ఒక్కటే కానీ ఎన్నో రకాలు

చోకర్ పెద్దనగ.మెడ నిండుగా ఉండే ఈ చోకర్ ను రకరకాలుగా వాడేలా త్రి ఇన్ వన్ డిటాచబుల్ చోకర్ నెక్లెస్ లు వచ్చాయి. చోకర్ పై భాగాన్ని క్రింది భాగాన్ని విడివిడిగా చిన్న నెక్లెస్ ల మాదిరిగా ధరించవచ్చు. వజ్రాలు ,పచ్చలు ,రాళ్ళు కెంపులు కలగలిసిన ఈ చోకర్ ను లాకెట్ లా విడదీసేలా గొలుసులా ధరించేలా ఏర్సాట్లున్నాయి. ఫ్యాషన్ గా సింపుల్ గా కావాలంటే చోకర్ పై భాగం విడిగా తీసిపెట్టుకొంటే సరిపోతుంది. ఈ ఒక్క నగ ఉంటే చాలు ఇక విడిగా నెక్లెస్ ,గొలుసు పెండెంట్ వంటివి అక్కర్లేదు.