పింపుల్ ప్యాచెస్ 

టీనేజ్ వాళ్ళని విసిగించే సమస్యల్లోమొదటిది పింపుల్స్ ఈ మొటిమలకు ముందు లాగ పింపిల్ ప్యాచెస్ బజార్లోకి వచ్చాయి. తేమను నిలిపి వుంచే జెల్ వంటి హైడ్రో కొల్లాయిడ్ తో తయారయ్యె ఇవి ఓ పెద్ద బొట్టు బిళ్ళ సైజులో వుంటాయి వీటి వెనక కాయితాన్ని తీసి స్టిక్కర్ లాగా మొటిమ పైన అతికించి కాస్సేపయ్యాక తీసేయచ్చు. ఇవి మొటిమల పొక్కుల లోపల వుండే చీము వంటి దాన్నిలాగేసి ఉబ్బు ను తగ్గిస్తాయి. వీటిలో టీట్రీ ఆయిల్ కలబంద వంటివి కలుపుతారు ఈ ఔషధ గుణాలున్న పింపుల్ ప్యాచెస్ చూసేందుకు కుందన్ తో అతికించిన పూవుల్లాగా,హృదయాకారంలో ఆకుల్లాంటి అందమైన డిజైన్ లతో ఉంటున్నాయి.ఈ మినీ మాస్క్ ల్లో విటమిన్లు పూల రసాలు అమైనో ఆమ్లాలు ఉంటాయి. రసాయనాలు లేకుండా పైగా అందమైన పువ్వుల్లా ఉండే ఈ పింపుల్ ప్యాచెస్ ను అమ్మాయిలు ఎంతో ఇష్టపడుతున్నారు.