నాణ్యత సౌకర్యం ప్రధానం

ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకుని చిన్నిపాటి ప్రయాణం చుట్టేయవచ్చు. ఒక రోజు ప్రయాణానికి కావల్సినవన్ని ఆ బ్యాగ్ లో ఈజీగా పట్టేస్తాయి. అలాగే అమ్మాయిలు కాలేజీకి ఆఫీస్ కి కూడా ఒక బ్యాక్ ప్యాక్ తో బయలుదేరిపోతారు. లంచ్ బాక్స్ దగ్గర నుంచి అవసరమైన వస్తువులన్ని అందులో సిద్ధంగా ఉంచుకుంటారు. ఇంత ప్రయోజనం ఉన్న బ్యాగ్ ఎంచుకునే ముందర నాణ్యత, సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలో ఎన్నోరంగులుంటాయి. కంటికి ఇంపైన రంగులు చక్కని డిజైన్లు ఫ్లోరల్ డిజిటల్ రకాలున్నాయి. ఆఫిస్ కి కాలేజీకి స్లిమ్ బ్యాగ్స్ బావుంటాయి.వీటిలోనే బ్యాక్ ప్యాక్ లా వాడుకునే డిజైన్లు వచ్చాయి.సన్నగా పొడుగ్గా ఉంటే కాస్త పొట్టిగా ఉండే బ్యాగ్ లు బావుంటాయి. ఎత్తు తక్కువగ ఉంటే పెద్ద బ్యాగ్ లు అసలు బావుండవు.ఈ బ్యాగ్ లు శరీర ఆకృతికి తగ్గట్లు ఎంచుకోవాలి.