పువ్వుల అందాల జమ్ దానీ

బెంగాళి కి చెందిన ఢాకా చీరలు చాలా అందంగా ఉంటాయి. అలాగే అందమైన జమ్ దాని రకం పట్టు చాలా పలుచగా, అందంగా ఉంటుంది. కొన్ని శతాబ్దాలగా బంగ్లాదేశ్ లోని ఢాకా జిల్లాలో ఇవి తయారవుతున్నయి. జమ్ దానీని డకాయి అని కూడ అంటారు.జమ్ దాని అనేది పరిష్యన్ పదం.ఇందులో జమ్ అంటే పువ్వు దాని అంటే కంటైనర్ అని అర్ధం .పువ్వుల పెట్రాన్ లో ఉంటుంది కాబట్టి జమ్ దాని అంటారు. ఈ జమ్ దాని చీరలు వాటితో పాటు స్కార్ఫ్ లు ,హాండ్ కర్చిఫ్ లు తయారు చేస్తారు. వీటి పని తనం చాలా బాగుంటుంది.