“సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి దేవి ప్రసాదం” 

ఓం శ్రీ మాత్రే నమః 

సఖులూ!! ఈ రోజు మనం విశాఖపట్నం, దేవిపురంలో వున్న రాజ రాజేశ్వరి దేవి దర్శనం చేసుకుని కటాక్షం పొందుదాం పదండి మరి!!
పచ్చని ప్రకృతిలో సాక్షాత్కరించిన దేవి శ్రీ చక్రం రూపంలో ఆలయంలో వెలిసింది.నల్లటి స్వరూపంలో ధగధగాయ మానంగా విరాజిల్లుతోంది.భక్తులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడే లలితా దేవి.అమ్మవారికి అన్ని వేళలా అంగరంగ వైభవంగా నిత్యం పూజలు నిర్వహిస్తారు.
దసరా శరన్నవరాత్రులు చూడడానికి రెండు కళ్ళూ చాలవు.అమ్మవారి దర్శనం చేసుకుని ముక్తి పొందుతారు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర,పాయసం.

-తోలేటి వెంకట శిరీష