన్నా అన్నమే ప్రమాదమని పరిశోధకులు చెపుతున్నారు. బియ్యం తెల్లగా మెరిసేందుకు మిల్లులో పాలిష్ చేయటం వల్ల పోషకాలన్నీ తౌడుగా మారిపోతున్నాయి. అలా పాలీష్ చేసిన బియ్యం తినటం వల్ల పోషకాలు శరీరానికి అందక కేవలం గ్లూకోజ్ రూపంలో చక్కెర మాత్రమే రక్తంలో కలుస్తుంది. అది పెరుగుతూ చివరకు మధుమేహానికి దారి తీస్తోందని పరిశోధకులు చెపుతున్నారు. చైనా ,జపాన్ ,అమెరికా ,ఆస్ట్రేలియా లోని 3.5 లక్షల మందిని 20 ఏళ్ళపాటు పరిశీలిస్తే ప్రతి రోజూ కప్పు అన్నం తినే వారిలో వ్యాధి వచ్చే రేటు 11శాతం పెరిగిందని రుజువైంది. చిన్న కూల్ డ్రింక్ లో కూడా చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందని అలాంటిది అన్నం అంతకంటే ప్రమాదం అంటున్నారంటే పాలీష్ బియ్యం ప్రభావం ఎలా ఉందో తెలుసుకొమంటున్నారు . బ్రౌన్ రైస్ ,దొడ్డు బియ్యం తినమంటున్నారు.