నట్టింట్లో జలపాతం

జలపాతాల సవ్వడి వినేందుకు ఇళ్ళలో వాటర్ ఫౌంటెన్ ను ఏర్పాటు చేసుకొంటున్నారు. పని వత్తిడితో సతమతం అవుతువుంటే ఫౌంటెన్ లోని నీటిని తదేకంగా చూస్తూవుంటే. అలల శబ్దం వత్తిడిని తగిస్తుందట. ఫౌంటైన్లు ఇళ్ళలో అమర్చుకోవటం ఫింగ్ షుయ్ వాస్తులో భాగంగా వచ్చింది పంచభూతాల్లో ఒకటైన నీరు ఇంట్లో పారుతూ ధ్వనిస్తే ఇంట్లో వాళ్ళకు అదృష్టం కలిసివస్తుంది అని నమ్ముతారు చైనీయులు. రాళ్ళూ మొక్కలు బొమ్మలు దీనిలో నీళ్ళు కలగలిసిన ఈ బుల్లి ఫౌంటెన్ ఇంటికి ఎంతో అందం కూడా.