సుధా మూర్తి దాతృత్వం  

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి 120 కోట్ల రూపాయిల ను ఈ కోవిడ్-19 సమయంలో ఖర్చు చేశారు సుధా మూర్తి .వంద గదుల క్వారంటైన్ ఆస్పత్రి ని ఏర్పాటు చేశారు . ప్రతి రూపాయిని నిరుపేదల సంక్షేమమే లక్ష్యం గా వెచ్చించారు .142 వెంటిలేటర్లు 26మల్టీ పారా పేషేంట్స్ మానిటర్స్ , 14 వేల లీటర్ల శానిటైజర్,40 వేల పి పిఈ కిట్  , రెండున్నర లక్షల చేతి తొడుగులు, 32 వేల n95 మాస్కులు ఇలా ఈ సందర్బంలో పనికి వచ్చేవి అన్ని అందించారు .లక్షల కుటుంబాలకు ఆహారం నిత్యావసర వస్తువుల అందించారు .క్షేత్ర స్థాయిలో ఎక్కడ ఏ అవసరం ఉందొ గుర్తించి ఫౌండేషన్ నుంచి సేవలు కొనసాగిస్తున్నారు సుధా మూర్తి ఆమె దాన శీలత ఈ కరోనా వేళ ఇంకోసారి రుజువైంది .